Jump to content

Recommended Posts

Posted

మన రాష్ట్రం.. మన సినిమా


నగర వేదికపై మరో చిత్రోత్సవం
వెండితెరపై తెలంగాణ సంబురం!
చిత్రోత్సవాల్లో షార్ట్‌ఫిలిం కాంపిటీషన్
జూలై మొదటివారంలో ప్రారంభం?
తెలంగాణ సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ సారథ్యంలో...

ఇన్నాళ్లూ మండే గుండెల ఆవేశంతో రగిలిపోయిన యువత వెనకబడ్డ రంగాల్లో పరుగులు తీయాల్సిన రోజులొచ్చాయ్. అన్ని రంగాల్లోనూ పోటెత్తుతున్న యువజనోత్సాహం మత్తడి దుంకిన ఉద్యమ కాలం గుండా ఇప్పుడు అవకాశాల బాట పడుతోంది. తెలంగాణ వెనుకబడిన అన్ని రంగాల్లోకీ బాగా వెనుకబడిన సినిమా రంగం ముందడుగేసింది. తెలంగాణ కళాకారులకు నిలువనీడ దొరకడం కష్టమైన తెలుగు సినిమా ప్రపంచంలో ఇప్పుడు ప్రోత్సహించే గళాలు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. 24 ఫ్రేముల సినిమా కళలో అన్ని ఫ్రేముల్లోనూ తెలంగాణ కనిపించాలి, వినిపించాలి. అనిపించాలని తెలంగాణ సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ సంకల్పించి నగరంలో తెలంగాణ చిత్రోత్సవాలకు తెరతీస్తోంది!


ఒకే ఒక్క ఛాన్స్! అంటూ ఆంధ్రా స్టూడియోల చుట్టూ చెక్కర్లు కొట్టే బాధలేకుండా, ఆంధ్రా ప్రొడక్షన్ హౌస్‌లలో మీ భాష వినలేమనే ఛీత్కారాలు మరిచిపోయే రోజులొచ్చాయ్. పనికిరారనే మాటే వినకుండా మనవాళ్లని ప్రోత్సహిద్దామని తెలంగాణ సినిమా జైబోలో తెలంగాణ అంటూ జూలై మొదటి వారంలో నగరంలో తెలంగాణ సినిమా సంబురం నిర్వహించబోతోంది. వెండితెరపై కనిపించాలని, దర్శకత్వ శాఖలో అసిస్టెంట్‌గా చేరాలని, నా కథ వినండి, పాడే అవకాశం ఇవ్వండంటూ సీమాంధ్ర నిర్మాతలు, దర్శకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులు మనకొద్దు. మన తెలంగాణ, మన సినిమా, మన జీవితం, మన సంస్కతి, మన భాషతో మనమే సినిమాలు తీద్దామంటున్నారు తెలంగాణ దర్శకులు.
24 ఫ్రేముల్లోనూ ఊడలు దిగిన వటవక్షాలు ఎదగనివ్వని తెలంగాణ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువ ప్రతిభావంతులకు ఈ వేదిక సదావకాశమే అని చెప్పాలి. కాలేజీ స్థాయిలోనే తమ ప్రతిభను చాటుకునేందుకు మొబైల్ కెమెరాలతో షార్ట్ ఫిలింస్ నిర్మించి యూట్యూబ్‌ని ఉర్రూతలూగిస్తున్న తెలంగాణ యువతకు పెద్ద సినిమా చేసే అవకాశం కల్పించే వారిధి ఈ చిత్రోత్సవమని నిర్వాహకులంటున్నారు. గత ఏడాదిలో నిర్వహించిన తెలంగాణ ఫిలిం ఫెస్టివల్‌కు వచ్చినట్టుగా ఈసారి కూడా వందల సంఖ్యలో షార్ట్ ఫిలింస్ వస్తాయని అంచనా వేస్తున్నారు. హ్యాండ్ కెమెరా, మొబైల్ కెమెరాతో సినిమాలు తీస్తున్న యువతే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన షార్ట్ ఫిలింస్‌ను కూడా ఈ చిత్రోత్సవాల్లో పోటీకి పంపవచ్చని నిర్వాహకులంటున్నారు.

తెలంగాణ దర్శనం!
తెలంగాణ ఫిలిం ఫెస్టివల్‌లో తెలంగాణ సినిమాల ప్రదర్శన, తెలంగాణ షార్ట్‌ఫిలిం కాంపిటీషన్ ఉంటుంది. తెలంగాణ సంస్కతి, చరిత్ర, భాష, భావజాలాన్ని చాటే చిత్రాలైన మా ఊరు, మా భూమి, రంగుల కల, దాసీ, జై బోలో తెలంగాణ, ఒసేయ్ రాములమ్మ, చిల్లర దేవుళ్లు, భద్రం కొడుకో, జై బోలో తెలంగాణ, పోరు తెలంగాణ, వీర తెలంగాణ, ఇంకెన్నాళ్లు వంటి పాతిక చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ చిత్రాల ప్రదర్శనతోపాటు సినీ రంగంలో అడుగుపెట్టాలనుకుంటున్న యువతకు ప్రోత్సాహం అందించేందుకు షార్ట్‌ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్‌లో 3 నుంచి 30 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింస్‌ను పోటీకి అనుమతిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింస్ నిర్మాత, దర్శకత్వం, కథ, మాటలు, సంగీతం, సాంకేతిక నిపుణులు, కళాకారులందరూ తెలంగాణ వారై ఉండాలి. పోటీలో ఉత్తమ షార్ట్ ఫిలిం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులు అందజేస్తారు. పోటీకి పంపే షార్ట్ ఫిలింస్ ఎంట్రీలను ఈ నెల చివరి నాటికి పంపించవచ్చు. ఆసక్తి గలవారు [email protected]ను సంప్రదించి వివారాలను తెలుసుకోవచ్చు. లేదా 93478 02101 నంబరును సంప్రదించవచ్చు. జూలై మొదటి వారంలో నిర్వహించే చిత్రోత్సవంలో ప్రదర్శన, విజేతలకు అవార్డులు అందజేస్తారు.

