Jump to content

Gas Gadi Comedy.. Congress, Tdp Kummakku Anta


Recommended Posts

Posted

కాంగ్రెస్‌ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయని.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి వారిద్దరూ అనైతిక బంధాలకు పాల్పడుతున్నారని.. జగన్‌ మరియు వైకాపా నాయకులు తొలినుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ సర్కారు కూలిపోకుండా.. చంద్రబాబునాయుడు స్వయంగా తన పార్టీ ద్వారా సహకారం అందించినప్పటినుంచి కూడా.. వారిద్దరి కుమ్మక్కు రాజకీయాలకు అనేకానేక నిదర్శనాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా పురపాలక ఎన్నికల ఫలితాల్లో కూడా ఈ రెండు పార్టీల కుమ్మక్కు వ్యవహారం కనిపిస్తున్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

స్థానిక పురపాలక ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపించడం వల్లనే ఇలాంటి ఫలితాలు వచ్చాయనేది కొందరి విశ్లేషణగా ఉంది. కాంగ్రెస్‌కు చాలా చోట్ల అసలు బోణీ లేకపోవడం.. అలాంటి ప్రాంతాల్లో తెలుగుదేశం తలెగరేయడం ఇందుకు సంకేతంగా చెబుతున్నారు.

ప్రత్యేకించి.. ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లాల్లో ఫలితాల తర్వాత కూడా.. ఇలాంటి కుమ్మక్కు రాజకీయాలను వారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆనం సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని చాటుకుంది. అయితే ఆత్మకూరులో 23కు గాను వారికి దక్కింది 8 మాత్రమే. తెలుగుదేశానికి 4 సీట్లు వచ్చాయి. అవి కలిసి వస్తే అధికారం గ్యారంటీ. ఇక్కడ తెదేపా ఆసరా తీసుకుని, సూళ్లూరుపేటలో వారికి దన్నుగా నిలవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. అక్కడ వైకాపా కంటె తెదేపాకు తక్కువ వచ్చాయి. అయితే రెండు కాంగ్రెస్‌ సీట్లు తమకు మద్దతుగా నిలిస్తే.. మరొకరిని బేరమాడుకుని అధికారంలోకి రావచ్చునని తెదేపా ఆలోచనగా ఉంది. అచ్చంగా నెల్లూరు జిల్లాలో మాత్రం.. ఫలితాల అనంతరం కూడా తెదేపా` కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు.

×
×
  • Create New...