bheemavaram_bullodu Posted March 14, 2014 Report Posted March 14, 2014 పవన్ జనసేన సమావేశం అభిమానుల కోలాహలం నడుమ ప్రారంభమైంది. పవన్ వేదికపైకి వచ్చి, కాస్సేపు తనకే స్వంతమైన చిన్న సిగ్గుతో కూడిన చిరునవ్వుతో కాస్సేపు అటు ఇటు కదిలారు. తనను తాను రెడీ చేసుకోవడానికి కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఆపైన బాలగంగాధర్ తిలక్ కవిత..'ఇల్లేమో దూరం, కానీ గుండెల్లో ధైర్యం మాత్రం వుంది'అంటూ ప్రారంభించారు. ధైర్యం వుంది..ధైర్యం వుంది అన్నపుడు జనం జయ జయ ధ్వానాలు చేసారు.సమైక్యంపై స్పష్టీకరణ ఢిల్లీ దొరలు రాష్ట్రాన్ని చీల్చారని కాంగ్రెస్ ను దుయ్యబట్టారు. దీనికి చిరంజీవి ఏం చేస్తారని, తాను అన్నయ్యకు ఎందుకు ఎదురెల్తానని అన్నారు. అన్నయ్యకు ఎదురు వెళ్లేది లేదని స్పష్టం చేసారు. కానీ పరిస్థితి ఇలా వస్తుందనుకోలేదని,తన మానాన తాను సినిమాలు చేసుకుంటానంటే, కాంగ్రెస్ పెద్దలు ఈ పరిస్థితి తెచ్చారని ఆయన అన్నారు. విభజన నేపథ్యంలోనే పార్టీ విడిపోయిన తెలంగాణ - మన తెలంగాణ, పోరు తెలంగాణ అని పవన్ అన్నారు. ఎలా విడగొట్టారో, ఎలాంటి పరిస్ఢితుల్లో విడగొట్టారో చూసాను. వెన్నెముకలేని రాజకీయ నాయకులపై కోపం వచ్చింది. ఆలోచనా విధానం సంతరించుకుని, పాతిక ఏళ్ల లక్ష్యంతోటి మీ ముందుకు వచ్చానని, పార్టీ పెట్టానని, దాని పేరు జన సేన అని ప్రకటించారు. అది మీ సేన, సామాన్యుల సేన, భారత దేశపు సేన అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఏమన్నా గంగానదా? నేను పార్టీ పెడతానంటే రకరకాల మాటలు అన్నారు. విమర్శలు చేసారు. దిగ్విజయ్ సింగ్ గారేమో పార్టీ పెట్టు కానీ, కాంగ్రెస్ లో కలిపేయమన్నారు..కాంగ్రెస్ ఏమన్నా గంగానదా? కెసిఆర్ పై విమర్శ కేసిఆర్ పేరు ప్రస్తావించకుండా, తనకు ఆయనంటే చాలా అభిమానమని, నేను చెప్పకుండానే తిడుతున్నారని, అయినా పడతాను అని, తెలంగాణ స్లాంట్ లో బదులిచ్చారు. నేను ఎలా కనిపిస్తున్నాను..భయపడతానా..రెండు నెలల ముందు ఇలా వచ్చి నిలబడగలనా,.భయపడితే అన్నారు.అమ్మకు చెప్పలేదు పార్టీ వ్యవహారాలు అన్నా పూర్తి చేసాక అనిపించింది. ఎవరికి ఎదురు వెళ్తున్నాను. గుండెల్లో పెట్టుకుని చూసే అన్నయ్యకా, కుళ్లు రాజకీయాలకా? అన్న ఆలోచన వచ్చింది. రెండురోజుల క్రితం వరకు అప్పచెల్లెళ్లకు, అమ్మకు కూడా పార్టీ సంగతి చెప్పలేదు. ఇప్పుడు ఇంటికెళ్తే అమ్మ కొడుతుందేమో కూడా. నాకు సమాజమే ముఖ్యం. సినిమాలు చేస్తున్నా, ఢబ్బులు వస్తున్నాయి. అప్పులు తీరుస్తున్నాం. అని ఆలోచించాను. ఇంటికి వెళ్లి ఇద్దరు కూతుర్లని, కొడుకుని చూసాను.