Jump to content

Recommended Posts

Posted

దశభుజ పంచముఖ నరసిమ్హుడు

భయంకర స్వరూపుడైన ఈ స్వామి ప్రళయకాల అగ్నివంటి వాడు. కపాలమాల ధరించి,సర్పాన్ని జంధ్యంగా ధర్శిస్తాడు. పంచముఖాలతో , చంద్రకళాధారుడై ,నల్లని శరీరరంగుతో ఒక్కొక్క ముఖంలో మూడేసి నేత్రాలతో గోచరిస్తాడు. పది చేతులలో ఒక్కొక్క చెతిలో అంకుశం,గద, తామర ,శంఖం , విల్లు, ఉల్లకం, చక్రం,కత్తి, మూలం, బాణాలను ఆయుధాలుగా ధరించి దర్శనమిస్తాడు.

ఇలా శ్రీమన్నారాయణుని పూర్ణావతారం శ్రీనృసిమ్హావతారం. ఈ స్వామి తత్త్వాన్ని అర్ధం చేసుకునేందుకు ఎంతో విశ్లేషణ అవసరం. ఈ స్వామి దేహము అంతా నరాకృతి. ముఖం సిమ్హాకృతి.మాయాకారమైన జగత్తు,మాయాతీతమైన పరబ్రహ్మతత్వం - ఈ రెండిటినీ తెలియచేసేది ఈ అవతారం. సంధ్యా సమయంలో ఆవిర్భవించాడు కనుక నృహరి . మృత్యువును జయించుదామని అనేక షరతులు పెట్టిన హిరణ్యకశిపుని తెలివిని తల్లక్రిందులు చేస్తూ,ఉహాతీతమైన ప్రణాళికతో అంతం చేసిన ఆయన నరకేసరి. ప్రహ్లాదుని రక్షించడం, హిరణ్యకశిపుని శిక్షిస్తూ,ఎకకాలంలో రక్షణను,శిక్షణను చేసిన అవతారం ఈ విష్ణావతారం.

 

10274203_638127119570023_315726436760941

Posted

Lord Narasimha demonstrates God's willingness and ability to come to the aid of his devotees, no matter how difficult or impossible the circumstances may appear to be.
Prahlad's devotion indicates that pure devotion is not one of birthright but of character. Prahlad, although born an asura, demonstrated the greatest bhakti to God, and endured much, without losing faith.
Narasimha is known by the epithet "Mriga-Sharira" in Sanskrit which translates to Animal-Man. From a philosophical perspective. Narasimha is the very icon of Vaishnavism, where jnana (knowledge) and Bhakti are important .

There are several forms of Narasimha, but nine main ones collectively known as Navanarasimha:

Ugra-narasimha
Kruddha-narasimha
Vira-narasimha
Vilamba-narasimha
Kopa-narasimha
Yoga-narasimha
Aghora-narasimha
Sudarsana-narasimha
Laksmi-narasima

 

1907316_638251666224235_7686801928785166

 

Posted

శ్రీ మత్ పయోనిధి నికేతన చక్రపాణే
భోగీంద్ర భోగ మణి రంజిత పుణ్యమూర్తే
యోగీశశాశ్వత శరణ్య భవాబ్ది పోత
లక్ష్మీన్నరసీంహ మమ దేహి కరావలంబం

అభయ స్వరూపుడైన లక్ష్మీనృసీంహ స్వామిని సంభోదిస్తూ ఆదిశంకరులు రచించిన స్తుతి ఇది.

" శ్రీమంతమైన క్షీరసాగరాన్ని నివాసంగా చేసుకొన్న చక్రవాసా! సర్పరాజైన ఆదిశేషుని పడగమణుల కాంతులతో ప్రకాశించే పుణ్యమూర్తి! యోగీశ్వరులచే శాశ్వతంగా శరణు వేడబడే స్వామి. సంసార సముద్రం నుండి దాటించే నావ వంటివాడా! లక్ష్మీ నృసిమ్హ నాకు నీ చేయుత నిమ్ము.

 

10289852_638215306227871_361563320452220

 

Posted

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 ||
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 2 ||
ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 3 ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 4 ||
సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 5 ||
ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 6 ||
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 7 ||
వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 8 ||
య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || 9 ||

 

10345775_638184289564306_739361452280106

Posted

లక్ష్మీ నరసింహ పంచరత్నమ్

త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్నరహరిపూజాం కురు సతతం
ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే |

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౧ ||

శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చే-
ద్దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్ |

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౨ ||

ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః
గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్ |

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౩ ||

స్రక్చందనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే
గంధఫలీసదృశా నను తేమీ భోగానంతరదుఃఖకృతః స్యుః |

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౪ ||

తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం
స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి|

చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందమ్ || ౫ ||

 

10245420_638157676233634_635179970081289

Posted

 

శ్రీ మత్ పయోనిధి నికేతన చక్రపాణే
భోగీంద్ర భోగ మణి రంజిత పుణ్యమూర్తే
యోగీశశాశ్వత శరణ్య భవాబ్ది పోత
లక్ష్మీన్నరసీంహ మమ దేహి కరావలంబం

అభయ స్వరూపుడైన లక్ష్మీనృసీంహ స్వామిని సంభోదిస్తూ ఆదిశంకరులు రచించిన స్తుతి ఇది.

" శ్రీమంతమైన క్షీరసాగరాన్ని నివాసంగా చేసుకొన్న చక్రవాసా! సర్పరాజైన ఆదిశేషుని పడగమణుల కాంతులతో ప్రకాశించే పుణ్యమూర్తి! యోగీశ్వరులచే శాశ్వతంగా శరణు వేడబడే స్వామి. సంసార సముద్రం నుండి దాటించే నావ వంటివాడా! లక్ష్మీ నృసిమ్హ నాకు నీ చేయుత నిమ్ము.

 

10289852_638215306227871_361563320452220

 

 

GP  PK.

×
×
  • Create New...