Jump to content

Recommended Posts

Posted

తెలంగాణలో హంగే… తక్కువ సీట్లున్నా కింగే!

telangana.jpgమొత్తం 119 సీట్లు.. ఐదు ప్రధాన రాజకీయ పార్టీలు… మరో ఐదు బుల్లి పార్టీలు. ప్రతి పార్టీ తరపున రెబల్ క్యాండిడేట్లు… ఉద్యమం ఊపుతో రాజకీయాల్లో సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్న ఇండిపెండెంట్లు… ప్రతి పార్టీ చేతిలోనూ ఒక ఆయుధం. ప్రతి నాయకుడి నోటిలోనూ ఒక నినాదం. వెరసి తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం ఒక రాజకీయ గందరగోళంతో మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

దేశంలోని అనేక చిన్న రాష్ట్రాల్లో వచ్చే రాజకీయ అనిశ్చిత స్థితే తెలంగాణలో కూడా ఏర్పడేలా ఉంది. చిన్న రాష్ట్రాల వల్ల రాజకీయపరంగా ఎలాంటి సమస్యలు వస్తాయో తెలంగాణను కూడా అవే సమస్యలు పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నో కోట్లమంది ప్రజల కలల పంటగా ఏర్పడిన తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
దాదాపు ఏడాది కిందటి పరిస్థితిని తీసుకొంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ స్వీప్ చేస్తుందేమోనని అనిపించేది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న టీఆర్ఎస్ ఆ ప్రాంతంలోని అన్ని సీట్లనూ స్వీప్ చేస్తుందనే అభిప్రాయాలు వినిపించాయి. విభజన జరుగుతున్నపుడు జరిగితే ఇక టీఆర్ఎస్ దే రాజ్యం అని అందరూ నమ్మారు. సర్వేలు కూడా అదే చెప్పాయి. అయితే పరిస్థితుల్లో చాలా వేగంగా మార్పు వచ్చింది. ఏడాది కిందట రాష్ట్ర విభజన గురించి ఏమీ తేల్చని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ప్రెస్ వేగంతో పావులు కదిపి బీజేపీని బ్లాక్ మెయిల్ చేసి మరీ తెలంగాణ ఇచ్చింది. ఇది కనీసం ఎవరి అంచనాలకు అందలేదు. ఏ తెలివితక్కువ వాడు సీమాంధ్రలో పాతిక సీట్లు వదులకుంటుందంటే నమ్మడు అన్నారు. కానీ అంతా తారుమారయింది. దీంతో అప్పటి వరకూ తెలంగాణ ఛాంపియన్ గా వెలిగిన టీఆరెస్ ను కాంగ్రెస్ దాటేసింది. దీంతో టీఆర్ఎస్ కు కష్టకాలం వచ్చింది.
తమ వల్లనే తెలంగాణ వచ్చిందని అంటున్నారు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు. సోనియా అనుకోబట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవుతోంది కానీ.. వేరే కారణాలు ఏమీ లేవని వారు ప్రచారం చేసుకొంటున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితి కనిపిస్తోంది. సంప్రదాయ బద్ధంగా వస్తున్న క్యాండర్ తో తెలంగాణ ప్రాంతంలో హస్తం పార్టీ హవా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలం సోనియాను నమ్మడం వల్లే గాని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలను నమ్మడం వల్ల కాదు. అయితే, ఇక్కడి నేతలు సోనియా త్యాగాన్ని సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ఒక్కతాటిపైకి తెచ్చే శక్తి ఉన్న వారు కాదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా మెజారిటీ సీట్లు దక్కే అవకాశాలు కనపడటం లేదు. అవసరమైన 60 సీట్ల కన్న కాంగ్రెస్ కు కొన్ని తక్కువ సీట్లు దక్కే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక టీఆర్ ఎస్ కు ఇప్పుడు క్యాడర్ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ కోసం పోరాడుతున్నంత సేపూ, తెలంగాణ ఇంకా కన్ఫర్మ్ కానంతసేపూ టీఆర్ఎస్ కు అంతా బాగుంది కానీ…. తెలంగాణ వచ్చాక మాత్రం ఆ పార్టీ కి ఎదురుగాలి వీస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి కి కూడా తగినన్ని సీట్లు లభించే అవకాశాలు లేవు. క్యాడర్ లోటు వల్ల కాంగ్రెస్ కన్నా కొన్ని తక్కువ సీట్లతోనే సర్దుకోనుంది టీఆర్ఎస్ పార్టీ.
ఆ తర్వాత బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయడం కూడా తెలంగాణలో ఆసక్తికరమైన పరిణామాలకు తెరలేపుతోంది. ఓవరాల్ గా ఈ కూటమికి  ఎంత తక్కువ వేసుకుని 20- 25 దాకా వస్తాయి.  112 (ఏడు ఎంఐఎంవే కదా) సీట్లలో దాదాపు  పాతిక సీట్లు అంటే  హంగ్ పరిస్థితుల మధ్య అది గొప్ప సంగతి అవుతుంది.