వీళ్లని వదిలి వెళ్తే ఎలా వుంటుంది అని ఆలోచించాను. కానీ పిరికితనంతో రాజకీయాలు చేయలేను. నన్ను చంపినా చంపేస్తారు. నిస్వార్థంగా పని చేస్తే ఇలాగే వుంటుంది.తివిక్రమ్ కు ఇష్టం లేదు నా మిత్రులు చాలా మందికి నేను రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టంలేదు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు. ఆయనతో కూడా తెగేసి ఇక్కడకు వచ్చాను. అలాగే కామన్ మాన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఆగిందని అనుకున్నారు. ఆగలేదు. నా గుండెల్లో వుంది. అదే ఇప్పుడు జనసేనగా మారింది,చిన్నతనంలోనే బాధలు ఓసారి వన్ వేలో వచ్చినందుకు పోలీస్ స్టేషన్ కు పట్టుకుపోయారు. మా అక్కలు, అత్తలు ఈవ్ టీజింగ్ తో బాధపడినా ఏమీ చేయలేకపోయిన వయసు. అప్పటి నుంచి ఈ సమాజం, రక్షణ అన్నీ డబ్బున్నవారికేనా? అన్న బాధ,. ఇరుకుబళ్లు, సదుపాయాలు లేకపోవడం చూసి కోపం, తిరగబడాలన్న ఆవేశం. కానీ ఎవరిపై తిరగబడాలో తెలియదు. అప్పుడు చదివాను. అన్ని సాహిత్యాలు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి,. అప్పడే..అంతేకానీ ఇప్పుడు అవసరమై కాదు కొంతమందలా. దాంతో నన్ను మద్రాసు పంపేసారు. అయినా నా తిరుగుబాటు మనస్తత్వం మారలేదు.అందుకే అన్నీ నేర్చుకున్నా నా ఆవేశం అణచుకునేందుకు శాంతి కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా, యోగా చేసాను. నన్ను నేను కొట్టించుకున్నాను. అయినా శాంతి కలగలేదు. నిరాశ, నిస్పృహ.నా మీద నేనో ఎక్స్ పెరిమెంట్ చేయడం ప్రారంభించాను. సమాజంలో మంచి స్థానం సంపాదించుకున్నాక కూడా ఇలా ఆలోచించగలనా అనుకున్నాను. ఫలితమే ఇప్పుడీ జనసేన. ఎప్పటికి ఇలాగేవుండలగను అని రుజువు చేసుకున్నాను. కోట్లు పోతున్నా, అభిమానులకు దూరమవుతున్నా, పిల్లలు ఏమవుతారని అనిపిస్తున్నా, ఇలా ముందుకు వస్తున్నానంటే, సమాజం, దేశం పట్ల వున్న అభిమానం మాత్రమే కారణం.కాంగ్రెస్ తో ఏకీకభవించను నాకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మిత్రులున్నారు. నేను వారు కలిసినపుడు మంచిగా పలకరిస్తాను. కౌగిలించుకుంటాను. కానీ వారి సిద్దాంతాలతో ఏకీభవించను. వారంతా మంచి వ్యక్తులే, గొప్పవారే. కానీ వారంతా కలిసి, రాష్ట్రాన్ని విభజించిన తీరు నాకు నచ్చలేదు. కానీ అలా అని తెలంగాణకు నేను వ్యతిరేకిని కాదు. కాని అలా అని సీమాంధ్ర ప్రజల, తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తింటే ఊరుకోను.భగత్ సింగ్ ను తలుచుకుంటే బాధ నాకు భగత్ సింగ్ బలిదానం తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఆయన డైరీలు చదివాను. నిజానికి ఆయన చనిపోయిన వయసులో చాలా మంది కుర్రాళ్లు బలాదూర్ తిరుగుతుంటారు. నాలాగా. భగత్ సింగ్..