YashwanthX Posted April 6, 2010 Report Posted April 6, 2010 Home Secretaty GK Pillai said that India will give a befitting reply to the Maoists, who killed 74 CRPF personnel in an ambush in Dantewada district.దిమ్మదిరిగే జవాబు ఇస్తాం: జీకే పిళ్లైన్యూఢిల్లీ, ఏప్రిల్ 6: "ఎక్కడో తప్పు జరిగింది. లేకపోతే ఇంతమందిని కోల్పోయి ఉండేవాళ్లం కాదు'' అని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జీకే పిళ్లై వ్యాఖ్యానించారు. తాజా దాడితో మావోయిస్టులను నిర్మూలించాలన్న తమ సంకల్పం మరింత బలోపేతమైందని, మావోయిస్టులకు దిమ్మదిరిగే జవాబు చెబుతామని ఆయన స్పష్టం చేశారు. దంతెవాడలో మావోయిస్టుల మెరుపు దాడి తర్వాత పిళ్లై విలేఖరులతో మాట్లాడారు. మావోయిస్టులను 'హంతకులు'గా ఆయన అభివర్ణించారు.పక్కా ప్రణాళిక ప్రకారం మావోయిస్టు భూతాన్ని అరికడతామని తేల్చి చెప్పారు. ప్రాథమిక నివేదికలను బట్టి మావోయిస్టులు ప్రెషర్ బాంబులు ఉపయోగించినట్లు తెలుస్తోందన్నారు. అయితే, మావోయిస్టులను ఎదుర్కొనేందుకు వైమానిక దళాన్ని ఉపయోగిస్తారన్న వాదనలను ఆయన ఖండించారు. "నక్సల్స్ నిర్మూలనకు ప్రస్తుత సమయంలో వైమానిక దళాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నేను భావించడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులతోనే మేం ఎదుర్కోగలం. మా వ్యూహాన్ని విస్తరిస్తున్నాం. వైమానిక దళాల అవసరం లేకుండా మాకు ఉన్న వనరులతోనే ఎదుర్కోగలం'' అని ఆయన వివరించారు. మావోయిస్టుల అదుపులో భద్రతా దళాలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు.
perk Posted April 7, 2010 Report Posted April 7, 2010 ani states nunchi police force tepinchi, verste sari.....
Handsome Posted April 7, 2010 Report Posted April 7, 2010 chuddam yem cheystaroo [img]http://i43.tinypic.com/rs4w11.gif[/img]
Recommended Posts