Tadika Posted May 18, 2014 Author Report Posted May 18, 2014 ఢిల్లీలోని ఒకానొక ఇల్లు.. సుందర్‌వర్మ(50) అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికొచ్చారు. తన గదిలోకి వెళ్లారు. ఆయన కొడుకు, ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతీక్ వర్మ(20) బెరుకుగా.. తండ్రి గదిలోకి అడుగుపెట్టాడు. ‘నాన్నా.. నేనో విషయం గురించి మీతో మాట్లాడాలి.. తలుపు దగ్గరకు వేయండి. అమ్మకు ఈ విషయం తెలియకూడదు..’సుందర్‌వర్మ డౌట్‌గా చూశారు. ఇంతలో ప్రతీక్ మళ్లీ అందుకున్నాడు.. ‘నాన్నా.. మీకు గుర్తుందా.. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది’ ‘ఆఆ.. ఆ అమ్మాయేనా’ అని సుందర్ వర్మ అన్నారు. ‘అవును.. నాన్నా.. చిన్న తప్పు జరిగిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి’ అని బాంబు పేల్చాడు ప్రతీక్. ఆ తర్వాత సుందర్‌వర్మ మనిషి మనిషిలా లేడు. ఫ్రస్ట్రేషన్‌తో రేసుగుర్రంలోని కిల్‌బిల్ పాండేలా మారిపోయారు. ఫొటోల్లో చూశారుగా.. ప్రతీక్‌ను ఎలా కుమ్మారో.. మామూలుగా కొట్టలేదు.. చివరికి ఓ బాటిల్ పట్టుకుని ప్రతీక్ తల మీద బద్దలు కొడతారనగా.. అతడు అసలు విషయాన్ని బయటపెట్టేశాడు. అదేంటంటే.. ఇదంతా కేవలం జోక్ అని..!! ఢిల్లీకి చెందిన ప్రతీక్ వర్మ.. తండ్రితో చిన్న హాస్యమాడి.. దాన్ని వీడియో తీసి.. యూట్యూబ్‌లోకి ఎక్కించాలనుకున్నాడు. తండ్రి రూంలో రహస్యంగా కెమెరా సెట్ చేసి.. దీన్ని చిత్రీకరించాలనుకున్నాడు. అయితే.. అది కాస్తా వికటించి.. ఇదిగో ఇలా చావు దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తిన్నా.. ధైర్యం కోల్పోక.. ఆ వీడియోను ఇటీవల యూట్యూబ్‌లో పెట్టాడు. ఇప్పుడది యూట్యూబ్‌లో పెద్ద హిట్.
Nellore Pedda reddy Posted July 11, 2014 Report Posted July 11, 2014 Veedevado 02 laaga unnade Lol.1q
Recommended Posts