jpnarayan1 Posted March 15, 2014 Report Posted March 15, 2014 ఆవేశమే పవనిజం! (కొత్త పలుకు!)- ఆర్కే Published at: 16-03-2014 00:21 AM రెండు గంటల పాటు సాగిన పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని పరిశీలిస్తే ఆయనను విమర్శించాలో, అభినందించాలో తెలియని పరిస్థితి. వ్యక్తిగతంగా వపన్‌ను విమర్శించడానికి ఏమీ లేదు. రాజకీయంగా చూస్తే మాత్రం ఆయనలో అపరిపక్వత కనిపిస్తోంది. ఆలోచనలు ఎన్నైనా ఉండవచ్చు. వాటిని ఆచరణలో పెట్టడం ఎలా అన్నదే ముఖ్యం. సమాజాన్ని వేధిస్తున్న అంశాల పట్ల అంతర్మథనం చెందాల్సిందే! ఆవేదన వ్యక్తంచేయాల్సిందే! ఆవేశం చూపాల్సిందే! అయితే ఇవన్నీ రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముందు మాత్రమే ఉండాలి. ఒక్కసారి రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నవారు ప్రజలకు భరోసా ఇవ్వగలగాలి. ఈ విషయంలో పవన్ పూర్తిగా విఫలమయ్యారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొత్తపార్టీ 'జనసేన' శుక్రవారంనాడు విడుదలైంది. సినిమా వాళ్లకు సెంటిమెంట్ కొంచెం ఎక్కువ. ఎంత అభ్యుదయ భావాలున్నప్పటికీ పవన్ కల్యాణ్‌కు కూడా సెంటిమెంట్లు ఉన్నట్లు ఉన్నాయి. అందుకే తాను ప్రారంభిస్తున్న కొత్త పార్టీని సినిమాలు విడుదల చేసే రోజైన శుక్రవారం నాడే ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు తీరు, ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన సుదీర్ఘ ప్రసంగంపై మిశ్రమ స్పందన వచ్చింది. ప్రశ్నించడం కోసం పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన పవన్ కల్యాణ్ స్వయంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వస్తున్నది. ఎందుకంటే, మొత్తం వ్యవహారం ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం వలె కాకుండా ఒక సినిమా ఆడియో ఫంక్షన్‌ను తలపించింది. కొంతమంది అయితే కామెడీ షో చూసిన అనుభూతి పొందారు. 'జనసేన' ఆవిర్భావం ఎవరికి ఎలా కనిపించినా పవన్ కల్యాణ్ ఒక పట్టాన అర్థంకాడని మరోమారు రుజువైంది. ఆవేశం, ఆక్రోశం, ఆవేదన, అంతర్మథనంతో పాటు ఆయోమయం, కించిత్ నిస్పృహ కూడా ఆయనలో కనిపించాయి. ఒకటి మాత్రం నిజం! మిగతా సినిమాస్టార్ల వలె సినిమాలలో నటించామా? డబ్బు పోగేసుకున్నామా? అని ఆలోచించే మనిషి కాదు ఈ పవన్ కల్యాణ్. దేశం గురించి, సమాజం గురించి ఆలోచించే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అదే సమయంలో ఆలోచనలను ఆచరణరూపంలో ఎలా పెట్టాలో తెలియని ఆయోమయం కూడా పవన్‌లో కనిపిస్తుంది. నిజాయతీని, ఆత్మవిశ్వాసాన్ని, చావుకు కూడా వెరవని ధైర్యాన్ని ఆలంబనగా చేసుకుని ఆయన రాజకీయాలలోకి అడుగిడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో శేషప్రశ్నలు! పవన్ లాంటి వ్యక్తులు ప్రస్తుత రాజకీయాలలో ఇమడగలరా? అనేది ప్రధాన ప్రశ్న! పవన్ వద్ద డబ్బు లేదు. సొంత ఇల్లు కూడా లేదు. సినిమాలలో నటిస్తూ సంపాదించినదంతా మాజీ భార్యలకు పంచేశారు. ప్రస్తుతం ఆయన వద్ద 40 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. డబ్బు లేకపోయినా అభిమానులు ఉన్నారన్న తెంపరితనంతో ఆయన రాజకీయాలలోకి వచ్చి ఉంటారు. ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాలు చేయాలంటే గుండెనిండా ధైర్యం ఉంటే చాలదు. డబ్బు కావాలి. అభిమానులను నమ్ముకుంటే గోతిలో పడటమే. అన్న చిరంజీవి విషయంలో ఇది రుజువైంది. కుళ్లిపోయి కంపుకొడుతున్న ఈ రాజకీయ వ్యవస్థ మారాలంటే కొత్త పార్టీలు పెట్టి లాభం లేదు. ప్రజలలో మార్పు లేదా చైతన్యం తీసుకురావడానికి కృషి చేయాలి. అవినీతికి వ్యతిరేకంగా లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని తీసుకుందాం! దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని నిర్మూలించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే, ఆ క్రమంలో అవినీతి చర్యల నుంచి తమను మినహాయించాలని అదే ప్రజలు భావిస్తున్నారు. అన్నా హజారే పుణ్యమా అని లోక్‌పాల్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అంతమాత్రాన అవినీతి ఆగిపోయిందా? వ్యవస్థలో మార్పురాకుండా ఎన్ని చట్టాలు వచ్చినా అవినీతి అంతమవ్వదు. వ్యవస్థలో మార్పు ఎలా తీసుకురావాలన్నదే ప్రస్తుత ప్రశ్న! 'సమాజాన్ని మార్చడానికి నువ్వెవరు? ముందు నిన్ను నీవు సంస్కరించుకో' అన్నదే ప్రధానం. లోపం అంతా ఇక్కడే ఉంది. నేను తప్ప మిగతా అందరూ మారాలని, పరిశుద్ధాత్మలుగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. దీంతో సమాజం మొత్తం గందరగోళానికి, నిరాశ నిస్పృహలకు గురవుతోంది. రాజకీయాలను ప్రక్షాళన చేస్తామంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఏడాది తిరగక ముందే ఒక విఫల ప్రయోగంగా మారబోతోంది. ఆ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ దుందుడుకు వ్యాఖ్యల వల్ల 'ఆప్' పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. దీంతో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సడలుతోంది. నీతిమంతమైన రాజకీయాలను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలతో వెల్లడైంది. అయితే, నీతిమంతమైన రాజకీయాలను అందిస్తామని ముందుకొస్తున్నవారు ఆచరణాత్మక వైఖరి అవలంబించకపోవడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. ఈ పరిణామాలను గమనించకుండా పవన్ కల్యాణ్ కేవలం ఆవేశాన్ని నమ్ముకుని రాజకీయ పార్టీ ప్రారంభించారు. వ్యవస్థలపై నమ్మకం కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితులలో కేవలం మాటలతో ప్రజలను నమ్మించలేం. జనసేన ఏర్పాటులో ఆవేశం, ఆవేదన కనిపిస్తున్నదే కానీ ఆచరణాత్మకత కొరవడింది. సినిమా గ్లామర్‌ను ఉపయోగించుకుని ఒక పిలుపు ఇచ్చినంత మాత్రాన జనం వచ్చి ఓట్లు వేసే రోజులు పోయాయి. ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన కనీస లక్షణాలు కూడా లేనప్పుడు ఆ పార్టీని ఎవరు ప్రారంభించినా ప్రజలు విశ్వసించరు. జనసేన పార్టీ వ్యవహారం కూడా ఇలాగే ఉంది. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా పవన్ కల్యాణ్ తన అభిమానుల సమక్షంలో కొత్త పార్టీని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని అభిమానులు చూడటానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లన్నింటికీ బోలెడు ఖర్చు అవుతుంది. చేతిలో లక్ష రూపాయలు కూడా లేని పవన్ అంత డబ్బు ఎలా ఖర్చుపెట్టారు? ఆ డబ్బు ఎవరు సమకూర్చారు? వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. మామూలుగా అయితే ఇది చిన్న విషయం. అయితే కొన్ని రాజకీయ పక్షాలను టార్గెట్ చేసి పవన్ విమర్శలు, హెచ్చరికలు చేశారు కనుక ఇకపై ఆయన ఆయా పార్టీలకు టార్గెట్‌గా మారబోతున్నారు. జనసేన పార్టీ విషయంలో ప్రధానలోపం పవన్ కల్యాణ్‌ను మినహాయిస్తే ఆ పార్టీకి