Jump to content

Mohanbabu Doctorate Is Fake.. Fraud


Recommended Posts

Posted

mohanbabu.jpg

 

 

డైలాగ్‌కింగ్ మోహన్‌బాబును మరో వివాదం చుట్టుముట్టిందిఅయినా వివాదాలు ఆయనకు కొత్తకాదనుకోండిఈ సారి వివాదం ఆయనకు కొన్నేళ్ళక్రితం లభించిన గౌరవ డాక్టరేట్ పట్టాపై.అమెరికాలోని ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ మోహన్‌బాబుకు డాక్టరేట్ పట్టాఇచ్చి గౌరవించిందిఅప్పటివరకు ఎన్టీఆర్ఏఎన్‌ఆర్ వంటి గొప్పనటులకు ఆంధ్రా యూనివర్సిటీయో,నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్‌లు ఇవ్వటంమాత్రమే చూసిన తెలుగువారికి మోహన్‌బాబు నేరుగా అమెరికానుంచే డాక్టరేట్ పట్టా పొందటం ఆశ్చర్యకరంగానూఅపూర్వంగానూ అనిపించింది.ఈ అరుదైన ఘనత సాధించినందుకు ఆయనకు చెన్నైలో నాడు భారీఎత్తున సన్మానంకూడా జరిగింది.

 
సదరు అమెరికా యూనివర్సిటీ ఒక పెద్ద ఫ్రాడ్ అని ఇప్పుడు తేలిందిఈ సంస్థ మోహన్‌బాబుకేకాక మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు(మాజీ మంత్రి గల్లా అరుణతండ్రి), మిసిమి పత్రిక ఎడిటర్ ఆలపాటి రవీంద్రనాథ్ వంటి మరికొందరు తెలుగువారికికూడా ఈ గౌరవ డాక్టరేట్‌లు ఇచ్చిందటఈ యూనివర్సిటీ వ్యవహారం తేడాగా ఉన్నట్లు గమనించిన నరిశెట్టి ఇన్నయ్యగారనే సీనియర్ తెలుగు జర్నలిస్ట్ అమెరికా వెళ్ళినపుడు దీనిపై పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయిఇక్కడ ఇన్నయ్యగారిని గురించి చెప్పుకోవాలిఈయన డెబ్భైఎనభై దశకాలలో తెలుగు మీడియాలో పేరుగాంచిన పాత్రికేయులుహేతువాదిమానవతావాదికోట్ల విజయభాస్కరరెడ్డిమర్రిచెన్నారెడ్డిభవనం వెంకట్రామరెడ్డివైఎస్ వంటి ముఖ్యమంత్రిస్థాయి నాయకులతో నేరుగా మాట్లాడేటంత చనువుసాన్నిహిత్యం వీరికి ఉండేదిఅమెరికానుంచి వెలువడే ప్రముఖ వ్యాపారపత్రిక 'వాల్‌స్ట్రీట్ జర్నల్ఎడిటర్‌ రాజు నరిశెట్టి వీరి కుమారుడే.
 
ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ ఇచ్చే గౌరవ డాక్టరేట్‌లపై సంతకాలు చేసే రాయ్ బి అలివర్ అనే వ్యక్తికోసం ఇన్నయ్య ఆరా తీయగా అతను క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో లాస్ ఆల్టోస్ అనే చోట ఉన్నట్లు తెలిసిందిఇన్నయ్య నేరుగా ఆయన ఉన్నచోటికి వెళ్ళి కలిసి యూనివర్సిటీ ఎక్కడ అని అడగగావాషింగ్టన్ నగరంలో ఒక చిరునామాను ఇచ్చరటతమ యూనివర్సిటీపై ఇండియాలోని హిందూ దినపత్రిక నిరాధారమైన ఆరోపణలు చేస్తోందనిఆ పత్రికపై దావా వేయబోతున్నానని కూడా చెప్పాడటఇక ఇన్నయ్య అలివర్ ఇచ్చిన వాషింగ్టన్ చిరునామాకు వెళ్ళగా అది తాళంవేసిఉన్న ఒక అపార్ట్‌మెంట్ అడ్రస్‌గా తేలింది.
 
చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న త్యాగరాజన్ అనే ఏజెంట్ ద్వారా అలివర్ డాక్టరేట్ డిగ్రీల బేరాలు మాట్లాడుకుంటాడని ఇన్నయ్యగారి పరిశోధనలలో బయటపడిందిఇదీ మన లెజెండ్ మోహన్‌బాబుగారి డాక్టరేట్ ప్రహసనంపద్మశ్రీ పురస్కారాన్ని ఇష్టమొచ్చినట్లు వాడుకోవటంపైన ఇప్పటికే హైకోర్టులో కేసునడుస్తున్న సంగతి తెలిసిందేదానికితోడు ఈ నకిలీ డాక్టరేట్ విషయం కూడా హైకోర్టువారికి తెలిస్తే పెదరాయుడు పరిస్థితి ఏమిటో?
Posted

lakshmi-manchu-o.gif

what do u mean ??? they r not fake they r original

Posted

what do u mean ??? they r not fake they r original

:3D_Smiles:
Posted

vammo andharu fake univs lo chadivitey...veedu ekanga fake doctrate konesaadu... kool

Posted

vammo andharu fake univs lo chadivitey...veedu ekanga fake doctrate konesaadu... kool

legendcrying.giflegendcrying.gif

×
×
  • Create New...