simham1 Posted March 18, 2014 Report Posted March 18, 2014 ఓడలు బళ్లవడం... బళ్లు ఓడలవడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు మెగాస్టార్ అంటే తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్ అభిమానులకు అదొక ఉత్సాహం. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఆయన మాటెత్తితేనే ఉలిక్కి పడుతున్నారు సామన్య జనం. అదేంటి అంటే మాత్రం వెయ్యి గొడ్లను తిన్న రాబందైనా ఒక్క గాలివానకు చావాల్సిందేనన్న చందంగా సినిమాలలో ఓ వెలుగు వెలిగినా రాజకీయాలలో మాత్రం ఆయన కుప్పిగంతులు సాగక జీరోస్టార్ అయిపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీ నుండి రాజకీయాల వరకు అంతా చులకనైపోయారు. దీనికి కారణం చిరంజీవి ఎంత రాజకీయాలలోకి వెళ్ళినా కానీ కొంచెం కూడా విలువలకు తావు లేకుండా నేతలను మించిన రాజకీయాలను చేయడం.. పదవి కోసం అధిష్టానం వద్ద అతి వినయంతో పాటు.. ఇంకా విభజన వ్యవహారంలో ఆయన నటిస్తున్నారని సీమాంధ్ర ప్రజలకు అర్ధమైపోవడం ఇలా అన్నీ కలిసి తనని పాతాళానికి తోక్కేస్తే.. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ రూపంలో నెత్తిన మరో బండరాయి పడింది. ఎలా అంటే నిన్నటివరకు ఆ కుటుంబం స్థాపించిన ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో కలిపేసి రాజకీయాలలో చిరు ఒక్కడే పోరాడుతుంటే ఏమోలే మంచో.. చెడో ఒక్కడే ఈడుతున్నాడులే అనుకున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు పవన్ రాకతో పరిస్థితి మారి చిరంజీవికి సంకటంగా మారింది. మొత్తానికి ఒకప్పుడు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఒంగిఒంగి దండాలు పెట్టిన వాళ్ళే ఇప్పుడు పరోక్షంగా చిరు మీద సెటైర్లు వేస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్ ట్విట్టర్ లో చిరంజీవి మీద ప్రత్యక్షంగానే కామెంట్ చేయగా రామ్ గోపాల్ వర్మ, స్మిత లాంటి వాళ్ళు కూడా చిరు మీద సెటర్లు వేస్తున్నారు. మనం భారతీయులు అని చెప్పుకునే అవకాశాన్ని కాంగ్రెస్ కల్పించిందన్న వ్యాఖ్యలకు నటుడు సురేష్ నైతికంగా మరీ ఇంత దిగజారుడా? ఇదంతా డబ్బు, పదవి కోసమేనా' అంటూ కామెంట్ చేశాడు. ఇక వర్మ అయితే చిరంజీవి అన్న పవన్ పార్టీ జెండా.. ఎజెండా ఏమిటో అర్థం కాలేదన్న వ్యాఖ్యకు పవన్ కళ్యాణ్ ను అర్థం చేసుకోవడం ఎలా? అనే అంశంలో కొందరు లీడర్లు కోచింగ్ తీసుకోవాలని కామెంట్ చేశాడు. ఇక స్మిత చిరంజీవి చేయాలనుకున్న బస్సు యాత్రను ఉద్దేశించి.. సీమాంధ్రలో చచ్చిన కాంగ్రెస్ కు బస్సు యాత్రా.. నవ్వు ఆపుకోలేకపోతున్నా.. అన్నయ్యా.. తమ్ముడిని చూసి నేర్చుకో అంటూ చురకలేసింది. మొత్తానికి మెగాస్టార్ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో ఓ కామెడీ స్టార్ అయిపోయాడనమాట!
Recommended Posts