Jump to content

Recommended Posts

Posted

రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయిస్తే సహించేదిలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు హైదరాబాదులో కోఠిలోని కుటుంబసంక్షేమశాఖ కమిషనర్, డీహెచ్‌లను కలసి వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతున్న డీఎంఈ, డీహెచ్, వైద్యవిధానపరిషత్, కుటుంబసంక్షేమశాఖ కార్యాలయాలను విభజించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసిందని అన్నారు. 

బంజారాహిల్స్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు భవనాల్లోకి తెలంగాణ కార్యాలయాలను తరలించేందుకు సీమాంధ్ర అధికారులు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి ఉంది. కానీ, వారిని ప్రస్తుతం కార్యాలయాల్లో కొనసాగిస్తూ, తెలంగాణ కార్యాలయాలను మాత్రం అద్దె భవనాల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాగే కొనసాగితే, మరో ఉద్యమం చెలరేగుతుందని వారు హెచ్చరించారు.

×
×
  • Create New...