cherlapalli_jailer Posted March 20, 2014 Author Report Posted March 20, 2014 రక్తం ఎలా తయారవుతుంది?మనకెప్పుడైనానా వేలు తెగినప్పుడో, ఆటల్లో గాయం తగిలినప్పుడో రక్తం కారడం గమనించే వుంటారు కదా! మనం శరీరంలో దాదాపు నాలుగున్నర నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఇంతకీ రక్తంలో ఏమేమి వుంటాయి? అది ఎలా తయారవుతుందో తెలుసా? ఎక్కడోకాదు... మన శరీరంలోనే తయారవుతుంది.అయితే దానికి కూడా కొన్ని పదార్థాలు కావాలి. అవి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా అనే నాలుగు పదార్థాలు. ఎర్రరక్తకణాలేమో ఆమ్లజనిని శరీరమంతా అందేలా చేస్తాయి. తెల్లరక్తకణాలేమో ఇన్ఫెక్షన్లతో యుద్ధం చేస్తాయి. రక్తంలో ప్లేట్లెట్లు ఉండటం వల్ల దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకడుతుంది. ప్లాస్మా అనే పసుపు పచ్చని ద్ర వపదార్థం మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, హార్మోన్లు, ప్రొటీన్లను శరీరమంతటికీ అందిస్తుంది. శరీరమే మన ఎముక లలో ఉండే బోన్‌మారో అనే గుజ్జువంటి పదార్థాన్ని ఉపయోగించి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్లను తయారు చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం, నీరు పేగుల్లో చేరతాయి కదా, వాటిలోని పోషకాలను, ఇతర సారం నుంచి ఊపిరితిత్తులు పీలుస్తూ, విడుస్తూ ఉండే గాలి ద్వారా రక్తం పంపులాగా కొట్టబడి, దానినుంచి ప్లాస్మా తయారవుతుంది. అంటే ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా... ఇవన్నీ కలిస్తే రక్తం తయారవుతుందన్నమాట.
cherlapalli_jailer Posted March 20, 2014 Author Report Posted March 20, 2014 జాతకచక్రంలో చతుర్విద పురుషార్ధాలు.........ఒక వ్యక్తి జాతకచక్ర రీత్యా చతుర్విద పురుషార్ధాలైన ధర్మానికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తాడా,అర్ధానికి ప్రాదాన్యత ఇస్తాడా,కామానికి ప్రాదాన్యత ఇస్తాడా,మోక్షానికి ప్రాదాన్యత ఇస్తాడా అని అతని జాతకచక్రాన్ని పరిశీలించి చెప్పవచ్చును.ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో సాదించాలి అనే తపన,ఉత్సాహం ఉంటాయి.ఆ వ్యక్తి చతుర్విద పురుషార్ధాలలో దేనికి తన శక్తి సామార్ధ్యాలు దారపోస్తాడో జ్యోతిష్యశాస్త్రంలోని నక్షత్రాలద్వారా తెలుసుకోవచ్చును. జాతకచక్రంలోని నక్షత్రాలు వ్యక్తిలోని గుణాలు శక్తి సామర్ద్యాలు తెలియజేస్తాయి.కాబట్టి నక్షత్రాలు వ్యక్తిలోని Aims and Goals తెలియజేస్తాయి.జాతకచక్రంలోని గ్రహాలు ఏ ఏ నక్షత్రాలలో ఉన్నాయో చూడాలి. లగ్నం కూడా ఏ నక్షత్రంలో ఉందో చూడాలి.ఎక్కువ నక్షత్రాలు ధర్మ,అర్ధ,కామ,మోక్షాలలో దేనిలో ఉంటే ఆ అంశానికి ఎక్కువ ప్రాదాన్యతని ఇస్తాడు. 1)ధర్మం:-జాతకుడు తన జీవితంలో ఎంతవరకు నీతి నియమాలతో ,దర్మబుద్ధితో ఉండగలడో తెలియజేస్తుంది. 2)అర్ధం:- జాతకుడు తన జీవితంలో వృత్తి,ధనం,కుటుంబం,పోషణకు తన శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తాడో లేదో తెలియజేస్తుంది. 3)కామం:- జాతకుడు తన జీవితంలో కోరికలు,వ్యామోహాలు,కామవాంచలు ఎంతమేరకు కలిగి ఉన్నాడో తెలియజేస్తుంది. 