solman Posted March 27, 2014 Report Posted March 27, 2014 డైలాగ్‌కింగ్ మోహన్‌బాబును మరో వివాదం చుట్టుముట్టింది. అయినా వివాదాలు ఆయనకు కొత్తకాదనుకోండి. ఈ సారి వివాదం ఆయనకు కొన్నేళ్ళక్రితం లభించిన గౌరవ డాక్టరేట్ పట్టాపై.అమెరికాలోని ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ మోహన్‌బాబుకు డాక్టరేట్ పట్టాఇచ్చి గౌరవించింది. అప్పటివరకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి గొప్పనటులకు ఆంధ్రా యూనివర్సిటీయో,నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్లు ఇవ్వటంమాత్రమే చూసిన తెలుగువారికి మోహన్‌బాబు నేరుగా అమెరికానుంచే డాక్టరేట్ పట్టా పొందటం ఆశ్చర్యకరంగానూ, అపూర్వంగానూ అనిపించింది.ఈ అరుదైన ఘనత సాధించినందుకు ఆయనకు చెన్నైలో నాడు భారీఎత్తున సన్మానంకూడా జరిగింది. సదరు అమెరికా యూనివర్సిటీ ఒక పెద్ద ఫ్రాడ్ అని ఇప్పుడు తేలింది. ఈ సంస్థ మోహన్‌బాబుకేకాక మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు(మాజీ మంత్రి గల్లా అరుణతండ్రి), మిసిమి పత్రిక ఎడిటర్ ఆలపాటి రవీంద్రనాథ్ వంటి మరికొందరు తెలుగువారికికూడా ఈ గౌరవ డాక్టరేట్లు ఇచ్చిందట. ఈ యూనివర్సిటీ వ్యవహారం తేడాగా ఉన్నట్లు గమనించిన నరిశెట్టి ఇన్నయ్యగారనే సీనియర్ తెలుగు జర్నలిస్ట్ అమెరికా వెళ్ళినపుడు దీనిపై పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇన్నయ్యగారిని గురించి చెప్పుకోవాలి. ఈయన డెబ్భై, ఎనభై దశకాలలో తెలుగు మీడియాలో పేరుగాంచిన పాత్రికేయులు, హేతువాది, మానవతావాది. కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, వైఎస్ వంటి ముఖ్యమంత్రిస్థాయి నాయకులతో నేరుగా మాట్లాడేటంత చనువు, సాన్నిహిత్యం వీరికి ఉండేది. అమెరికానుంచి వెలువడే ప్రముఖ వ్యాపారపత్రిక 'వాల్‌స్ట్రీట్ జర్నల్' ఎడిటర్ రాజు నరిశెట్టి వీరి కుమారుడే. ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ ఇచ్చే గౌరవ డాక్టరేట్లపై సంతకాలు చేసే రాయ్ బి అలివర్ అనే వ్యక్తికోసం ఇన్నయ్య ఆరా తీయగా అతను క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ఫ్రాన్సిస్కోలో లాస్ ఆల్టోస్ అనే చోట ఉన్నట్లు తెలిసింది. ఇన్నయ్య నేరుగా ఆయన ఉన్నచోటికి వెళ్ళి కలిసి యూనివర్సిటీ ఎక్కడ అని అడగగా, వాషింగ్టన్ నగరంలో ఒక చిరునామాను ఇచ్చరట. తమ యూనివర్సిటీపై ఇండియాలోని హిందూ దినపత్రిక నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఆ పత్రికపై దావా వేయబోతున్నానని కూడా చెప్పాడట. ఇక ఇన్నయ్య అలివర్ ఇచ్చిన వాషింగ్టన్ చిరునామాకు వెళ్ళగా అది తాళంవేసిఉన్న ఒక అపార్ట్మెంట్ అడ్రస్‌గా తేలింది. చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న త్యాగరాజన్ అనే ఏజెంట్ ద్వారా అలివర్ డాక్టరేట్ డిగ్రీల బేరాలు మాట్లాడుకుంటాడని ఇన్నయ్యగారి పరిశోధనలలో బయటపడింది. ఇదీ మన లెజెండ్ మోహన్‌బాబుగారి డాక్టరేట్ ప్రహసనం. పద్మశ్రీ పురస్కారాన్ని ఇష్టమొచ్చినట్లు వాడుకోవటంపైన ఇప్పటికే హైకోర్టులో కేసునడుస్తున్న సంగతి తెలిసిందే. దానికితోడు ఈ నకిలీ డాక్టరేట్ విషయం కూడా హైకోర్టువారికి తెలిస్తే పెదరాయుడు పరిస్థితి ఏమిటో?
cherlapalli_jailer Posted March 27, 2014 Report Posted March 27, 2014 what do u mean ??? they r not fake they r original
jpnarayan1 Posted March 27, 2014 Report Posted March 27, 2014 what do u mean ??? they r not fake they r original :3D_Smiles:
perugu_vada Posted March 27, 2014 Report Posted March 27, 2014 Veediki doctorate icharante ardham aipovatla
sam86 Posted March 27, 2014 Report Posted March 27, 2014 Lol anni potunnayigaa Brahmins sapam tagilindemo
vikuba Posted March 27, 2014 Report Posted March 27, 2014 vammo andharu fake univs lo chadivitey...veedu ekanga fake doctrate konesaadu... kool
solman Posted March 27, 2014 Author Report Posted March 27, 2014 vammo andharu fake univs lo chadivitey...veedu ekanga fake doctrate konesaadu... kool
Recommended Posts