ముందూవెనకా ఎవరూ లేకపోవడం. పార్టీ ఏర్పాటు వేదికపైకి ఒంటరిగా వచ్చి, ఒంటరిగానే వెళ్లిపోయారు. ఎదురుగా వేలసంఖ్యలో అభిమానులు ఉండవచ్చుగానీ, రాజకీయ పార్టీకి ఒక యంత్రాంగం అంటూ ఉండాలి. అదేమీ జనసేన పార్టీలో కనిపించడం లేదు. కర్త, కర్మ, క్రియ అంతా పవన్ మాత్రమే అయితే ఒక రాజకీయ పార్టీగా జనసేన నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది. రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ప్రధాన ఆకర్షణ ఒక్కరే ఉంటారు. అయితే, బాధ్యతలు పంచుకోవడానికి చుట్టూ చాలామంది ఉండాలి, ఉంటారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు కూడా అనుభవజ్ఞులైన కొంత మందిని తనతో పెట్టుకున్నారు. పవన్ అలా కాకుండా ఒక సినిమా ఫంక్షన్‌కు హాజరైనట్టు వచ్చివెళ్లారు. మరో ప్రధాన లోపం ఏమిటంటే జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీచేస్తుందో లేదో, చేస్తే ఎన్ని స్థానాలకు పోటీచేస్తుంది? అన్న విషయాలలో ఆయన స్పష్టత ఇవ్వకపోవడం. తాను పోటీచేసేది కూడా అనుమానమేనని పవన్ చెప్పారు. తన పార్టీ తరఫున కొంతమంది పోటీచేయవచ్చునని, కాంగ్రెస్ మినహా మిగతా ఏ పార్టీలతోనైనా పొత్తుకు అభ్యంతరం లేదని అన్నారు. ఏవో కొన్ని స్థానాలకు పోటీచేసేటట్లయితే ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం చిక్కదు. జనసేన పార్టీ పోటీచేసే స్థానాలలో ఓట్లుచీలి ఇప్పుడున్న పార్టీలలో ఎవరో ఒకరికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మొత్తంమీద పవన్ కల్యాణ్‌లో ఎంత ఆవేశం ఉందో అంత అస్పష్టత కూడా ఉందనిపిస్తోంది. తన పార్టీ జెండా, ఎజెండా ఏమిటో కూడా వివరించలేదు. చివరిలో చెబుతానని చివరకు మర్చిపోయి ప్రసంగాన్ని ముగించి వడివడిగా వెళ్లిపోయారు. విలక్షణత నిజమే.. నిజానికి పవన్ కల్యాణ్ ఒక విలక్షణ వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన పుస్తకాలు బాగా చదువుతారు. సమాజం గురించి కూడా విపరీతంగా ఆలోచిస్తారు. 'నా జీవితం నా ఇష్టం' అని భావించే వ్యక్తి ఆయన! అందుకే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. పవన్‌ను అర్థంచేసుకోవడం కూడా కష్టమే! ఒక్కటి మాత్రం నిజం. ఆయనలో నిజాయతీ, నిబద్ధత ఉన్నాయి. భావావేశంతోనే ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. తన ప్రస్తుత పరిస్థితికి చిన్నప్పుడు తనను ప్రభావితం చేసిన సంఘటనలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. మనకు మామూలుగా కనిపించే అంశాలు ఆయనకు అసాధారణంగా కనిపిస్తాయి. అందుకే పవన్ చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రభావితం అవుతారు. పార్టీ ఏర్పాటు సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆసాంతం సామాన్య ప్రజల ఆక్రోశాన్ని గుర్తుచేసింది. ఆయన సంధించిన ప్రశ్నలు మనం ప్రతిరోజూ వేసుకుంటున్నవే! అందరివద్ద ప్రశ్నలు మాత్రం ఉన్నాయి. వాటికి సమాధానాలు దొరకడం లేదు. పవన్ కూడా ప్రశ్నలే చదివారు. వాటికి తన వద్ద ఉన్న సమాధానాలు ఏమిటో చెప్పలేదు. సమాజంలోని ప్రస్తుత రుగ్మతలకు తన పార్టీ సూచించే పరిష్కారాలు ఏమిటో ఆయన చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీపై తన కోపాన్ని వెళ్లగక్కారు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో అన్నారు. ఇందుకోసమే అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ అవసరం కొత్తగా లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడానికి దేశ ప్రజలు ఇదివరకే సిద్ధమైపోయారు. ప్రజలలో భావోద్వేగాలు ఉండవచ్చుకానీ, నాయకులలో ఉండకూడదు. పవన్ విషయం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆయనలోనే భావోద్వేగాలు పుష్కలంగా ఉన్నాయి. నాయకులే భావోద్వేగాలకు గురైతే దిశానిర్దేశం ఎవరు చేయాలి? ఎన్నికలలో అన్ని స్థానాలకు పోటీచేసే పరిస్థితి కూడా లేనప్పుడు రాజకీయ పార్టీ అవసరం ఏమిటన్నదే ప్రశ్న! ప్రశ్నించడం కోసం కొంతమంది ఉండాలన్నది పవన్ ఉద్దేశం కావచ్చు. ప్రశ్నించడానికి చట్ట సభలలోకి వెళ్లవలసిన అవసరం లేదు. వెలుపల నుంచి కూడా ప్రశ్నించవచ్చు. ప్రభావితం చేయవచ్చు. లోక్‌సత్తా ఉద్యమాన్ని జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించినప్పుడు ప్రజల్లో దానికి మంచి ఆదరణ లభించింది. ప్రభుత్వ నిర్ణయాలతో పాటు, రాజకీయ పార్టీల ఆలోచనలను కూడా ఆ ఉద్యమం ప్రభావితం చేయగలిగింది. లోక్‌సత్తా ఉద్యమాన్ని కిందిస్థాయి వరకు విస్తరింపచేయకుండా హైదరాబాద్ స్థాయిలో ఫలితాలను చూసి లోక్‌సత్తా ఉద్యమాన్ని రాజకీయపార్టీగా మార్చివేసి జయప్రకాశ్ నారాయణ్ దెబ్బతిన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి రాజకీయ పార్టీయే మార్గం అన్న ఆలోచనకు ఎందుకు వస్తారో తెలియదు. ఒక వ్యవస్థ అదుపుతప్పితే దాన్ని చక్కదిద్దడానికి మరో వ్యవస్థ ఉండేలా మన రాజ్యాంగంలో చక్కగా పొందుపరిచారు. దీన్ని ఆదర్శంగా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ రాజకీయాలను ప్రక్షాళన చేస్తామంటూ అందులోకి దిగడం, కొంతకాలానికే నిరాశ నిస్పృహలకు గురవ్వడం జరుగుతోంది. మంచివాళ్లు రాజకీయాలలోకి రావాలన్న నినాదం వినడానికి బాగానే ఉంటుందిగానీ మంచివాళ్లను ఎన్నుకునే పరిస్థితి ఉండాలి కదా? ప్రజల్లో ముందుగా ఈ మార్పురావడం అవసరం. ఈ వాస్తవాన్ని పవన్ కల్యాణ్ గుర్తుంచుకోవాలి. సినిమాస్టార్లలో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైంది. ఈ విషయంలో మిగతా హీరోలు ఆయనతో పోటీపడలేరు కూడా! సినిమా వేరు. రాజకీయం వేరు. మెగాస్టార్‌గా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించినప్పుడు పవన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. నాయకత్వ లక్షణాలను ప్రదర్శించకపోవడంతో పాటు పలు ఇతర కారణాల వల్ల ప్రజారాజ్యం విఫలప్రయోగం అయ్యింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ మళ్లీ రాజకీయ బాటను ఎంచుకున్నారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనంచేయడాన్ని పవన్ కల్యాణ్ జీర్ణించుకోలేకపోయారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తండ్రిలాంటి అన్నను ఎందుకు ఎదిరిస్తానని అంటూనే చిరంజీవితో ఢీకొనడానికి తమ్ముడు పవన్ సిద్ధపడ్డారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రచార కమిటీకి చిరంజీవి నాయకుడుగా ఉన్నారు. అదే కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని తమ్ముడు పిలుపునిస్తున్నాడు అంటే అన్నదమ్ముల మధ్య ప్రత్యక్ష రాజకీయపోరు ప్రారంభమైనట్టే! పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని విన్న తర్వాత ఆయనకు రాష్ట్ర విభజన ఇష్టంలేదని భావించవలసి ఉంటుంది. విభజన జరిగిన తీరు బాధాకరంగా ఉందని ఆయన అంటున్నప్పటికీ, పవన్ కల్యాణ్‌ను సమైక్యవాదిగానే చూడవలసి