ROADSIDEREDDY Posted March 17, 2014 Report Posted March 17, 2014 ప్రజారాజ్యం పార్టీ దారుణంగా ఓడిపోయినప్పుడు కూడా చిరంజీవి ముఖంలో కళ తగ్గలేదు. అప్పుడు కూడా ఆయన చిరునవ్వులు చిందిస్తూ పరాజయాన్ని హుందాగా అంగీకరించారు. ఈ పద్ధెనిమిది సీట్లతోనే పోరాటం సాగిస్తానని దిలాసాగా ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ ఎప్పుడూ స్థైర్యం కోల్పోని చిరంజీవి 'రేసు గుర్రం' ఆడియో వేడుకలో మాత్రం తన ఫీలింగ్స్ దాచలేకపోయారు. ఆయన ఎక్కడా మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్టు కనిపించలేదు. మనసు ఎక్కడో పెట్టుకుని బలవంతంగా ఆ వేడుకలో కూర్చున్నాడని అర్థమైంది. తమ్ముడు పెట్టిన పార్టీ, అతని స్పీచ్‌కి వచ్చిన స్పందన, అందరూ తనని తప్పుబట్టడం, అభిమానుల్లో కూడా చాలా మంది పవన్‌కి వత్తాసు పలకడం చిరంజీవిని గట్టిగానే దెబ్బ తీసింది. అది ఆయన ముఖంలోనే స్పష్టంగా కనిపించింది. ఆడియో వేడుకని కూడా పబ్లిక్ ఫంక్షన్‌గా పెట్టడానికి చిరంజీవి అంగీకరించలేదంటే తమ్ముడి సెగ అన్నయ్యకి ఏ రీతిన తాకిందో అర్థమవుతోంది. ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా తమ్ముడి ధాటిని చిరంజీవి తట్టుకోవాలి. ఎవరినీ లెక్క చేయని పవన్ నైజాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదు. తమ్ముడి ముందు తేలిపోకుండా ఉండాలంటే చిరంజీవి చాలా రకాలుగా తన ప్రసంగాల్ని ఆకర్షణీయంగా మలుచుకోవాలి. తాను నిలబెడదామనుకుంటున్న పార్టీని తుడిచి పెట్టేయాలని చూస్తున్న తమ్ముడిని ఎలా నిలువరించాలనేది చిరంజీవికి తలకి మించిన భారమైన పనే ఇప్పుడు. అసలే కాంగ్రెస్ పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత ఉండగా, ఇప్పుడు పవన్ సేన జత కలవడంతో అది మరింత ఎక్కువైంది. మెగాస్టార్ ముందు ఇది పెద్ద సవాలే మరి.
Recommended Posts