Jump to content

Media Hadavidi Valla ..rules Thungalo Tokkutunnaru


Recommended Posts

Posted

తొలి సంతకం...ఘోర పరాభవం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తన తొలి సంతకాన్ని తెలంగాణ ప్రభుత్వ అధికార ‘రాజముద్ర’ ఫైలుపై చేశారు. అది ఇప్పుడు బెడిసికొట్టింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయనకు అవమానం జరిగింది. సదరు ముద్ర రాజ్యాంగ విరుద్ధమంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. భారతీయ రాష్ట్ర ఎంబ్లమ్ చట్టం 2005 ప్రకారం...తెలంగాణ రాష్ట్ర రాజముద్ర అంతా తప్పుతడకగా వుందంటూ ఆరోపిస్తున్నారు హర్యానాకు చెందిన సామాజిక వేత్త నరేష్ కడ్యాన్. ‘సత్యమేవ జయతే’ అన్న శాసనాన్ని అశోకుడి మూడు సింహాలు గుర్తు కింది భాగంలో పొందుపర్చలేదంటూ ఆయన సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సదరు రాజముద్రలో అశోకుడి మూడు సింహాల గుర్తు పైనుంటే...సత్యమేవ జయతే శాసనం ఎక్కడో కింద భాగాన వుందన్నారు. దీన్ని వెంటనే సరి చేయాలంటూ ఆయన కేంద్ర హోంశాఖను కోరారు. అయితే...ఫిర్యాదును స్వీకరించిన హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించే పనిలో పడినట్టు సమాచారం. పోలీసులు, మిలటరీ రంగాలు ఇలాంటి తప్పులతడక ముద్రలను ఏర్పాటు చేసుకుంటున్నారని దేశవ్యాప్తంగా ఆరోపణలు రావడంతో 2005వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం సదరు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది తెలియని తెలంగాణ ప్రభుత్వాధికారులు కూడా అదే తప్పును రిపీట్ చేశారు.

 

×
×
  • Create New...