karan_410 Posted March 27, 2014 Report Posted March 27, 2014 అమ్మో.. బాపుగారి బొమ్మో... అంటూ ఆ అందంపై ఎంతో ముచ్చటపడి పాడుకొన్నాడు పవన్ కళ్యాణ్. `అత్తారింటికి దారేది` చిత్రంలో. నిజంగానే... సినిమాలో కన్నడ కస్తూరి ప్రణీత తన అందంతో చంపేసింది. ప్రణీతని చూసినవాళ్లంతా `అబ్బ... ఏం అందం` అన్నారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో అమ్మడి జాతకం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో అప్పటిదాకా ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్రపడిన ప్రణీతకి వరుసగా అవకాశాలు వచ్చేశాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి `రభస` చేస్తోంది. ఇప్పుడు ఆమె హిందీపై కన్నేసినట్టు సమాచారం. ఇటీవల అక్షయ్‌కుమార్ కొత్త సినిమా కోసం జరుగుతున్న ఆడిషన్స్‌లో ప్రణీత పాల్గొనిందట. `స్పెషల్ ఛబ్బీస్` చిత్రాన్ని తెరకెక్కించిన నీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్ మరో చిత్రం చేయబోతున్నారు. అందులో కథానాయికగా ఓ కొత్తమ్మాయి కావాలనుకొంటున్నారట. అందుకే... ప్రణీతకి పిలుపొచ్చింది. ఆడిషన్స్‌లో బాగానే ఆకట్టుకుంది కానీ... ఆమె హిందీ డైలాగులు చెప్పిన విధానం మాత్రం చిత్రబృందానికి అంతగా నచ్చలేదట. మరి ఆ అవకాశం అమ్మడిని వరిస్తుందో లేదో చూడాలి. హిందీపై కూడా కన్నేసిన ప్రణీత ఎంత హుషారో కదూ!
Recommended Posts