Jump to content

Pawan Kalyan In Nara Rohit Foot Steps


Recommended Posts

Posted

నారా రోహిత్‌ని ఫాలో అయిన ప‌వ‌న్‌!

March 13th, 2014, 11:42 AM IST

1394691219-1537.jpg

ప‌వ‌ర్ కోసం కాదు... ప్రశ్నించ‌డానికే వ‌స్తున్నా అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్  మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు. అందుకోసం `జ‌న‌సేన‌` అని  పార్టీ పెట్టబోతున్నాడు. ప‌వ‌న్ ఎత్తుకొన్న ఈ కాన్సెప్ట్ ఏదో బాగానే ఉంది. అయితే... ఇది నారా వారి హీరో సినిమా నుంచి కాపీ కొట్టిందే అంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు. వ‌స్తున్నా... అడ‌గ‌డానికే వ‌స్తున్నా అంటూ నారా రోహిత్ `ప్రతినిధి` అనే సినిమా చేశాడు. 

అందులో హీరో ప్రశ్నించ‌డ‌మే ప‌నిగా పెట్టుకొన్న ఓ సాధార‌ణ పౌరుడు. ఆ సినిమా టీజ‌ర్‌కీ, ట్రైల‌ర్స్‌కీ చ‌క్కటి స్పంద‌న లభించింది. స‌మాజంలో లోటుపాట్లని ఎత్తిచూపుతూ, పాల‌కుల్ని ప్రశ్నించే ఓ యువ‌కుడిగా, ప్రజ‌ల‌కు ప్రతినిధిగా నారా రోహిత్ న‌టించాడు. పోరాడేవాడు పౌరుడైతే యుద్ధం అంటారు... అదే పౌరుడైతే అంటూ నారా రోహిత్ చెప్పిన సంభాష‌ణ‌లు అందులో ఆక‌ట్టుకొంటాయి. ఆ కాన్సెప్ట్‌నే త‌న నినాదంగా చేసుకొన్న ప‌వ‌న్‌కి ఎలాంటి రిజ‌ల్ట్ ద‌క్కుతుందో చూడాలి.

Posted

GP

 

PK is also following tarakaratna foot steps...in his 1st movie he quesns govt

×
×
  • Create New...