jpnarayan1 Posted March 26, 2014 Report Posted March 26, 2014 బీజేపీలో చేరిన నటుడు సురేష్ Published at: 26-03-2014 18:29 PM హైదరాబాద్, మార్చి 26 : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సమక్షంలో బుధవారం సినీ నటుడు సురేష్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సురేష్ చేరిక బీజేపీకి సంతోషకరమని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో పొత్తుల కోసం బీజేపీ ఎవరినీ ప్రాధేయపడడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు పొత్తు అంటూనే కించపర్చేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో నరేంద్ర మోదీ పర్యటించనున్నారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Recommended Posts