Jump to content

Recommended Posts

Posted
ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయా అని అందరూ రకరకాల ఊహాగానాలు చేస్తుంటే… లగడపాటి మాత్రం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో స్పష్టంగా తేల్చి చెప్పేస్తున్నాడు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ భవిష్యత్తును అంచనా వేసి అతడు చెప్పే జోస్యం నిజమవుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎన్నికల ఫలితాల గురించి అతడు చెబుతోన్న విషయాల పట్ల అందరికీ ఆసక్తి పెరిగింది.
ఇంటెలిజెన్స్ సర్వేల పేరిట కొందరు వైఎస్సార్సీపీకి భారీగా సీట్లు వస్తాయని… రాతలు మార్చి తలరాతలు మార్చే ప్రయత్నం చేసినవన్నీ లగడపాటి చెప్పిన దాన్ని బట్టి చూస్తే అపద్ధం అనిపిస్తోంది. సీమాంధ్రలో తెలుగుదేశానిదే హవా అంటున్నాడు లగడపాటి. కేవలం 70 శాతం ఓటింగు నమోదైతే చాలు  టీడీపీ-బీజేపీల కూటమి విజయ కేతనం ఎగురవేస్తుందట.  ఒకవేళ పోలింగ్ శాతం ఇంకా పెరిగితే ఆ కూటమికే మరిన్ని సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు.   ఇందులో ఎలాంటి మార్పూ ఉండదు, కావాలంటే సీమాంధ్రలో పోలింగ్ పూర్తయ్యాక ఎవరికెన్ని సీట్లు వస్తాయో చెబుతా అని కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు లగడపాటి. కేంద్రంలో ఎన్డీయే కూటమి గద్దెనెక్కుతుందట. తెలంగాణలో టీఆర్ఎస్ దే అధికారమట. తనకు జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గానీ, సీమాంధ్రలో గాని అధికారంలోకి రాకపోవడం బాధాకరమన్నారు. మొత్తానికి లగడపాటి సర్వే రిపోర్టు పెద్ద సంచలనమే సృష్టించింది. ఇవాళ ఎక్కడ చూసినా అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మరి అయ్యగారి రిపోర్టు నిజమవుతుందో రివర్సవుతుందో చూడాలి!
 
ఇంతవరకు ఇటీవల నా పేరు చెప్పి కొన్ని సర్వేలు వస్తున్నాయని, వాటితో నాకు సంబంధం లేదని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం వరకు తెలంగాణది ఫుల్ క్లారిటీ వచ్చిందని, పన్నెండు తర్వాత వివరాలు వెల్లడిస్తా అన్నారు. అలాగే సీమాంధ్రలో ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్నారు. అభివృద్ధి ఆలోచన, సమైక్యం కోసం తెలుగుదేశం నేతలు పోరాడిన తీరు ఆ పార్టీ మైలేజిని పెంచాయన్నారు. ఇంకా ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయన్నారు.
Posted

bollibabu.gif


1w2z8.gif

vijayamma ki.......vizg vaaasulu asss choopisthaaru.......lol

Posted

Agreed tdp tsunmai ni evadu apaledu :)

×
×
  • Create New...