Jump to content

Recommended Posts

Posted

రామ్ చరణ్ మీద ముచ్చటగా మూడో పోలీస్ కేసు

 

ram-charan-police-case-birthday_13964428

బాబాయ్ పవన్ కళ్యాణ్ మీటింగుకి పోటీగా బర్త్ డే వేడుకలు జరుపుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. గత నెల 28న జూబ్లీ హిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అభిమానుల సమక్షంలో చెర్రీ అట్టహాసంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దాన్ని ఉల్లంగించి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నందుకు ఇప్పుడు చెర్రీ మీద పోలీస్ కేసు నమోదయ్యింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడం, ఫ్లెక్సీల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద చెర్రీ, స్వామినాయుడు ఫొటోలతో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన పోలీసులు చెర్రీ, స్వామినాయుడులపై ఐసీపీ సెక్షన్ 421 (1), జీహెచ్ఎంసీ ప్రకటనల నిషేధిత చట్టం కింద కేసు నమోదు చేశారు. రాంచరణ్ బాబుతో పాటు చిరు అభిమాన సంఘం అధ్యక్షుడు నాయుడు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయినా చెర్రీకి ఇలాంటి కేసులు కొత్తేమీ కాదు. గతంలో రోడ్ మీద సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో గొడవపడ్డాడని ఒకసారి, ఎవడు సినిమాలో అసభ్యమయిన సీన్లలో నటించాడని రెండోసారి పోలీసులు కేసు బుక్ చేసారు. ఇప్పుడు ఇది ముచ్చటగా మూడవది. ఇది కూడా గత కేసుల్లాగా గాలికి పోయేదే అని వేరే చెప్పాలా?

×
×
  • Create New...