Jump to content

Jr. Ntr Kuda Campaign Chesthadu Anta


Recommended Posts

Posted

తెలుగుదేశం పార్టీ తరఫున సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి గురువారం మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలియవచ్చింది. ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీలకు స్టార్ క్యాంపైనర్‌గా ఉంటానంటూ ప్రచారం చేసిన కొద్ది గంటలలోనే జూ. ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమైనట్లు తెలియవచ్చింది.

2009లో జూ. ఎన్టీఆర్ టీడీపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అలాగే 2014లో కూడా టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి జూ. ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఏయే నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తారు... రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలన్న అంశంపై రేపే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

×
×
  • Create New...