Rahul7488 Posted April 15, 2014 Report Posted April 15, 2014 తమన్ వెళ్ళిపోయాడా? తరిమేశారా? కృష్ణవంశీ-రామ్ చరణ్ సినిమా నుండి తమన్ అవుట్ అయ్యాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా రూపొందిస్తున్న గోవిందుడు అందరి వాడేలే సినిమాకు తమన్ సంగీత దర్శకుడుగా ఖరారయ్యాడని చాలాకాలంగా అనుకుంటూ వచ్చారు. కొంతమేర తమన్ వర్క్ కూడా చేసి దర్శక, నిర్మాతలకు కూడా వినిపించగా ఇప్పుడు తమన్ స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ ను తీసుకున్నారు గోవిందుడు యూనిట్.తమన్ ను ఎందుకు తొలగించారనేది సరైన కారణాలు బయటికి రాకపోయినా తమన్ ను తప్పిస్తారని కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజున సందర్భంగా రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ లో కూడా దర్శకుడు, నిర్మాత పేర్లతో రామ్ చరణ్ లుక్ రిలీజ్ చేశారు. అప్పుడే ఈ సినిమాలో తమన్ అనుమానమేనని అనుకున్నారు. అన్నట్లే జరిగింది.నిజానికి తమన్ అందించిన ట్యూన్స్ దర్శకుడు కృష్ణవంశీకి నచ్చలేదని అందుకే తొలగించారని కొంత ప్రచారం జరుగుతుంది. నిజానికి ఆయన సినిమాల్లో పాటలకు ఎక్కువ ప్రాధాన్యముంటుంది. మ్యూజిక్ సెన్స్ ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. తమన్ అందించిన ట్యూన్స్ తన కథకు సరిపోవట్లేదని భావించి తమన్ ని వద్దన్నారట. మరి జీవీ అయినా కృష్ణవంశీని అందుకుంటాడో లేదో చూడాలి!
Power Star Posted April 15, 2014 Report Posted April 15, 2014 why hating man istam lekapothe vinakandi
Recommended Posts