అందరూ దీవించాలి: అల్లాణి శ్రీధర్, సినీ దర్శకులు
తెలంగాణ సినిమా బాల్యదశలో ఉంది. సినిమాలో మన భాష, సంస్కతికి పట్టం కట్టాలంటే మన కళాకారుల ప్రవేశం అవసరం. నేటి షార్ట్‌ఫిలిం మేకర్సే రేపటి స్టార్ డైరెక్టర్స్ అవుతారు. స్టార్ కాగల ప్రతిభ ఉన్న కళాకారుల్ని గుర్తించేందుకే ఈ షార్ట్ ఫిలిం కాంపిటేషన్ నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ సంస్కతిని చాటే చిత్రాలు, తెలంగాణ సినీ కళాకారుల ప్రతిభను తెలిపే చిత్రాలు ప్రదర్శిస్తాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో అన్ని వర్గాలు తమవంతు పాత్ర పోషించినట్లు తెలంగాణ సినిమా కోసం ప్రభుత్వం, మీడియా, తెలంగాణ కళాకారులు, ప్రేక్షకులు ఆదరించాలి.

విభజన కాదు ప్రోత్సాహం: బాబీ లక్ష్మణ్, సినీ దర్శకులు
సీమాంధ్రుల ఆధిపత్యంలో ఉన్న సినిమాలో తెలంగాణ వారికి గుర్తింపు, గౌరవం లేకపోవడంతో తెలుగు సినిమా నుంచి తెలంగాణ సినిమాగా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. అంతేకాని వేరుపడటం కాదు. తెలుగు సినిమా మద్రాసులో పుట్టి, పెరిగింది. ఆ నగరంతో తెలంగాణకు అనుబంధం లేకపోవడం, సీమాంధ్రకు దగ్గరగా ఉండడం వల్ల వారు ముందుగా ప్రవేశించారు. ఆ తర్వాత వారే తెలుగు సినిమాను శాసించే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద డైరెక్టర్లు ఉన్నా మేం తెలంగాణ వాళ్లం అని ముందుకురాలేరు. కారణం తెలుగు సినిమాలో అన్ని రంగాల్లో సీమాంధ్రులదే ఆధిపత్యం. అందువల్ల ఆ రంగాలన్నింటిలోకీ మనవాళ్లు అడుగుపెట్టే అవకాశం లేదు. అందుకు నేనే ఉదాహరణ. నేను సినిమా పరిశ్రమలో 13 సంవత్సరాలు కష్టపడితే ఇన్నాళ్లకు అనుకున్న స్థితికి చేరుకున్నాను. కారణం నాకు గాడ్ ఫాదర్ లేడు. అందుకే సినిమా రంగంలోకి తెలంగాణ వాళ్లను ప్రమోట్ చేస్తే నెక్ట్స్ జనరేషన్‌కు అయినా గాడ్ ఫాదర్స్ ఉంటారు. తెలంగాణ ఫిలిం ఫెస్టివల్‌ను రిజర్వేషన్ల తరహాలో అర్థం చేసుకోండి. వెనుకబడిన వారికి న్యాయం చేయడం కోసం దేశంలో రిజర్వేషన్లు అమలు చేసినట్లే వెనుకబడిన ప్రాంతానికి చెందిన కళాకారుల్ని, వివక్షను ఎదుర్కొంటున్న కళాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకే ఈ సినిమా సంబురం నిర్వహిస్తున్నాం.

 

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Betting Bangarraju

    7

  • tom bhayya

    5

  • psycopk

    4

  • citizenofIND

    4

Top Posters In This Topic

Posted

Audience kooda mana rastram volle undalna.. Andhrollu soodocha.. Why abt rest of Indians, foreigners..
:)

Posted

Audience kooda mana rastram volle undalna.. Andhrollu soodocha.. Why abt rest of Indians, foreigners..
:)


mee cinemalu memu chudatledaa maa cinemalu meeru kuda chudochu antaademo 4s086h.jpg
Posted

ekkada dorukutayi bhayya ittanti articles 4s086h.jpg

 

"mana pathrika mana atham gouvaravam".. dalapathi editor ee daily ki Namasthey Telangana paer lodhi vay news..
 

Posted

"mana pathrika mana atham gouvaravam".. dalapathi editor ee daily ki Namasthey Telangana paer lodhi vay news..


vaarni NT lo intha goram ga raastaara, nenu eppudu chadavaledu vayya 4s086h.jpg
Posted

vaarni NT lo intha goram ga raastaara, nenu eppudu chadavaledu vayya 4s086h.jpg

neeku eppudanna entertainment kaavali antey sakshi, abn, NT cover cheyu.. manchi time pass 4s086h.jpg

Posted

enti sir ee development.. with in days.. what a progress... 

Posted

TG Megastar - Nitin Association Started.

TG Superstar - Narayanamurthy

TG Top Heroine - Sexy Kavita Darling

TG Top Comedian - Pink Panther Lafangi.

 

..... Declare your TG Moviestar Database i say. brahmi20.gif

Posted

TG Megastar - Nitin Association Started.

TG Superstar - Narayanamurthy

TG Top Heroine - Sexy Kavita Darling

TG Top Comedian - Pink Panther Lafangi.

 

..... Declare your TG Moviestar Database i say. brahmi20.gif

bye1  bye1  bye1

×
×
  • Create New...