ఉంటుంది. అందుకే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. ప్రస్తుత పరిస్థితులలో కేసీఆర్‌ను విమర్శించడానికి ధైర్యంకావాలి. ఒక సినిమా నటుడై ఉండి కూడా పవన్ ఆ పనిచేశారంటే ఆయన గుండెల నిండా ధైర్యం ఉందని అంగీకరించవలసిందే! తెలంగాణ ఉద్యమం సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను మనసులో పెట్టుకున్న పవన్, పార్టీ ఏర్పాటు సందర్భంగా వాటిపై స్పందించారు. తనకు సినిమాల పట్ల ఆసక్తి తగ్గిపోయిందనీ, నిర్మాణంలో ఉన్న సినిమాలు పూర్తిచేసి నటనకు స్వస్తి చెబుతానని ప్రకటించారు కనుక ఆయన తెగబడి విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం విషయంలో సగటు సీమాంధ్రుడి మనస్సులోని భావాలను, అభిప్రాయాలను పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో వ్యక్తపరిచారు. ఇక్కడ ఒక అంశానికి స్పష్టత రావడం లేదు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టబోతున్నాడన్న వార్తలు వెలువడగానే తొలి విమర్శ చేసింది కేసీఆర్ మాత్రమే! తెలంగాణలో తనకు తిరుగులేదని భావిస్తున్న కేసీఆర్ కొత్త పార్టీ గురించి హేళనచేసే విధంగా ఎందుకు మాట్లాడారా? అన్నదే స్పష్టంకావలసి ఉంది. తనను కించపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్‌ను పవన్ టార్గెట్ చేసుకున్నారు. రెండు మూడు ఇతర అంశాలు మినహా పవన్ తన ప్రసంగంలో తనపై విమర్శలు చేసిన వారందరిపై సెటైర్లు వేసి అభిమానులను ఆనందింపచేశారు. రెండు గంటల పాటు సాగిన పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని పరిశీలిస్తే ఆయనను విమర్శించాలో, అభినందించాలో తెలియని పరిస్థితి. వ్యక్తిగతంగా వపన్‌ను విమర్శించడానికి ఏమీ లేదు. రాజకీయంగా చూస్తే మాత్రం ఆయనలో అపరిపక్వత కనిపిస్తోంది. ఆలోచనలు ఎన్నైనా ఉండవచ్చు. వాటిని ఆచరణలో పెట్టడం ఎలా అన్నదే ముఖ్యం. సమాజాన్ని వేధిస్తున్న అంశాల పట్ల అంతర్మథనం చెందాల్సిందే! ఆవేదన వ్యక్తంచేయాల్సిందే! ఆవేశం చూపాల్సిందే! అయితే ఇవన్నీ రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముందు మాత్రమే ఉండాలి. ఒక్కసారి రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నవారు ప్రజలకు భరోసా ఇవ్వగలగాలి. ఈ విషయంలో పవన్ పూర్తిగా విఫలమయ్యారు. తాట తీస్తాం వంటి పంచ్ డైలాగులతో అభిమానుల చప్పట్లు, కేరింతలను పొందవచ్చుగానీ ఓటర్ల మదిని దోచుకోలేరు. ఇంతకీ ఏం చేస్తారు? నాయకుడి ప్రసంగం ప్రజలను ఆలోచనలో పడేయాలి. తమకు నమ్మదగ్గ నాయకుడు దొరికాడన్న భావం కలిగించాలి. ఆయన అడుగుజాడల్లో నడిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా కల్పించాలి. పవన్ కల్యాణ్ ప్రసంగంలో ఇవన్నీ లోపించాయి. కనిపించినది ఆయనలోని నిజాయితీ మాత్రమే! దేశం కోసం ప్రాణత్యాగం చేసుకోబోయే తొలి పిచ్చివాడిని తానే అన్న పంచ్ డైలాగులు అభిమానులను అలరించడానికి దోహదపడతాయి. సమస్యలకు పరిష్కారాలు చూపించినప్పుడే నాయకులకు ఆదరణ ఉంటుంది. ముగిసిపోయిన అంశాలను ప్రస్తావించి ఆవేదన వ్యక్తంచేయడం వల్ల ప్రయోజనం ఉండదు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చాలామందిలో ముఖ్యంగా సీమాంధ్రులలో ఆవేదన మిగిల్చింది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా తన ఆవేదనను పంచుకున్నారు. ఆదరాబాదరాగా విభజన జరుగుతున్నప్పుడే ఆయన బయటకు వచ్చి తన ఆవేదనను బహిర్గతం చేసి ఉంటే ప్రజలలో మంచి ఆదరణ ఏర్పడి ఉండేది. మిగతా పక్షాలకు