4)మోక్షం:-జాతకుడి జీవిత లక్ష్యం మోక్షం. ఉదాహరణ:- జాతక చక్రంలోని గ్రహాలు ఏ ఏ నక్షత్రాలలో ఉన్నాయో చూద్దాం. లగ్నం:-చిత్త నక్షత్రం-(కామ), రవి:-హస్త నక్షత్రం:-(మోక్ష), చంద్రుడు:-అనురాద నక్షత్రం:-(ధర్మ), కుజుడు:-స్వాతి నక్షత్రం:-(అర్ధ), బుధుడు:-హస్త నక్షత్రం:-(మోక్ష), గురువు:-పుష్యమి నక్షత్రం:-(ధర్మ), శుక్రుడు:-విశాఖ నక్షత్రం:-:-(ధర్మ), శని:-పుబ్బ నక్షత్రం:-(కామ), రాహువు:-ఉత్తర నక్షత్రం:-(మోక్ష), కేతువు:-పూర్వాభాద్ర నక్షత్రం:-(అర్ధ), పై జాతకచక్రంలో గ్రహాలు ఉన్న నక్షత్రాలు చంద్రుడు-అనురాధ,గురువు-పుష్యమి,శుక్రుడు-విశాఖ ,3 గ్రహాలు ధర్మ నక్షత్రాలలో ఉన్నాయి. కుజుడు_స్వాతి,కేతువు-పూర్వాభాద్ర, 2 గ్రహాలు అర్ధ నక్షత్రాలలో ఉన్నాయి. లగ్నం-చిత్త,శని-పుబ్బ, 2 గ్రహాలు కామ నక్షత్రాలలో ఉన్నాయి. రవి-హస్త,బుధుడు-హస్త,రాహువు-ఉత్తర 3 గ్రహాలు మోక్ష నక్షత్రాలలో ఉన్నాయి. దీనిని బట్టి జాతకుడు ధర్మ,మోక్షాలకు ఎక్కువ ప్రాదాత ఇస్తాడు,వాటిని సాధించటానికి ఎక్కువ కృషి చేస్తాడు. Naadi super Naa vishayam lo correct kooda
cherlapalli_jailer Posted March 20, 2014 Author Report Posted March 20, 2014 తేనె {HONEY}***********ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. మకరందము(నెక్టార్ (Nectar)) పూలలో ఉత్పత్తి అయ్యి స్రవించే తియ్యని ద్రవము. తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి.తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. స్పెయిన్‌లోని వలెన్సియా అనే ప్రాంతంలోని గుహలో అడవి తేనె వేటకు సంబంధించిన చిత్రాలున్నాయి. ఇవి 8 వేల సంవత్సరాల నాటివని చారిత్రకులు నిర్ధారించారు కూడా. నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు ” హ్యూబర్‌కు” దక్కుతుంది. వందల సంవత్సరాల క్రితం స్వతహాగా గుడ్డివాడయినప్పటికీ భార్య, సహాయకురాలి సాయంతో రాణిఈగ తన గూడుకు చాలా దూరంలో ఉన్న మగ ఈగతో ఎలా సంపర్కం పెంచుకుంటుంది? తేనెపట్టుపై ఉన్న రంధ్రాల సైజును చూసి కూలి మగ ఈగలను, వాటి సంఖ్యను ఎలా గుర్తించవచ్చో "హ్యూబర్" వివరంగా తెలియజేసారు. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది.”శుశ్రుతసంహిత” తేనెను తాగేమందుగా వర్ణించింది, శ్వాసకోశవ్యాధులకుమధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది. తేనె గుణాలు ======= తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం,పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెల్లో రంగులూ రకాలూ ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు... ఇలా భిన్నవర్ణాలతోపాటు కొన్ని తేనెలు వర్ణవిహీనంగానూ ఉంటాయి. అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంటుంది. అంటే తేనె రంగు, సువాసన, రుచి... అన్నీ మధుకీటకాలు సేకరించే పూలజాతుల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు యూకలిప్టస్, నిమ్మ, నారింజ పూల నుంచి మకరందాన్ని సేకరిస్తే అది ఘాటైన వాసననీ రుచినీ కలిగి ఉంటుంది. చాలామంది వంటలో పంచదార కన్నా తేనె వాడటానికి ఇష్టపడతారు. బేకింగ్ ఉత్పత్తులో తేనె వాడటంవల్ల రుచిగా ఉండటంతోపాటు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకుతాయి. తేనెటీగల రకాలు ========= తేనె లో నాలుగు రకాలు ఉన్నాయి - పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి, సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్ళ పై కప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోను, చీమల పుట్టల్లోను నిర్మించుకుంటాయి. కర్ర తేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్ర తేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన మూడు రకాల తేనెలు తీపిగా ఉండును. తేనె రకాల్లో పుట్ట తేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు. తేనె లో రకాలు ======== తేనె సంపూర్ణ పోషక పదార్ధమని , తిరుగులేని ఔషధ గుణాలు కలిగి ఉన్నదని తెలుసుకున్నాక దానిని సేకరించిన తీరు , నిలువచేసేందుకు వాడిన విధానాలబట్టి పలు రకాలుగా విభజించారు . 