Jump to content

Recommended Posts

Posted

ప్రేమ వేరు .....వలపు వేరు ....

ఈ తేడా తెలియకే చాలా మంది అమ్మాయిలూ ప్రియుడు చూపించే వలపుని ప్రేమ అనుకుని, అతనిలో తండ్రి బాధ్యతని, తల్లి వాత్సల్యాన్ని వెతుక్కుని అది కనిపించక నిరాశ పడుతూ అతనికి నా పై ప్రేమ లేదు అని నిందిస్తుంటారు ....

తల్లి ,తండ్రి, తోబుట్టువులు చూపించే ప్రేమలో బాద్యత , వాత్సల్యం , అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కూడుకుని ఉంటాయి ...

భర్త , ప్రియుడు విషయంలో వలపు , శృంగారం ప్రధానంగా ఉంటాయి ...వలపు లో నుంచి పుట్టేన నాది అన్న భావం స్వార్ధంతో ముడి పడి ఉంటుంది ....నాదీ అన్న భావం లో నుంచి పుట్టే అలవాటు అయిన తనం , బాద్యత, ప్రేమ అన్న భావం ఉంటుంది తప్ప నిజమైన ప్రేమ ఉండదేమో అక్కడ ....

 

 

 

Posted

bl@st                                                  bl@st                                                      bl@st

Posted

ప్రేమించి మోసం చేసారు అని మనం తరుచు వింటుంటాం ..
....................ఇది తప్పు ......

ప్రేమించినట్టు నటించి మోసం చేసారు అనాలి ...

'' ప్రేమించడం తెలిసిన వారెవ్వరూ మోసం చెయ్యలేరు ''...

శరీరం కోసమో , డబ్బు కోసమో ప్రేమ నటించే వాళ్ళు అవసరం తీరగానే 
కారణాలు వెతుక్కుంటారు వదిలించుకోవడానికి ..

ఒక మనిషిని ప్రేమించడంలో మనసుపొందే ఆనందం లోతు తెలిసిన వాళ్ళెవ్వరూ
మోసం చెయ్యడం అర్ధంతరంగా వదిలి వెళ్ళడం చెయ్యరు ..

Posted

నిర్జన ప్రదేశాన నిలకడ లేని
అంతరంగ తరంగ తలపులతో నీవు,
కలల కడలిని కళ్ళలో నింపుకొని నేను.

నిరంతర వేదనతో నిసీది కౌగిలిలో నీవు.
అంతులేని ఆవేదనతో నిను చూస్తూ నేను.

జంట తరువుల చెంత మనం గడిపిన క్షణాలను తలపోస్తూ నీవు.
ఒంటరినై తనువంతా అశ్రుకణమై నేను.

భిరువై బతుకు కుదవ పెట్తున్న వెతవై నీవు
చేరువై బతుకు పండించుకోలేని స్తితిలో నేను.

ఓడిపోయి, ఒంటరిగా విలపిస్తూ నీవు,
నిను వీడిపోయి, ఆత్మనై అలమటిస్తూ నేను.

ప్రేమ పిరికిది కారాదనీ, ప్రేమకి కులం అడ్డు కాదనీ..
గగనమంత కళ్ళతో ప్రేమికులకు సందేశమిస్తూ నేనూ.....

 
Posted


నిర్జన ప్రదేశాన నిలకడ లేని
అంతరంగ తరంగ తలపులతో నీవు,
కలల కడలిని కళ్ళలో నింపుకొని నేను.

నిరంతర వేదనతో నిసీది కౌగిలిలో నీవు.
అంతులేని ఆవేదనతో నిను చూస్తూ నేను.

జంట తరువుల చెంత మనం గడిపిన క్షణాలను తలపోస్తూ నీవు.
ఒంటరినై తనువంతా అశ్రుకణమై నేను.

భిరువై బతుకు కుదవ పెట్తున్న వెతవై నీవు
చేరువై బతుకు పండించుకోలేని స్తితిలో నేను.

ఓడిపోయి, ఒంటరిగా విలపిస్తూ నీవు,
నిను వీడిపోయి, ఆత్మనై అలమటిస్తూ నేను.

ప్రేమ పిరికిది కారాదనీ, ప్రేమకి కులం అడ్డు కాదనీ..
గగనమంత కళ్ళతో ప్రేమికులకు సందేశమిస్తూ నేనూ.....

Super..
×
×
  • Create New...