కూడా మనోధైర్యం ఇచ్చి ఉండేది. అంతా అయిపోయాక అవమానం జరిగిదంటూ కుమిలిపోవడం వల్లగానీ, నిప్పులు కురిపించడం వల్లగానీ ప్రయోజనం ఉండదు. సీమాంధ్రులు ఇప్పుడు కోరుకుంటున్నది తమ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధిచేయగలరా అని! ఈ అంశానికి పవన్ ప్రసంగంలో ఎక్కడా చోటు కనిపించలేదు. ప్రజారాజ్యం అనుభవం తర్వాత తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా పవన్ కల్యాణ్ కొత్త పార్టీని ప్రారంభించడం దుస్సాహసమే అవుతుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రంలో రాజకీయ శూన్యత స్పష్టంగా ఉండింది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. సీమాంధ్రలో తెలుగుదేశం- వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ఈ పోటీలో టీడీపీ ఒక అడుగు ముందే ఉంది. అయితే, ఓటర్లు కూడా ఈ రెండు పార్టీల మధ్య చీలి పోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల ఎజెండాలు మారిపోయాయి. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడినందున అందుకు కారకులైన వారిని ఆదరించాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. వందల సంఖ్యలో ఉండే అభిమానులతో తెలంగాణలో ఎన్నికలలో పోటీచేయడం పవన్ కల్యాణ్‌కు యేటికి ఎదురీదడమే! శుక్రవారంనాటి ప్రసంగంతో ఆయన తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకి అన్న భావం తెలంగాణవాదుల్లో ఏర్పడింది. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో పవన్‌పై వారు ముప్పేట దాడిచేసి తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేస్తారు. ఇక సీమాంధ్ర విషయానికి వస్తే అక్కడ అభివృద్ధి అనేదే ఇప్పుడు ప్రధాన అంశం! పవన్ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. రాజకీయాలలోకి వచ్చిన తాను ఏమిచేస్తానో చెప్పకుండా ప్రజలు ఆదరిస్తారనుకోవడం అత్యాశ అవ్వడమే కాకుండా మితిమిరిన ఆత్మవిశ్వాసం అవుతుంది. రాజకీయ పార్టీ పెట్టిన వారికి జెండా, ఎజెండా ఉండాలి. పవన్ కల్యాణ్ జెండాను రూపొందించుకున్నారుగానీ ఎజెండాను రూపొందించుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రసంగంలో సినిమా ప్రభావం కనిపించింది. కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలో పతాక సన్నివేశంలో చేసిన ఉపన్యాసం సీనుకు కొనసాగింపుగా పవన్ ప్రసంగం సాగింది. సమస్యలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజలకు కావలసింది ఆ సమస్యలను పరిష్కరించగల సమర్థ నాయకత్వం. తన పార్టీ రెండు రాష్ట్రాలలో పోటీచేస్తుందా? సీమాంధ్రకే పరిమితం అవుతుందా? అసలు ఎన్ని సీట్లకు పోటీచేస్తుంది? పవన్ పోటీలో ఉంటారా? ఉండరా? పొత్తు పెట్టుకుంటే ఎవరితో పెట్టుకుంటారు? వంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలు లేవు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మాత్రమే అయితే ఆయన కొత్త పార్టీ పెట్టనవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు. పవనిజం అనే నినాదం వినడానికి ముచ్చటగా ఉంది. అయితే పవనిజం అంటే ఏమిటి? ఆలోచన లేకుండా ఆవేశపడటమా? కార్యాచరణ లేకుండా కార్యరంగంలోకి దూకడమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి తప్ప ఆ పార్టీలో మరో పేరు ఇంతవరకు తెరమీదకు రాలేదు. పార్టీకి కార్యాలయం కూడా లేదని ఆయనే చెప్పుకున్నారు. ఎన్నికలకు మరో 50 రోజుల