1)అడవి తేనె :-- ఇది అత్యంత సహజమైనది . అడవిలో లభించే అన్నిరకాల పూలనుండి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి గకుక చాలా మంచిది . 2)ఒకే పూవు తేనె :-- ఇది తేనెటీగల పెంపకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్కొక్క తరహా పూల మకరందము ఒక్కో రుచి లో ఉంటుంది. తేనెటీగలకు ఏదో ఒక రకమైన పూలమొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా దీనిని తయారు చేస్తారు . 3)మిశ్రమ తేనె : మార్కెట్ లొ అధికంగా అమ్మే తేనె ఇదే. నాలుగయిదు రకాల తేనెలను భిన్నరుచులు , రంగులు కలిగినవి కలిపేస్తారు ఈ మిశ్రం తేనెలో. రంగు , రుచి ని బట్టి రకరకాల పేర్లు పెడతారు . 4)పుట్ట తేనె : ఇది తేనె పట్టులను అలానే తీసుకువచ్చి అందులోని తేనెను సేకరించి వెనువెంటనె అందించేది . దీనిని తాజా తేనె గా భావించాలి. 5)నిలువతేనె : తేనెను నిలువ చేసేందుకు భిన్న విధానాలు ఉన్నాయి. పాలను పాశ్చరైజ్ చేసిన తీరునే తేనెను పాశ్చరైజ్ చేస్తారు . దానిలోని సూచ్మజీవులను తొలగించి , దానిలోని ఎంజైమ్ ల చర్యలను పరిమితం చేయడం ద్వారా తేనె ఎక్కువకాలము నిలువ ఉంచేలా చే్స్తారు . ఈ ప్రక్రియలో తేనెను వేడిచేయడం జరుగుతుంది . వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలున్నాయి . దానిని అధిగ మించేందుకు నేడు ఆల్ట్రాసొనిక్ తేనెను తయారుచేస్తున్నారు . దీనివలన తేనె పులియకుండా ఉంటుంది . 6)ఎండు తేనె : ఇది మరో ప్రత్యేకమైనది . తేనెను ఘన రూపమ్లో తయారుచేస్తారు. ఇది చిన్నచిన్న ముక్కలుగా వస్తాది . చేతికి అంటుకోదు. తేనె కల్తీ అవుతుంద? =========== ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ద ఔషధం "తేనె"(హనీ). తేనెలో ఉన్న ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. మరి అలాంటి ఔషధం నేడు విషంగా మారిందా..?! అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. "అన్ని రోజులు ఒకలా ఉండవు" అన్న సామెత మాదిరిగా "అన్ని కంపెనీల తేనెలు ఒకలా ఉండవు" అని చెబుతున్నారు పరిశోధకులు. ప్రముఖ దేశీయ, విదేశీయ బ్రాండ్లు "ప్యూర్ హనీ" అంటూ విక్రయిస్తున్న తేనెలో అధికశాతంలో యాంటీబయొటిక్స్ ఉంటున్నాయని, వీటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) హెచ్చరిస్తోంది. కొన్ని భారతదేశపు బ్రాండ్లలో ఉండాల్సిన దానికన్నా అధికంగా రెండు నుంచి నాలుగు వరకూ యాంటీబయొటిక్స్ ఉన్నాయని సీఎస్ఈ కాలుష్య పర్యవేక్షణ ల్యాబొరేటరీ కనుగొంది. ఇవే కాకుండా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విదేశీ బ్రాండ్లు కూడా తేనెలో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడుతున్నారని సీఎస్ఈ తెలిపింది. ఇప్పటి వరకూ 12 కంపెనీలకు చెందిన తేనెలను పరిశీలించిన సీఎస్ఈ వాటిల్లో ఆరు రకాల యాంటీబయోటిక్స్ వాడినట్లు గుర్తించింది. "అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారతీయ కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసే తేనెలో మాత్రమే యాంటీబయోటిక్స్‌ను వీలైనంత వరకూ నియంత్రిస్తున్నాయి. కానీ మన దేశంలో ఉపయోగించే వాటిలో మాత్రం ఎటువంటి నియంత్రణ లేదు. ఇందుకు నిర్లక్ష్యం ఒక్కటే కారణం." యూరప్, అమెరికా వంటి దేశాల్లో తేనె ఉత్పత్తులకు కఠినమైన, నిర్ధిష్టమైన నిబంధనలు ఉంటాయి. కానీ మన దేశంలో ఇవేమి ఉండవు. అందుకే చాలా వరకూ విదేశాల్లో భారతీయ తేనె ఉత్పత్తులను నిషేధిస్తున్నారని సీఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్రభూషణ్ అన్నారు. ఇందుకు పెద్ద ఉదాహరణే.. భారత ఎగుమతుల తనిఖీ కౌన్సిల్(ఈఐసీ) విదేశీ మార్కెట్లో విడుదల