Jump to content

Gas Andhra Gadi Comedy: Ycp 135 Seats Anta


Recommended Posts

Posted

ఎవరెవరు చేయిస్తున్న సర్వేలు.. జ్యోతిష్యబ్రహ్మలు వెలువరించే ఉగాది ఫలితాల్లా.. ఎవరికి అనుకూలమైన సంకేతాలను వారికి ఇస్తుండవచ్చు గాక...! వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేలు పరస్పర భిన్నమైన ఫలితాలను వెలువరిస్తూ.. ఏకంగా.. సర్వేలు జరిగే తీరు, చేసే సంస్థల విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మారుస్తుండవచ్చు గాక...! అయితే, సాక్షాత్తూ కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేసే.. కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో పాలక పక్షానికి తప్పుడు నివేదిక ఇస్తుందనుకోవడం భ్రమ. అలాంటి నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో వారి నివేదిక ప్రకారం.. సీమాంధ్ర రాష్ట్రం యావత్తూ.. జగన్‌కు బ్రహ్మరథం పట్టబోతున్నది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏకపక్షంగా ప్రజలు అధికార పీఠంపై కూర్చోబెట్టబోతున్నట్లుగా కేంద్ర ఇంటెలిజెన్స్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఆ ప్రచారం ప్రకారం సీమాంధ్రలో పార్టీలు గెలవబోతున్న సీట్ల వివరాలు ఇలా ఉంటున్నాయి.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 130 నుంచి 135
తెలుగుదేశం 35 నుంచి 45
కాంగ్రెస్‌ 1 నుంచి 2

వైఎస్సార్‌ సీపీ ఎలాంటి శషబిషలు లేకుండా.. ఏకపక్షంగా అధికారంలోకి రాబోతున్నట్లుగా ఇంటెలిజెన్స్‌ నివేదిక పేర్కొంటున్నది.

మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు సీమాంధ్ర ఎన్నికల ఫలితాలపై చాలా మందిలో ఉత్కంఠ ఉంది. వైఎస్సార్‌ మరణం తర్వాత.. ఆయన పేరిట పార్టీ స్థాపించిన జగన్‌.. ఆ తరువాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో ప్రభంజన సదృశంగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఎలా నెగ్గుకొస్తారో చూడాలని చాలామందిలో ఆసక్తి ఉంది. దానికి తగ్గట్లుగా జాతీయ స్థాయి సంస్థలే అయినా.. ఈ రాష్ట్రంలో వేర్వేరు సంస్థలు చేస్తున్న సర్వేలు వేర్వేరు ఫలితాల్ని ఇస్తున్నాయి. నీల్సన్‌ సర్వేలు జగన్‌కు ఏకపక్షంగా అధికారం కట్టబెడితే.. ఎన్‌డీటీవీ సర్వేలు జగన్‌కు అంత సీన్లేదని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సర్వే ల మీదనే జనానికి మొహం మొత్తుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో వారి నివేదిక అంటూ పైన పేర్కొన్న గణాంకాలు లీక్‌ అయ్యాయి. వీటి ప్రకారం జగన్‌ అధికారంలోకి వస్తున్నట్లే. 130నుంచి 135 స్థానాలంటే.. ఫలితాల్లో ఎంత వ్యత్యాసం వచ్చినా.. సింపుల్‌ మెజారిటీతో గద్దె ఎక్కడం తప్పదని పలువురు అంటున్నారు. భాజపాతో పొత్తులని, కత్తులని... రకరకాల డ్రామాలకు తెరతీసి.. మోడీకి ఒక ఓటు బ్యాంకు మేనియా ఉన్నదని.. దాన్ని క్యాష్‌ చేసుకోగలమని రకరకాల ఎత్తులు వేసిన చంద్రబాబు ప్రయత్నాలు ఏమీ ఫలించేలా లేదు. ఆయన గరిష్టంగా 45 సీట్లు దాటకపోవచ్చునని ఐబీ రిపోర్టు చెబుతోంది.

Posted

Intelligne report veediki ela dorikindo?
mari nammettu ga rayi ra..

×
×
  • Create New...