వ్యవధి మాత్రమే ఉన్న ఈ తరుణంలో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోకుండా కొత్త పార్టీని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. జనసేనలో చేరాలనుకుంటున్నవారు ఎవరిని కలవాలి? ఎక్కడ కలవాలి? పవన్ తరపున పార్టీ కార్యక్రమాలను ఎవరు చక్కదిద్దుతారు? వంటివన్నీ శేషప్రశ్నలే! రాష్ట్రంలో, దేశంలో గందరగోళ పరిస్థితులు ఉన్నట్టుగానే జనసేన పార్టీ కూడా గందరగోళంగానే ఉంది. కాంగ్రెస్‌ను తరిమికొట్టండి అని సందేశమిచ్చిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత ప్రజలు ఏమిచేయాలో, తాను ఏమి చేస్తాడో చెప్పలేదు. రాజకీయ పార్టీ వేరు, సినిమా వేరు. సినిమాటిక్‌గా పార్టీని పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం. ఎనిమిది నెలలుగా తాను అంతర్మథనం చెందిన తర్వాత పార్టీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకున్నారు. అయితే, ఒక రాజకీయ పార్టీకి అవసరమైన కనీస యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఆయనకు ఎందుకు రాలేదో తెలియదు. మొత్తంగా చూస్తే అన్నను ఎదిరించిన తమ్ముడిగా పవన్ గుర్తింపు పొందారు. ప్రస్తుత వ్యవస్థ పట్ల ఆయనలో ఉన్న ఆవేదన, ఆక్రోశాన్ని ప్రజలు గుర్తించారు. దగా పడుతున్న సమాజానికి ఏదో చేయాలన్న పట్టుదల ఆయనలో ఉందని కూడా ప్రజలకు అర్థమైంది. అదే సమయంలో ఏమిచేయాలన్న విషయంలో పవన్‌కే స్పష్టత లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అత్యంత పాపులర్ సినీ హీరోగా గుర్తింపుపొందిన పవన్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న రాజకీయ పార్టీ పకడ్బందీగా ఉంటుందని ఆశించినవారికి భంగపాటే మిగిలింది. పవన్‌కున్న క్రేజ్ వల్ల ఆయన ప్రసంగానికి, పార్టీ ఏర్పాటు నిర్ణయానికి మీడియా విస్తృత ప్రచారాన్ని కల్పించి ఉండవచ్చు. ఇదే మీడియా రేపటి నుంచి లోపాలను కూడా ఎత్తి చూపుతుంది. పవన్ ప్రసంగం సుదీర్ఘంగా సాగినప్పటికీ ఒక నాయకుడికి ఉండవలసిన స్పష్టత ఆయన ప్రసంగంలో మిస్సయ్యింది. అక్కడక్కడ వ్యంగ్యంతో పాటు పంచ్ డైలాగులతో అభిమానులను మాత్రమే పవన్ అలరించగలిగారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత ఎన్.టి.రామారావు ప్రజల్లోకి వెళ్లిపోయారు. చిరంజీవి ఇందుకు విరుద్ధంగా పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని నాన్చినాన్చి మరీ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ప్రజల్లోనే ఉండవలసిన ఆయన కొద్దిరోజులకే అలసిపోయారు. తాను స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినా ప్రజారాజ్యం ఎందుకు విఫలమైందో కనీసం విశ్లేషించుకోకుండా పవన్ రాజకీయాల్లోకి దూకారు. పార్టీ ఏర్పాటు అనంతరం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలను గమనిస్తే పవన్ కల్యాణ్‌ది ప్రభంజనం కాదనీ, తేలికపాటి పవనం మాత్రమేనని స్పష్టమవుతోంది. అయితే ఒక మంచి మనిషి, ఆవేశపరుడు, సమాజం పట్ల ఆవేదన ఉన్న పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఆగమైపోతాడేమోనని బాధగా ఉంది. ఇలాంటి వారి ప్రయోగాలు విఫలమైతే భవిష్యత్తులో మళ్లీ అటువంటి ప్రయోగం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఏ పని చేయాలన్నా ముందుగా హోంవర్క్ చేసుకోవాలి. పవన్ కల్యాణ్‌కు ఇది కూడా తెలియకపోతే ఎలా? అయితే ఆయనలాంటి వాళ్లు నిరాశ నిస్పృహలకు గురికాకూడదని కోరుకుందాం.
