Jump to content

Bhadrachalam Charithra - Feed Back Needed


Recommended Posts

Posted

ఏమిటీ భద్రాచలం చరిత్ర ?
1953 అక్టోబర్ 1న ఖమ్మం మెట్టు జిల్లా అవతరించింది. దీంట్లో ఖమ్మం మెట్టు, మధిర, ఇల్లందు, పాల్వంచ,బూర్గంపాడు అనే తాలూకాలుండేవి. 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసారు .అప్పుడున్న హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసారు.ఔరంగాబాద్,బీడ్,నాందేడ్, పర్భాని ,ఉస్మానాబాద్ అనే 5 జిల్లాలను మహరాష్ట్ర లో కలిపారు.బీదర్,గుల్బర్గా,రాయచూర్ అనే 3 జిల్లాలను కర్ణాటక లో కలిపారు."మిగిలిన 8 జిల్లాల తెలంగాణా"ను అప్పటి ఆంధ్రరాష్ట్రంతో కలిపారు. అందులో భద్రాచలం లేదు. భద్రాచలం డివిజన్ 1959 దాకా తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా వుండింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం 1959లో పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం జిల్లాను విస్తరించారు. అప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం, నూగూరు అనే రెండు తాలూకాలను ఖమ్మం జిల్లాలో కలిపారు. కూనవరం,వరరామ చంద్రాపురం,చింతూరు,దుమ్ముగూడెం,చర్ల,వెంకటాపురం,వాజేడు అనే 8 మండలాలకి ఇప్పుడు డివిజన్ కేంద్రం భద్రాచలం1959లో ఈ ప్రాంతం తెలంగాణలో విలీనమైనా 1972 వరకు ముల్కీ హక్కుపొందలేకపోయారు. 

కోయదొరలు, కొండరెడ్లు, గొత్తికోయలు, శబరులు, గోండులు, వాల్మీకులు, దొమ్మరులు, కాటికాపరులు,చెంచులు, పరికముగ్గులవాళ్ళు, పిచ్చుకగుంట్లు, బుడబుక్కలు, ప్రధానులు, పెద్దమ్మల వాళ్ళు, తోటీలు, పలు గిరిజన తెగలకు చెందిన వారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తారు. 

ఒడిషా,చత్తిస్ ఘఢ్ రాష్ట్రాల సరిహద్దులు చాలా దగ్గరగా ఉండడం వల్ల అక్కడి చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు వైద్య మరియు ఇతర సేవల కోసం ,ఆలయ సందర్శనార్ధం ఇక్కడికి వస్తుంటారు.భద్రాచలం విద్యార్ధులు కాకతీయ యూనివర్సిటికి వెళితే భాషలోని కోస్తాదనం చూసి మీరు ఆంధ్రా వాళ్ళు కదా అంటారు.కోస్తా జిల్లాలకి వెళితే మీరు ఖమ్మం జిల్లా వాళ్ళు కదా అంటే తెలంగాణా వాళ్ళేగా అంటారు.అదీ పరిస్థితి.

భద్రాచలం పై కేసీయార్ ఒకనాటి వివరణ

"1956 నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు.గీ భద్రాచలం ముచ్చట నాకు ముందే దెల్సు. మా జయశంకర్ గారి ని ఇది వరకే అడిగిన... సార్, ఏంది గీ భద్రాచలం ముచ్చట ..దీని కత ఏందీ..కార్ఖానా ఏందీ అని....దానికి ఆయన....అంటే ..ప్చ్..అది..ఆయన ...ప్రొపెసరు కదా.. యెంటనే ..చాలా చక్కగా...గిట్లన్నడు....1956 కి ముందు రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్..two independent states గీ రెండూ.. గీ తెలంగాణా అప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రం..మాగ్గావల్సింది గా ప్రత్యేక రాష్ట్రమే..గదే రాష్ట్రం గట్లనే గావాలే ఇప్పుడు... అంతకు మించి ఒక్క ఇంచ్ మాకక్కరలేదు ఆంధ్రోళ్ళ నుండి..మేము కూడా అప్పటి మా రాష్ట్రం లో ఇంచ్ కూడా వదులుకోం..ఇక ఆ రాష్ట్రంల గీ భద్రాచలం ఉంటద, ఊడుతద..గిదంత మాకు దెల్వది."

 

10372796_246518902207590_628249449546203

 

 

 

 

 

 

×
×
  • Create New...