Jump to content

Chiranjeevi About Pawan Kalyan's Political Entry - Exclusive Interview


Recommended Posts

Posted

ఇంతకూ పవన్‌ కల్యాణ్‌ కేసీఆర్‌ మీద అంత భారీ స్థాయిలో ఎందుకు నిప్పులు చెరగుతున్నట్లు...? పవన్‌ కల్యాణ్‌కు ఆవేశం ఎందుకు వస్తోంది? ఈ విషయంలో ఆయన చాలా స్పష్టతతోనే ఉన్నారు. తనను తిట్టినా ఊరుకుంటాను గానీ.. దేశానికి కాబోయే ప్రధానమంత్రిని , బీసీ కులాలకు చెందిన ప్రధానమంత్రిని తిడితే మాత్రం తాను ఊరుకునేది లేదంటూ పవన్‌ కల్యాణ్‌ సూటిగా చెప్పేశారు. అంటే మోడీని కేసీఆర్‌ సన్నాసి అంటూ తిడుతున్నాడు గనుక.. కేసీఆర్‌ మీద పవన్‌కు కోపం వచ్చిందన్నమాట. అందుకే ‘వరంగల్‌ నడిబొడ్డున నిల్చుని చెబుతున్నా.. కేసీఆర్‌.. మరొక్కసారి మోడీని మరొక్కమాట అన్నావంటే నీ తాటతీస్తా’ అంటూ పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. దానికి ఫాలోఅప్‌గా కేసీఆర్‌ - పవన్‌కల్యాణ్‌ను మరెన్ని రకాల బూతులు తిట్టాడనే సంగతిని ప్రస్తుతానికి పక్కన పెడితే... మరి మోడీని అదే స్థాయిలో తిట్టిపోస్తున్న ఇతర నాయకుల సంగతి ఏమిటి? ఆ నాయకులకు కూడా తాట తీయడానికి పవన్‌కల్యాణ్‌ సిద్ధంగా ఉన్నాడా అనేది సాధారణంగా సామాన్యులకు కలుగుతున్న సందేహం.

మోడీని తిట్టే విషయానికి వచ్చినప్పుడు తెలంగాణలో కేసీఆర్‌ పోషిస్తున్న పాత్రను అటు సీమాంధ్రలో చిరంజీవి చాలా సమర్థంగా పోషిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతం అంతటా తిరుగుతూ కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తున్న చిరంజీవి.. మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ‘‘మోడీ మతతత్వ వాది, మోడీ గెలిస్తే మైనారిటీలకు రక్షణ లేదు, మోడీ వస్తే అరాచకం రాజ్యమేలుతుందని, మతం పేరుతో దేశానికి పట్టిన ఒక చీడపురుగు మోడీ అని, మోడీ ఒక హిట్లర్‌, నియంత’’ అని తనకు ఏది గుర్తుకు వస్తే ఆ పేరుపెట్టి మెగాస్టార్‌ చిరంజీవి పదేపదే తిట్టిపోస్తున్నారు.

మరి ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్‌ కల్యాణ్‌.. రేపు సీమాంధ్రప్రచారాన్ని షురూ చేయగానే ఇప్పుడు కేసీఆర్‌ మీద విరుచుకుపడుతున్న రీతిలోనే అన్నయ్య చిరంజీవి మీద కూడా విరుచుకుపడతాడా.. దేశానికి కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద తనకు ఉన్న భక్తి ప్రపత్తులను అదేస్థాయిలో ఆ ప్రాంతంలో కూడా చాటుకుంటాడా? అన్నయ్య చిరంజీవికి కూడా తాటతీస్తాననే సేం టూ సేం హెచ్చరికను ఫార్వార్డ్‌ చేస్తాడా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రత్యేకంగా చిరంజీవిని పనిగట్టుకుని తిట్టనవసరం లేదని.. మోడీని ఎవరు తిట్టినా తాను సహించబోనని పవన్‌ అంటుండడాన్ని బట్టి.. ‘తాట తీస్తాననే’ ఆయన తిట్లు యావత్తూ చిరంజీవికి కూడా వర్తిస్తాయని కూడా కొందరు అంటున్నారు.

 

Posted

teliyadu pora ki chaala telusu man.. nuvu peru marchuko man.. ANNI TELUSU ani.. ROFL>>

×
×
  • Create New...