Ithaka Posted May 22, 2014 Report Posted May 22, 2014 ఒకే టెలికం సర్కిల్ కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్సాక్షి, హైదరాబాద్: అపాయింటెడ్ డే అయిన జూన్ 2న రాష్ట్రం విడిపోయినా... ఒక అంశంలో మాత్రం ఒకటిగానే ఉండిపోనుంది. టెలికం విభాగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఒకే సర్కిల్ కింద కొనసాగనున్నాయి. దీంతో ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రంలోకి వచ్చినా.. సెల్‌ఫోన్లకు రోమింగ్ మోత ఉండదు. ఎప్పటి మాదిరిగానే సెల్‌ఫోన్ వినియోగదారులు సాధారణ చార్జీలపైనే వినియోగించుకోవచ్�� �ు. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార పనులపై తిరిగే ఇరు ప్రాంతాలవారికి రోమింగ్ బెడద ఉండదు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తమ మాతృరాష్ట్రాల నుంచి విడిపోయినప్పుడు టెలికం సర్కిళ్లను విభజించలేదు.ఇప్పటికీ అవి వాటి మాతృరాష్ట్రాలతో ఒకే సర్కిల్‌లో కొనసాగుతున్నాయి. ఇదే తరహాలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోనున్నప్పటి�� �ీ టెలికం సర్కిల్ ఒకటిగానే ఉండనుంది. ముఖ్యంగా ట్రాయ్ నిబంధనలతో పాటు టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చే లెసైన్స్ కాలపరిమితి తదితర అంశాల నేపథ్యంలో టెలికం సర్కిళ్లను విభజించడానికి అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఆ లెసైన్సుల కాలపరిమితి 30 నుంచి 40 ఏళ్లవరకు ఉండటంతో.. ఆ తర్వాతే సర్కిళ్ల విభజన జరిగే అవకాశం ఉంది. దానికితోడు ట్రాయ్ నిబంధనల ప్రకారం కూడా 2024 వరకు జరిగే రాష్ట్ర విభజనలకు రోమింగ్ వర్తించదు. అసలు ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి రోమింగ్ చార్జీలను రద్దు చేసేందుకు ట్రాయ్ ప్రయత్నిస్తోంది.
Recommended Posts