sandy437 Posted March 15, 2014 Report Posted March 15, 2014 veedivalle ..chiru asalu politics lo ki vachindi..
tom brady Posted March 15, 2014 Report Posted March 15, 2014 Shavaala meeda chillara erukune lanza koduku..veedu cheppedi endi 1
audibodi Posted March 15, 2014 Report Posted March 15, 2014 Shavaala meeda chillara erukune lanza koduku..veedu cheppedi endi
jpnarayan1 Posted March 15, 2014 Author Report Posted March 15, 2014 Shavaala meeda chillara erukune lanza koduku..veedu cheppedi endi agreed and porn cd lu ammukune vadu kuda....
audibodi Posted March 15, 2014 Report Posted March 15, 2014 agreed and porn cd lu ammukune vadu kuda....
micxas Posted March 15, 2014 Report Posted March 15, 2014 First meeting lone Anni cheppayala..how man..
posaanisam Posted March 15, 2014 Report Posted March 15, 2014 vidini kuda follow avvala... pichi fruit gadu manishi chachipotunte help cheyadam manesi video tista kurchunnadu erri pulka gadu
Baadshah_Afdb Posted March 15, 2014 Report Posted March 15, 2014 veedivalle ..chiru asalu politics lo ki vachindi.. Lol ante puppy gadi ki brain ledha evadu edi chepthe adhi chestada?
vadapav Posted March 15, 2014 Report Posted March 15, 2014 he has some good valid points :4_12_13: like ఎన్నికలలో అన్ని స్థానాలకు పోటీచేసే పరిస్థితి కూడా లేనప్పుడు రాజకీయ పార్టీ అవసరం ఏమిటన్నదే ప్రశ్న! ప్రశ్నించడం కోసం కొంతమంది ఉండాలన్నది పవన్ ఉద్దేశం కావచ్చు. ప్రశ్నించడానికి చట్ట సభలలోకి వెళ్లవలసిన అవసరం లేదు. వెలుపల నుంచి కూడా ప్రశ్నించవచ్చు. ప్రభావితం చేయవచ్చు.
sandy437 Posted March 15, 2014 Report Posted March 15, 2014 Lol ante puppy gadi ki brain ledha evadu edi chepthe adhi chestada? chiru ki brain vundi ani nuvvu nammutunnava... lol.. adi ap lo 6th class pilla ni adigina chepthundi...
Baadshah_Afdb Posted March 15, 2014 Report Posted March 15, 2014 chiru ki brain vundi ani nuvvu nammutunnava... lol.. adi ap lo 6th class pilla ni adigina chepthundi... brain lekundane megastar ayada
biscuitRAJA000 Posted March 15, 2014 Report Posted March 15, 2014 Lol ante puppy gadi ki brain ledha evadu edi chepthe adhi chestada?
kajal Posted March 15, 2014 Report Posted March 15, 2014 Pk fail yemo kani. Ee lavada rk gadi matalu vine positionlo ayithe yevadu led. Veedu antha veprasi gadu yekkada undadu
Recommended Posts