Jump to content

Kcr To Sign Five Files As Cm On First Day - Tv9


Recommended Posts

Posted

బాధ్యతల్లో చేరిననాడు ఏదో ఒక ఫైలుపై సంతకం చేయడం పరిపాటి. చిన్న ఉద్యోగి సైతం తీర్చుకోవాలనుకున�� � ముచ్చట ఇది. మరి అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో, ఈ తంతుకు ఉండే ప్రాధాన్యం చెప్పాల్సిన పని లేదు. కానీ, తెలంగాణలో తొలి ప్రభుత్వానికి సారథ్యం వహించబోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం.. ఆ మురిపెం తీర్చుకోవ డానికి పక్షం రోజులు ఆగాల్సిందే. జూన్ 2 అపాయింటెడ్ డే తరువాత కూడా 'ఉమ్మడి' రాష్ట్ర చట్టాలు అమల్లో ఉండడమే దీనికి కారణం. కొత్త రాష్ట్రంలో ఏ ఫైలు ముందుకు కదలాలి అన్నా ముందుగా అమల్లో ఉన్న చట్టాలను మార్చుకోవాల్సింద�� �. దీంతో కేసీఆర్ సర్కారుకు చట్టాల చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.
రాష్ట్ర ఆవిర్భావ దినం నాడే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ వెంటనే తెలంగాణ తొలి ప్రభుత్వం అమల్లోకి వచ్చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చేందుకు ఆయన ముందుకు వచ్చినా, చట్టాల్లో దాగిన సాంకేతిక సమస్యలు ఆయన చేతిని వెనక్కి లాగేయనున్నాయి. దాంతో హామీల ఫైలునే కాదు, కనీసం లాంఛనంగా అయినా ఆయన ఫైలుపై సంతకం చేసే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ పేరిట చెలామణిలో ఉన్న చట్టాలను తెలంగాణ ప్రభుత్వం పేరిట మార్చితేనే కేసీఆర్ పనిలోకి దిగడానికి వీలు ఉంటుంది. అప్పటిదాకా..ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర, సబార్డినేట్ సర్వీసు రూల్స్, పెన్షన్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ, అప్పీల్) నిబంధనలు, సాధారణ పరిపాలనా శాఖకు చెందిన ప్రవర్తనా నియమావళి, అసైన్‌మెంట్ నిబంధ నలు, సర్వీసు నిబంధన లు, ఆంధ్రప్రదేశ్ ఖనిజ రాయితీ నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ ఖనిజ డిపో సేవల నిబంధనలు.. ఇలా ప్రతి ఒక్క అంశానికి సం బంధించిన ఫైలుకూ విముక్తి లేనట్టే. ఇంజనీరింగ్ విభాగాలైన రోడ్లు-భవనాల శాఖ, పంచాయతీ రాజ్, మునిసిపల్ వంటి శాఖల పరిధిలో చేసిన, చేయనున్న పనులు, వాటికి చెల్లింపులూ అటకెక్కాల్సిందే. పోనీ అపాయింటెడ్ డే నాటికి కొత్త చట్టాలు తెచ్చుకుందామా అంటే, అంత సమయం లేదు. ఈ చిక్కును తప్పించాలంటే, ముందుగా ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టాలను తెలంగాణ పేరిట మార్చుకోవాలి. అలా జరగాలంటే ప్రతి ఫైలును న్యాయ శాఖ పరిశీలనకు పంపి ఆమోదం పొందాలి. దీనికి ఎంత లేదన్నా 15 రోజులు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో అధికారిక లావా దేవీలు జరపడానికి వీలు పడదు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుతో అమలులో ఉన్న చట్టాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఫైళ్ల ను ఆమోదించటం సాధ్యంకాదు. అదే సమయంలో ఎలాంటి చట్టం, నిబంధనలు లేకుండా నిర్ణయాలు తీసుకోవటమూ కుదరదు.ఉద్యోగుల విషయం మొదలుకొని ఎలాంటి పని చేపట్టాలన్నా, కొత్త చట్టాలు అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది'' అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ చట్టాలను యథా విధిగా తెలంగాణ రాష్ట్రం వర్తింపజేసుకున్న�� �, రాబోయే రోజుల్లో తలెత్తే అవసరాలకు అనుగుణంగా నూతన చట్టాలను తెచ్చుకొనే వెసులుబాటు ఉంటుందని తెలిపాయి. అయితే, కొన్ని చట్టాల్లో మార్పులకు కేంద్రం అనుమతి కూడా పొందాల్సి ఉంటుందని చెబుతున్నారు.

×
×
  • Create New...