చేసే తేనె ఉత్పత్తులలో నిర్ణీత యాంటీబయోటిక్స్ మాత్రమే వాడాలని షరతులు పెట్టింది. కానీ దేశీయ మార్కెట్లో విక్రయించే తేనె ఉత్పత్తులకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. చెడు గుణాలు ======== తేనే సుద్దిచేయకుండా వాడకూడదు . దీనిలో అనేక సుక్ష్మ జీవులు ఉంటాయి . తేనే లోగల 'బొటులినియం ఎన్దోసపొర్స్" చిన్నపిల్లలకు హానిచేయును .. ఒక సం. లోపు పిల్లలకు వాడకూడదు. తుతిన్(tutin) అనేది విషపదార్దము - - శరీరమునకు మంచిదికాదు . తేనె వాడకూడని సందర్భాలు =============== • మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి. • తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. (తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి. .) • మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు. • తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు. • తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది. • తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు (సంయోగ విరుద్ధం). తేనె వాడకం వల్ల ఉపయోగాలు, ఆరోగ్య సూచనలు ========================== • అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. • ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది. • ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది. • ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు. • క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం కలిగి త్వరగా అలసట కలుగదు. ఆటలు ఆడిన తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. • తేనె పుచ్చుకుంటే కళ్ళకు చలువ చేసి దృష్టి మెరుగుపడేలా చేస్తుంది. • తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి. • తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే బిడ్డకు బలవర్ధకం. • తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. • పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది. • ప్రకృతిలో సహజసిద్దంగా లభించే ఆహారపదార్ధాలలో తేనె ఉత్తమమైనది, పుష్టికరమైనది. • భోజనానంతరం తీసుకుంటే పైత్యహారిగా పనిచేస్తుంది. శరీరంలోని అధిక వేడిని తొలగిస్తుంది. • మనం తీసుకొనే ఆహారపదార్ధాలు, పానీయాలు మొదలైనవి జీర్ణక్రియలో భాగంగా గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లుగా మారిన తరువాత క్రమంగా జీర్ణం అవుతాయి. కానీ తేనె ఇలా ఏ మార్పులూ లేకుండా సులభంగా జీర్ణం అవుతుంది. • రెండు తులాల తేనెలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని రోజూ తాగితే పులితేపులు తగ్గుతాయి. • రెండు గ్లాసుల నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె కలిపి తాగాలి. ఇది డయేరియా తగ్గడానికి సులభమైన మార్గం. • అజీర్తితో బాధ పడుతుంటే మూడు వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా నూరి పాల లో కలుపుకుని తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది. • కొత్తీమీర రసాన్ని మజ్జిగలో కలుపుకొని తాగితే అజీర్తి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. • గ్లాసుడు నీళ్ళలో టీ స్పున్ అల్లరసం, టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అజీర్తి బాధ వెంటనే తగ్గుముకం పడుతుంది. • నిద్రలేమితో బాధపడుతున్నవారు కొన్ని కొత్తిమీర ఆకుల్ని మెత్తగా నూరి ఆ రసాన్ని వేడి నీళ్ళ లో కలిపి గోరు వెచ్చగా అయ్యాక తాగితే మంచి ఫలితం వుంటుంది. • వెల్లుల్లి రెబ్బలను పాలలో మరగబెట్టి తీసుకుంటే ఆస్తమా నుండి ఉపశమనం లభిస్తుంది. • అరటి పండు లో చెక్కెర...