Jump to content

Ysrcp Agent Swallows Ballet Paper


Recommended Posts

Posted

అనంతపురం జిల్లాలోని నల్లచెరువు ఎంపిటిసి 1 స్థానంలో శంకర్ రెడ్డి అనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపు పోలింగ్ ఏజెంట్ ఓ ఓటరు నుంచి బ్యాలెట్ పత్రం లాక్కొని మింగేశాడు. సదరు ఓటరు తెలుగుదేశం పార్టీ గుర్తయిన సైకిల్‌కి ఓటు వేయడం గమనించిన శంకర్ రెడ్డి.. ఆమె చేతిలోని బ్యాలెట్ పత్రాన్ని లాక్కొని మింగేశాడు. శంకర్‌ను ఎన్నికల అధికారులు విచారించారు. అనంతరం అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గుంటూరు: జిల్లాలోని ముప్పాళ్ల మండలంలోని తురకపాలెంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్ పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సులో నీళ్లు వూసేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది అతన్ని పక్కకు లాగి అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమ పార్టీకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని అక్కసుతోనే జగన్ పార్టీ ఏజెంట్ ఈ పనికి పూనుకున్నాడని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపించారు.

తురకపాలెంలోని పోలింగ్ కేంద్రంలో జడ్పిటిసి అభ్యర్థి ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 361 ఓట్లకు 236 ఓట్లు పోలైన దశలో జగన్ పార్టీ ఏజెంటు పూదోట అంతయ్య మంచినీళ్లు తాగడానికి వెళ్లి నోటిలో నీరు పోసుకుని వచ్చి బ్యాలెట్ బాక్సులో నీళ్లు వూసేసాడు. బ్యాలెట్ బాక్సును పరిశీలించిన అధికారులు, పేపర్లు పూర్తిగా పాడవలేదని గుర్తించారు. పోలింగ్‌ను యధావిధిగా కొనసాగించారు

 

×
×
  • Create New...