Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్: తమ ఫేస్‌బుక్ ఖాతా లైక్స్‌పై వస్తున్న నిరాధార ఆరోపణలు తెలుగుదేశం పార్టీ ఖండించింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన అధికారిక ఫేస్‌బుక్ పేజిలో 1.44 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఫేస్‌బుక్ పేజీని పార్టీ పేజికి కలపడం వల్ల ఈ సంఖ్య మరింత పెరిగిందని వివరణ ఇచ్చింది. కాగా, పార్టీ పేజితో చంద్రబాబు నాయుడు ఫేస్‌బుక్ పేజీని కలపడం వల్ల ఒక్క రాత్రిలోనే అత్యధిక సంఖ్యలో లైక్స్ వెల్లువెత్తాయి. చంద్రబాబు నాయుడుకున్న 1.4 లక్షల లైక్స్ తోపాటు పార్టీ అధికారిక పేజీకున్న 70వేల ఫాలోవర్స్ చంద్రబాబుకు జతయ్యారు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు ఫాలోవర్స్ సంఖ్య భారీ మొత్తంలో పెరిగింది. ఈ ప్రక్రియ ఫేస్‌బుక్ నేతృత్వంలోనే చేయబడినట్లు, ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని పార్టీ శ్రేణులు తెలిపాయి. అయితే 4,482 లైక్స్ టర్కీ నుంచి వచ్చాయి. ఇది పార్టీ పేజీని లైక్ చేసిన వారిలో ఒకశాతం ఉంటుంది. దీనిపై పార్టీ శ్రేణులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా, ప్రభుత్వ గణాంకాల ప్రకారం టర్కీలో 239 మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. అందులో 200 మంది ఎన్నారైలు కాగా, 39 మంది భారత సంతతికి చెందినవారున్నారు. వీరంతా భారతీయులే కానీ తెలుగువారు కాదు. 239 మంది భారతీయులే టర్కీలో ఉంటే.. 4,482 లైక్స్ టిడిపి ఫేస్‌బుక్ పేజీకి ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకం. అంటే తెలుగు వారు, భారతీయుల కంటే తెలుగుదేశం పార్టీని టర్కీ దేశస్తులే ఎక్కువ ఇష్టపడుతున్నారా అనే విషయం సందేహాస్పదమే. ఒక్కరాత్రిలో చంద్రబాబు నాయుడు పేజీని టిడిపి పేజితో అనుసంధానం చేయడం వల్ల ఇంత భారీగా లైక్స్ ఎలా వచ్చాయనేదానిపై టిడిపి వివరణ సరైన ఇవ్వలేకపోతోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన 18 శాతం లైక్స్.. ఈ పేజీలు కలపడం వల్ల 4శాతం తగ్గినట్లు తెలుస్తోంది. టర్కీ తర్వాత టిడిపి ఫేస్‌బుక్‌కి ఎక్కువ లైక్స్ వచ్చింది అమెరికా నుంచి. 22.4 లక్షల మంది భారతీయులున్న అమెరికా నుంచి కేవలం 6,199 లైక్స్ మాత్రమే వచ్చాయి. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 17.5 లక్షల జనాభా ఉండగా, ఇక్కడ్నుంచి 1,617 లైక్స్ వచ్చాయి. 524 మంది భారతీయులున్న అజీర్‌బేజాన్ దేశం నుంచి తెలుగుదేశానికి 166 లైక్స్ వచ్చాయి. జార్జియా, బల్గేరియా లాంటి కొత్త దేశాల నుంచి కూడా టిడిపికి లైక్స్ రావడం విశేషం. అయితే వీటిపై టిడిపి వివరణ ఇవ్వలేకపోయింది. కాగా, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా ట్విట్టర్‌లో 42శాతం మంది అనుమానాస్పద లేదా ఖాళీ ఫాలోవర్స్ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు 57శాతం అనుసమానాస్పద లేదా ఖాళీ ఫాలోవర్స్ ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పేజీలను కలపడం వల్ల కలిపే పేజీకి సంబంధించిన లైక్స్ మాత్రమే మాతృ పేజీకి కలపడం జరుగుతుంది.

 

Posted

Bongulodi asalu ysrcp anni likes enti saami.....ikkada DB ysrcp fans ee antaaru.....maaku village level lo support ekkuva......FB users lo TDP ke ekkuvani......Sakshi office lo kurchune new accounts open chestu YSRCP FB ke likes kodutunattu vunaaru!!!

Posted

Bongulodi asalu ysrcp anni likes enti saami.....ikkada DB ysrcp fans ee antaaru.....maaku village level lo support ekkuva......FB users lo TDP ke ekkuvani......Sakshi office lo kurchune new accounts open chestu YSRCP FB ke likes kodutunattu vunaaru!!!


4s086h.gif
×
×
  • Create New...