truth_lover Posted March 28, 2014 Report Posted March 28, 2014 హైలైట్స్: - లెజెండ్‌గా బాలకృష్ణ పర్‌ఫార్మెన్స్ - విలన్‌గా జగపతిబాబు గెటప్ - సెకండాఫ్‌లో కొన్ని సీన్స్డ్రాబ్యాక్స్: - ఫస్టాఫ్ - బ్రహ్మానందం కామెడీ ట్రాక్ - ప్రీ క్లయిమాక్స్ సీక్వెన్స్విశ్లేషణ:‘లెజెండ్’కి పెద్ద ప్లస్ బాలకృష్ణ పర్‌ఫార్మెన్స్. స్టోరీ పరంగా కొత్తదనం ఏమీ లేదు. కథనంలో ఎలాంటి ఆసక్తికర అంశాలు కనిపించవు. కానీ బాలకృష్ణ బలానికి తగ్గట్టుగా ‘లెజెండ్’ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దాడు బోయపాటి శ్రీను. తనకి సూట్ అయ్యే క్యారెక్టర్‌లో బాలకృష్ణ ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి, వీక్ సబ్జెక్ట్‌కి కూడా బూస్ట్ ఇస్తాడు. లెజెండ్ కథాపరంగా బలహీనంగా ఉన్నా, కథనంలో అనేక లోపాలు దొర్లినా కానీ ద్వితీయార్థంలో బాలకృష్ణ కొమ్ము కాసాడు. ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ విలన్ పాత్రలో జగపతిబాబు. నిజానికి బాలకృష్ణ, జగపతిబాబుల కాంబినేషన్‌ని వాడుకుని... ఇద్దరికీ పోటాపోటీ పాత్రలు రాసుకుని ఉంటే ‘లెజెండ్’ స్వరూపమే మారిపోయి ఉండేది. కానీ సగటు తెలుగు సినిమా పద్ధతులకి తగ్గట్టు హీరోని బాగా బలవంతుడ్ని చేసి, విలన్‌ని వీలయినంత వీక్ చేసి పారేసారు. దీని వల్ల ఎక్కడా ఉత్కంఠ అనేది లేకుండా పోయింది. కేవలం హీరో ఎలివేషన్ సీన్స్‌తోనే బండి లాగించాల్సి వచ్చింది. అదే జగపతిబాబు పాత్రని బలంగా తీర్చిదిద్దినట్టయితే, చివరి వరకు బాలయ్యతో సమానంగా తలపడినట్టయితే సబ్జెక్ట్ వేల్యూ పెరిగి ఉండేది. బాలకృష్ణ నటించిన అనేక హిట్ చిత్రాల్లోని ఫార్ములాని తీసుకుని తనకి తెలిసిన ‘టూ షేడ్స్’ ఫార్ములాతో మిక్స్ చేసి ‘లెజెండ్’ స్టోరీ రెడీ చేసాడు బోయపాటి శ్రీను. సినిమాలో ఎక్కడా హై పాయింట్స్ లేవు. ఫలానా సీన్ అద్దిరిపోయింది అనిపించే సందర్భం రాదు. ఏదో అలా అలా సాగిపోతూ ఉంటుంది. బాలకృష్ణ ట్రేడ్‌మార్క్ డైలాగ్ డెలివరీ, ఫాన్స్ ఇన్‌స్టంట్‌గా రిలేట్ అయ్యే డైలాగ్స్ జత కలవడంతో ఫాన్స్‌కి ‘లెజెండ్’ ఎక్స్‌ట్రా కిక్ ఇస్తుంది. అయితే ఫాన్స్‌కి, ఇలాంటి సినిమాలు ఇష్టపడే మాస్ ఆడియన్స్‌కి మినహా మిగతా వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలైతే ఇందులో పూర్తిగా మిస్ అయ్యాయి. చాలా కాలంగా పెద్ద సినిమాలు రాని టైమ్‌లో రిలీజ్ అయిన లెజెండ్ ఆ ‘కరువు’ని ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందనేది చూడాలి. బాలకృష్ణ నటించిన లెజెండరీ బ్లాక్‌బస్టర్ సినిమాలైన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి వాటితో పోల్చి చూస్తే నిరాశ తప్పదు. బాలకృష్ణ రీసెంట్ ఫ్లాప్స్‌తో పోల్చి చూస్తే ‘మచ్ బెటర్’ మూవీ అనుకోవచ్చు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.