సుక్రోజ్ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపం లో ఉంటాయి. పీచు పదార్ధాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవటానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతీరోజూ అరటిపండు తింటే శక్తితో పాటు జీర్ణవ్యవస్ధ పని తీరు మెరుగవుతుంది. • దగ్గు నివారణకు గొంతు మంటకు మందుగా పనిచేస్తుంది. • డయేరియా నుంచి విముక్తి లభిస్తుంది. • తేనె రక్తాన్ని శుద్ధి చేసి, బ్లడ్ సర్క్యులేషన్‌ని క్రమబద్దీకరిస్తుంది. • కాలిన గాయాలను త్వరగా తగ్గిస్తుంది. అల్సర్‌ను నివారిస్తుంది. • తేనెలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటివల్ల సులభంగా జీర్ణమవుతుంది. • ప్రతిరోజూ ఒక టేబుల్‌స్పూన్ తేనె నీటిలో కలిపి పరగడుపునే తీసుకుంటే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. • పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి క్రమం తప్పకుండా తేనె ఏదో ఒక రకంగా ఇవ్వాలి. • నోటి పూత, నోటిలో గుల్లలు వంటి సమస్యల నివారణకు తేనె వాడొచ్చు. • చక్కెరతో పోల్చితే తేనెలో క్యాలరీలు తక్కువ. తేనెలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ. • అధిక బరువును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే స్థూలకాయాన్ని నివారించవచ్చు. కడుపు నొప్పికి ఇది మంచి మందు. • ఎనీమియా, ఆస్తమా, బట్టతల, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బిపి, ఒత్తిడి, పక్షవాతం వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. అవీ ఇవీ[మార్చు] • సుమారు 20 వేల ఏళ్ల నుంచి మనిషి తేనెను సేకరిస్తున్నాడు. • ప్రపంచవ్యాప్తంగా అందరికన్నా న్యూజిలాండ్ వాసులు తేనె ప్రియులు. వీరిలో 88 శాతం మంది హనీని ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరూ ఏటా 1.95 కిలోల తేనెని తీసుకొంటారు. • రంగు, రుచి ఆధారంగా అమెరికాలో 300లకు పైగా తేనెరకాలు తయారవుతున్నాయి. • గ్రీసులో కొత్తపెళ్లికూతురు అత్తవారింట అడుగుపెట్టేటప్పుడు- చేతుల్ని తేనెలో ముంచి గోడలమీద ముద్రలు వేస్తుందట. వైవాహిక జీవితం తీయగా హాయిగా సాగిపోయేందుకే ఈ తేనెముద్రలు. • తేనె పంచదారకన్నా రెండురెట్లు తీపిగా ఘాటుగా ఉంటుంది. అందుకే తేనెలో ఎలాంటి బాక్టీరియా, ఫంగస్‌లాంటి సూక్ష్మజీవులు ఉండవు. • రోమన్లు బంగారానికి బదులుగా తేనెను ఆదాయపన్నుగా చెల్లించేవారట. • ఒక పౌండు తేనెకోసం తేనెటీగలు సుమారు 55 వేల మైళ్ల దూరం ప్రయాణించి 20 లక్షల పూలను సందర్శిస్తాయని తెలుసా. • విడిగా అమ్మే తేనెలో కొంత చక్కెరపాకాన్నీ కలుపుతుంటారు. అచ్చంగా పట్టు నుంచి తీసినదేదో తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. • తేనే నిజమైనది అవునా కాదా అని తెలుసుకోవాలి అంటే ఒక స్పూన్ తేనెను తీసుకొని నీటిలో వెయ్యాలి.అది త్వరగా కరిగిపోతే మంచి తేనే కాదు. ఒరిజినల్ తేనే నీటిలో ఆలస్యంగా కరుగుతుంది.
Saanvi Posted March 20, 2014 Report Posted March 20, 2014 GP few articles not readable,konchem aksharalu pedavi cheyagalara
siru Posted March 20, 2014 Report Posted March 20, 2014 Gp Telugu vadiki telugu Chadavadam rakapovadam anta dhourbhagyam inkoti ledu.
cherlapalli_jailer Posted March 20, 2014 Author Report Posted March 20, 2014 GP few articles not readable,konchem aksharalu pedavi cheyagalara done
vadapav Posted March 20, 2014 Report Posted March 20, 2014 ladies andaru vuu kottesaraa evaraina migliaraa
Recommended Posts