timmy Posted May 14, 2014 Report Posted May 14, 2014 తెలంగాణ ఆర్టీసీ అప్పు 2,096 కోట్లు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ విభజన ప్రక్రియను ఆర్టీసీ అధికారులు పూర్తి చేశారు. అప్పులు, ఆస్తుల పంపకాలు పూర్తి చేశారు. ఈ మేరకు తెలంగాణను మూడు జోన్లుగా విభజించిన అధికారులు, ఆ రాష్ట్రానికి 94 డిపోలను, 9,064 బస్సులను, 63,479 మంది సిబ్బందిని కేటాయించారు. తెలంగాణ ఆర్టీసీ అప్పుగా 2,096 కోట్ల రూపాయలను నిర్థారించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అప్పు 2,631 కోట్లు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,352 బస్సులను, 70,231 మంది సిబ్బందిని, 122 డిపోలను ఆంధ్రాకు కేటాయించారు. కాగా ఆర్టీసీ అప్పులో 2,631 కోట్ల రూపాయల అప్పును ఆంధ్రా ఆర్టీసీకి మిగిల్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్టీసీని నాలుగు జోన్లుగా విభజించారు.
Recommended Posts