Jump to content

Recommended Posts

Posted
హైదరాబాద్ రవాణా చరిత్రలో సరికొత్త శకం...
METRO22.jpg

మెట్రో రైలు(ఫైల్ ఫోటో)

హైదరాబాద్(ఇఎన్ఎస్) : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం తొలి మెట్రో రైలు మూడు బోగీలు ఇక్కడి ఉప్పల్ డిపోకు చేరుకున్నాయి. కొరియాలోని ఫ్యాక్టరీలో అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత వాటిని ఏప్రిల్ 25న భారత్‌కు పంపించారు. రెండు వారాలపాటు సముద్ర మార్గంలో ప్రయాణించిన మెట్రో రైలు బోగీలు మే తొమ్మిదో తేదీన చెన్నయ్ ఓడరేవుకు చేరుకున్నాయి. చెన్నయ్ ఓడరేవులో కస్టమ్స్ అధికారుల అనుమతులు పొందిన తర్వాత ఆ బోగీలు చెన్నయ్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకున్నాయి. మే 21న హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్ఎంఆర్) ఉప్పల్ డిపోకు వచ్చాయి.

 

నిర్దేశిత కాలవ్యవధిలో తొలి రైలును విజయవంతంగా హైదరాబాద్‌కు చేర్చిన ఎల్ అండ్ టీ మెట్రో రైలు కంపెనీని(హైదరాబాద� ��) హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి అభినందించారు. "ఇది హైదరాబాదీలందరికీ గర్వకారణం. హైదరాబాద్ రవాణ చరిత్రలో సరికొత్త శకానికి ఇది నాంది పలుకుతోంది" అని ఆయన అన్నారు. 

 

ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో రైలు(హైదరాబాద్) లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరక్టర్ వి.బి.గాడ్గిల్ మాట్లాడుతూ "ఇది హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఒక మైలు రాయి లాంటిది. హైదరాబాద్‌కు రైళ్ళను తేవడంలో మేం కాలానికన్నా ముందున్నాం అనడానికి ఇది ఒక సంకేతం" అని తెలిపారు.
 

 

  • 3 weeks later...
Posted

Design marchevaraku metro ni addukuntaam anna KCR.

em chestundu ippudu.... gallery_731_18_29072.gif

Posted

Design marchevaraku metro ni addukuntaam anna KCR.

 

 

hrao.gif

×
×
  • Create New...