మీ స్ఫూర్తి చచ్చిపోలేదు..నాలాంటివాళ్లున్నాం. విభజన అనంతరం టీవీ డిబేట్లు చూసాను. వెంకయ్య నాయుడు తపన చూసి ఆనందం వేసింది. ఆంధ్ర గురించి ఆయన పడిన తపన చూసి నాకు గౌరవం కలిగితే ఆయన మాత్రం నేను రాజకీయాల్లోకి రావడం దేశానికి పట్టిన దౌర్భాగ్యం అన్నారు. కానీ గౌరవంగా తేవాల్సిన తెలంగాణ, మన తెలంగాణను మీరు అంతా ఎలా తెచ్చారో చూసా..అదే దేశానికి పట్టిన అసలు దౌర్భాగ్యం. నాకు నచ్చిన తెలంగాణ వాది జగ్గారెడ్డి గారు.రాహుల్ బ్రహ్మాచారి అని చెప్పలేదు హనుమంతరావు నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా. రాహుల్ ఒక పెళ్లి కూడా చేసుకోలేదు అన్నారు. కానీ ఒక విషయం మెచ్చుకోవాలి..రాహుల్ పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ, బ్రహ్మచారి అనలేదు. అయినా నాకు తెలియక అడుగుతాను. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే రాజకీయాలు రాకూడదా? ఒకర్ని పెళ్లి చేసుకుని, పదిమందితో తిరిగితే తప్పులేదా? అయినా మీకు తెలియదా లోనావాలా లో రాజకీయ జనాల రాసలీలలు. నా వ్యక్తిగత జీవితం లోకి వసే సోనియా కూతరు, కొడుకు, అల్లుడు దగ్గర నుంచి అందరి జాతకాలు బయటపెడతా.. నా వ్యక్తిగత జీవితాన్ని ఎవరు విమర్శించినా, వారి వ్యక్తిగత జీవితం బయటపెడతా. నాకు పత్రికలు లేవు. చానెళ్లు లేవు కానీ అభిమానులు వున్నారు. సోషల్ నెట్ వర్క్ వుంది. విరాళాల లెక్కలు చెప్పాల్సి వుంటుంది తెలంగాణ జాగృతి సంస్థ చాలా విరాళాలు సేకరించింది. దేశ విదేశాల నుంచి. అవి ఎలా ఖర్చు చేసారు. ఏమయ్యాయి. ఇంక ఎంత వున్నాయి. వాటిని ఏం చేస్తారు అన్నది లెక్కలు చెప్పాలి. నన్ను రేపటి నుంచి కెసిఆర్, కొడుకు, మేనల్లుడు అందరూ తిడతారు. అది సరే. ముందు ఈ విరాళాల లెక్కలు కూడా రెడీ చేయండి. విభజన గోటితో పోయేది నిజానికి తెలంగాణ విభజన గోటితో పోయే సమస్య. దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. ఇరు వైపులా కోట్ల మంది లోలోపల బాధ పడుతున్నారు. నాకే ఈ సమస్య ఓ కుటుంబ సమస్యలాంటిదని అర్థమయినపుడు, దశాబ్ధాల కాలంగా రాజకీయాల్లో వున్న మీకు అర్థం కాలేదా? 1950 నుంచి తెలంగాణ సమస్యలు పట్టించుకుని వుంటే ఇలా జరిగేది కాదు. కెసిఆర్ ను తప్పు పడితే తప్పు. టీఆర్ఎస్ నాయకులను, కాని ఉద్యమకారులను కాని తప్పు పట్టడానికి లేదు. ఇది అందరి పాపం. నేను తెలంగాణలో విస్తృతంగా తిరిగాను. అదిలాబాద్ గిరిజన తండాల వరకు. కానీ ప్రారంభంలో తెలంగాణ లేదు. రాను రాను మొండిగా బలపడింది. ఇది ఎందుకంటే,, నిలకడలేని విధానాల రాజకీయ నాయకులే కారణం.