మరోవైపు కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాల్లో కూడా అభ్యర్థులను నిలెబట్టుకొంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ లెక్క ప్రకారం చూసుకొంటే జగన్ పార్టీ కూడా తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపాకు కనీసం పది సీట్లు సొంతం చేసుకోన్నా అది సంచలనమే అవుతుంది.  ఇలాంటి పార్టీల మధ్య తెలంగానలో రాజకీయ చిత్రం గందరగోళంగా కనిపిస్తోంది. ఇప్పుడు కింగ్ ఎవరు ? కింగ్ మేకర్ ఎవరు ? అనే విషయాల గురించి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆ విషయం గురించి విశ్లేషిస్తే….
-కాంగ్రెస్ కు  అధికారం అతి తక్కువ సీట్లతో అధికారం చేజారితే వైకాపాను సంప్రదిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా కాంగ్రెస కు మద్దతు ప్రకటిస్తుందో లేదో అర్థం కావడం లేదు.
-కాంగ్రెస్ పార్టీ మెజారిటీకి అతి దగ్గర లో నిలబడగలిగితే ఎంఐఎం మద్దతు ఎలాగూ ఉంటుంది.
-కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు తిట్టుకొంటూనే ఉన్నాయి. . నారాయణ పార్టీనేమో కాంగ్రెస్ వెంట వెళ్లగా, సీపీఎం తాము నారాయణకు మద్దతునిచ్చేది లేదని స్పష్టం చేసింది.
-ఇక బీజేపీ, టీడీపీల మధ్య సీట్ల గురించి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలకూ రెబెల్స్ గుండెల్లో బెల్స్ మోగిస్తున్నారు.
-వైకాపా విషయానికి వస్తే ఏకంగా 81 స్థానాలకు టికెట్లను కేటాయించి సంచలనం సృష్టించాడు జగన్. వీళ్లలో ఎంతమంది గెలుస్తారు? అనే విషయం అంతుబట్టకుండా పోయింది.
ఈనేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీకి కచ్చితంగా మెజారిటీ వచ్చే అవకావాలు తక్కువే. కింగ్ మేకర్లకు మంచి టైమొచ్చినట్టే. మరి ఆ కింగ్ మేకర్ ఎవరు? తెలుగుదేశం పార్టీ అవుతుందా? బీజేపీ అవుతుందా? ఎంఐఎం పార్టీనా లేక ఇండిపెండెంట్లా వేచి  చూడాలి.
 
ee article lo cheppinatlu small sates lo too many politicla parties seats share chesukoni blackmailing politics chestu unstable Govt tho devolep kakunda pothayi. TG lo ade jaragabothundi..
 
TG raganae pandaga chesukunnaru edo singapore, taiwan aipoinatlu, illu alakagane pandaga kadu TG ku real challange elections ayyaka face avvabothundi.
 
SA future TG kante chala bright ga untundi jagan rakunte e term ki
  • Replies 44
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ticket

    6

  • Splash

    6

  • kollipara

    5

  • Ekambaram

    5

Posted

మరోవైపు కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాల్లో కూడా అభ్యర్థులను నిలెబట్టుకొంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ లెక్క ప్రకారం చూసుకొంటే జగన్ పార్టీ కూడా తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపాకు కనీసం పది సీట్లు సొంతం చేసుకోన్నా అది సంచలనమే అవుతుంది.  ఇలాంటి పార్టీల మధ్య తెలంగానలో రాజకీయ చిత్రం గందరగోళంగా కనిపిస్తోంది. ఇప్పుడు కింగ్ ఎవరు ? కింగ్ మేకర్ ఎవరు ? అనే విషయాల గురించి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆ విషయం గురించి విశ్లేషిస్తే….
 
-వైకాపా విషయానికి వస్తే ఏకంగా 81 స్థానాలకు టికెట్లను కేటాయించి సంచలనం సృష్టించాడు జగన్. వీళ్లలో ఎంతమంది గెలుస్తారు? అనే విషయం అంతుబట్టకుండా పోయింది.
 
zero for jail jagan in TG gif_257x187_807b0d.gif

Posted

Hung .. A
Bongem kadhu

Ysr party lite gaani...no party will form the govt without support even this time..it is called hung..wait and see..
Posted

Hung .. A
Bongem kadhu

evariki majority vastundi..konchem light veyyi
 
Posted

definite ga coilation govt ye TG lo, adi MIM+Congi or TRS+MIM or TDP+BJP+TRS aa anedi to be decided

Posted

definite ga coilation govt ye TG lo, adi MIM+Congi or TRS+MIM or TDP+BJP+TRS aa anedi to be decided

90% TRS+TDP+BJP authundi...TRS BJP help defiante ga tesukuntundi, Ikkada SA tho poti mari SA ki e project vachina manaku edi ani KCR ni tidataru

Posted

zero for jail jagan in TG gif_257x187_807b0d.gif

Yeah vidiki zero ne le

Posted

90% TRS+TDP+BJP authundi...TRS BJP help defiante ga tesukuntundi, Ikkada SA tho poti mari SA ki e project vachina manaku edi ani KCR ni tidataru

hmm depends on seats le bhayya edayina, I guess Congi+MIM has more chances

Posted

definite ga coilation govt ye TG lo, adi MIM+Congi or TRS+MIM or TDP+BJP+TRS aa anedi to be decided

First two tho kooda kastame anukuntunna nenu aithe mim vi 7 a kada trs or congress should get 53 possible but not so easy..may be trs+congress+mim or tdp+bjp+trs
Posted

definite ga coilation govt ye TG lo, adi MIM+Congi or TRS+MIM or TDP+BJP+TRS aa anedi to be decided

Edho ryming Kosam vaada

Lets wait for one more week.. Candidates antha confirm avvani
Posted

hmm depends on seats le bhayya edayina, I guess Congi+MIM has more chances

mmm velladdariki 60 ravadam chala kastam vachina just 2 or 3 seats difference unte GOVt eppudu danger zone lone untundi..Stable Govt ki atleast 80 seats aina undali

Posted

మరోవైపు కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాల్లో కూడా అభ్యర్థులను నిలెబట్టుకొంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ లెక్క ప్రకారం చూసుకొంటే జగన్ పార్టీ కూడా తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపాకు కనీసం పది సీట్లు సొంతం చేసుకోన్నా అది సంచలనమే అవుతుంది. :P

×
×
  • Create New...