Aryaa Posted April 23, 2014 Report Posted April 23, 2014 పవన్‌కల్యాణ్ వద్దకు స్వయంగా వెళ్లిన చంద్రబాబు పవన్ అపాయింట్‌మెంట్ కోసం బాబు తిప్పలు.. అధినేత తీరును జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా కొనసాగిన టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్రతం చెడ్డా ఫలితం దక్కని పరిస్థితి ఎదురైంది! ఇటీవలే జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ను ప్రసన్నం చేసుకోడానికి పడరాని పాట్లు పడినా మద్దతుపై స్పష్టతరాలేదు. ఎన్నికల వేళ ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన పవన్‌కల్యాణ్.. టీడీపీని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనకు దగ్గరవడానికి చంద్రబాబు నానా తిప్పలు పడ్డారు. బుధవారం చంద్రబాబే స్వయంగా పవన్ వద్దకు వెళ్లి ఆయనతో భేటీ కావడం విశేషం. ముందుగా పవన్ ఇంటికి బయలు దేరిన బాబు... ఆయన కార్యాలయంలో ఉన్నారని తెలుసుకుని కాన్వాయ్‌ను మళ్లించి మరీ వెళ్లి కలుసుకున్నారు. మాజీ సీఎం ఇంత చేసినా పవర్ స్టార్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నాయకుడిగా చెప్పుకొనే బాబు ఓ సినీ నటుడి మద్దతు కోసం తాపత్రయపడటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. బాబును దూరం పెట్టిన పవన్
Ramki123 Posted April 24, 2014 Report Posted April 24, 2014 2009 Young Tiger ....ippudu Power Star Kallu
Recommended Posts