బాబుపై నమ్మకం లేదు నా దగ్గరకు కొందరు సమైక్యాంధ్ర ఉద్యమానికి సారథ్యం వహించమని అడిగారు. జగన్ గారు జైలులో వున్నారు. చంద్రబాబుపై నమ్మకం లేదు అన్నారు. వాస్తవం చెప్పాలి కదా అంటూ బాబుపై పవన్ చణుకు విసిరారు. నాకు ఈ పదవులు పెద్ద విషయం కాదు. గడ్డిపోచతో సమానం. కాపు నాయకులు ఎవరు? పవన్ ను అంగీకరించమని కాపునాయకులు అన్నారని వార్తలు వచ్చాయి. నేనమన్నా వారిని అడిగానా? నాకు కులం అక్కర్లేదు. మతం అక్కరలేదు. అక్కర్లేని విభజన రేఖలు గీస్తే, నాశనమైపోతారు అలాంటివారంతా. ఇది కర్మభూమి. నా భాషను అవమానించారు..యాసను అవమానించారు అన్నారు తెలంగాణ వాదులు. కానీ వటుడింతై..ఇంతింతై అంటూ రాసిన పోతన తెలంగాణ వాడు. అంతే కానీ బొక్కలు విరగ్గొడతాం అనే మాటలు, భూస్వామ్య దురహంకారపు మాటలు. నిజానికి గద్దర్ పాటలకు చొక్కాలు చించుకుని, నృత్యాలు చేసాం. అదీ తెలంగాణ ఆట పాటకు నాకున్న గౌరవం. నిజమైన సీమాంధ్రుల అభిమానం ఎలా వుంటుందో గద్దర్ కు తెలుసు. ఆయనను అజ్ఞాతంలో అక్కున పెట్టుకున్నది సీమాంధ్ర.యువ నాయకుల కోసం వెదుకుతున్నా వచ్చే రెండేళ్లలో పార్టీని నిర్మిస్తాను. యువ నాయకుల కోసం వెదుకుతున్నా. మన సిద్ధాంతాలు భుజాన మోయగల వారి కోసం చూస్తున్నా. అలాంటి వారికి స్వాగతం పలుకుతున్నా. నేను ఎన్నికల్లో పోటీ చేస్తానా చేయనా అన్నది తెలియదు. వేల కోట్ల కోసం టీవీ, పేపర్లు పెట్టడానికి రాలేదు. ఎవరితో శతృత్వం లేదు. అలా అని ప్రజాధనం దోచేస్తుంటే ఊరుకోను. నా దగ్గర గూండాలు లేరు. అభిమానులున్నారు అది చాలు. అన్నీ నాకే అనేవారితోనే సమస్య. కానీ చనిపోయిన తరవాత ఆరు అడుగుల నేల తప్ప మరేదీ మిగలదు. అమ్ ఆద్మీ పార్టీలాగా మరిన్ని గొడవల కోసం రావడం లేదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం వస్తున్నా. పోటీ అన్నది ఇప్పుడు చెప్పలేను. అది ఎప్పుడన్నది తెలియదు. గోడ దూకేవారిని మన పార్టీలో పెట్టం. నాకు అలాంటి వారంటే చిరాకు. కాంగ్రెస్ నాయకులంటే చిరాకు. ఇంకొద్ది రోజుల తరువాత ఊరు ఊరు వచ్చి కలుస్తాను. నా మనస్సంతా రెండు ప్రాంతాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే సుస్థిర పాలన వస్తుంది. అన్నది ఆలోచిస్తున్నాను. కాంగ్రెస్ తప్ప మరే పార్టీతోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా వున్నా. ముందు ప్రజలు సుఖంగా వుండాలి. అందుకు ఎవరు ఏం చేయగలరు అన్నది కావాలి. కావాలంటే చంద్రబాబుతో కూడా మాట్లాడుతా. ప్రతి ఒక్కరితో సంప్రదింపులు జరిపాకే ఏం చేస్తానో తెలియ చేస్తాను. కాంగ్రెస్ హై కమాండ్, షిండే, చిదంబరం, జైరామ్ రమేష్, వీరప్పమొయిలీ..మీ అందరికీ చెబుతున్నా, మీరు చేసిన విభజన బాగాలేదు. అందుకే పిలుపు నిస్తున్నా..కాంగ్రెస్ హటావో..దేశ్ బచావ్.
Recommended Posts