Jump to content

Recommended Posts

Posted

కేసీఆర్ ఎవరిని బెదిరిస్తావు, నా దగ్గర బతికి, పైకి వచ్చావు... నన్నే బెదిరిస్తావా?...పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పిచ్చాత్రికి పంపిస్తా, బాంబులుకే భయపడేలేదని, ఎవడో ఒకడు వస్తే నేను భయపడనని గజ్వేల్ సభలో చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను హెచ్చరించారు. ఇది నీ జాగీరా? నీ తాత సొత్తు అనుకుంటున్నావా.. అంటూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు.

జిల్లాలోని గజ్వేల్‌లో సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ఎన్నికల బహిరంగ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. వేదికపై చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు బాబుపై చెప్పు విసిరారు. దీంతో అతడిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో, ప్రతిగా కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ పేదవాళ్ళకు టీడీపీ ప్రతినిధి ఆర్. కృష్ణయ్యను సీఎంగా ప్రకటిస్తే, తమపై దాడి చేయిస్తావా.. అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఇక నీ ఆటలు సాగనీయమని ఆయన హెచ్చరించారు. కృష్ణయ్య తలచుకుంటే తెలంగాణలో కేసీఆర్ ఉండడని బాబు అన్నారు. గజ్వేల్ టీడీపీ అభ్యర్థి ప్రతాపరెడ్డి తలచుకుంటే కేసీఆర్‌ను పరిగెత్తిస్తారని బాబు అన్నారు.. సభల్లో టీఆర్ఎస్ కార్యకర్తలతో రాళ్ళు, చెప్పులు వేయించడం నీచమైన రాజకీయమని, దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు.

మహబూబ్‌నగర్‌లో కూడా లోకేష్ నాయుడుపై కేసీఆర్ దాడి చేయించాడని, అదిలాబాద్‌లో తమ సభలో తాగుబోతులను పంపించి గొడవ చేయించాడని చంద్రబాబు ఆరోపించారు. రాత్రి నువ్వు తాగి పడుకుంటే, పగలు నీ కార్యకర్తలను తాగించి పంపుతావా? అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పోరాటం పేదవాళ్లకు, దొరలకు మధ్య పోరాటమని, దొరల రాజ్యం పోవాలని బాబు పిలుపునిచ్చారు.

కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, మోదీని దుష్మన్ అని విమర్శిస్తున్నాడని, నన్ను జైలుకు పంపుతావా? ఈ అధికారం నీకు ఎవరిచ్చారని చంద్రబాబు నాయుడు ఘాటుగా ప్రశ్నించారు. కేసీఆర్ జాగ్రత్తగా ఉందాలని, ఫామ్ హౌస్ నుండి బయటకు రావలేవని బాబు హెచ్చరించారు. పిరికితనంతో దాడులు చేయిస్తున్నాడని ఆయన విమర్శించారు. రేపు ఢిల్లీలో మోదీ ప్రభుత్వం వస్తుందని, ఇక్కడ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు వెల్లడించారు. అధికార వ్యామోహంతో కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఓట్లు వేసిన తర్వాత ప్రజలనే కేసీఆర్ మోసం చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Posted

Masth annadu.. Except Krishnaiah dialogue

Posted

Masth annadu.. Except Krishnaiah dialogue

krishnaiah niii emanna ante bc vote okkati kuda padadu ani telisey kcr okka mata kuda anta ledu 1w2z8.gif

Posted

roflamooooooooooo 1w2z8.gif

రాత్రి నువ్వు తాగి పడుకుంటే, పగలు నీ కార్యకర్తలను తాగించి పంపుతావా? 

×
×
  • Create New...