slutreddy Posted April 16, 2014 Report Posted April 16, 2014 సినిమా రంగంలో తొలినాళ్లలో రంగప్రవేశం చేసిన వారిలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడగటినట్లు మరే నటుడు సంపాదించలేదు. తరువాత తరంలో శోభన్ బాబు అలా జాగ్రత్త పడ్డారు. మలి తరంలో చిరంజీవి, నాగార్జున ఆ కోవకు చెందిన వారే. ఎన్టీఆర్ సిఎమ్ కావడానికి ముందు, అప్పటిదాకా సంపాదించినదంతా పిల్లలకు ఇచ్చేసారు. ఆపై మళ్లీ సంపాదించారా, అదంతా ఏమయింది, లక్ష్మీ పార్వతి నుంచి ఎన్టీఆర్ సొమ్మును అందుకున్న త్రిమూర్తులు ఎవరు? వారిలో ఒక్క కృష్ణా జిల్లా తేలుగుదేశం నాయకుడు ఒకరు మాత్రమే తిరిగి ఇచ్చారు, మిగిలినవారు హాం పట్ చేసారు.. వారిలో ఓ సినిమా నటుడు కూడా వున్నారన్న సంగతులు అన్నీ వేరు. ఎన్టీఆర్ పంచి ఇచ్చిన సంపదను నిలబెట్టుకన్న కొడుకులు ఇద్దరే అని అంటారు. ఒకరు జయకృష్ణ. రెండవది బాలకృష్ణ. మిగిలన వారంతా చాలా వరకు ఆస్తులు పాడుచేసుకున్నారని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, గతంలో ఎన్టీఆర్ తన తనయుడి ఒకరికి ఇచ్చిన ఆర్ కె కాంప్లెక్స్ కూడా ఇప్పుడు చేతులు మారి బాలకృష్ణ దగ్గరే వుంది. పైగా బాలకృష్ణ సతీమణికి పిత్రార్జితం కూడా బాగా వున్నట్లు అంటారు. మొత్తం మీద ఎన్టీఆర్ సంపాదించిన దానికన్నాబాలకృష్ణ ఎక్కువే కూడ బెట్టినట్లుంది, ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన నివేదికలో 170 కోట్లు వరకు ఆస్తి వున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు బిడ్డల పెళ్లి భారీగా చేసిన తరువాత, అదికారికంగా ఈ మేరకు వుందంటే, అనధికారికంగా, మార్కెట్ విలువల ప్రకారం మరి ఎంత వుంటుందో. బాలకృష్ణ, తన తండ్రి తరువాత నందమూరి వారి పరువు నిలబెట్టినట్లే అనుకోవాలి. - See more at: http://telugu.greatandhra.com/politics/elections-2014/balakrishna-sampadana-bagane-vundi-51942.html#sthash.oakZATIn.dpuf
Recommended Posts