Jump to content

Recommended Posts

Posted

10422438_648503308532404_591709811636037

ఈ అధికారం వుండి ఈ పని చేయవలసిన వాడు ఈ కర్తవ్యాన్ని చేయవలసి వుంటుంది అని వేదం నిర్ణయించింది. సమాజం కోసం కాయకష్టం చేసే వాళ్ళకి కాలంలో ప్రొద్దున ఇది చెయ్యి, మధ్యాహ్నం ఇది చెయ్యి, సాయంత్రం ఇది చెయ్యి, రాత్రికి ఇది చెయ్యి అంటే చేస్తూ కూర్చోవడానికి వాళ్ళకి అవకాశం ఎక్కడ వుంటుంది? అందుకని వాళ్ళకి అది తొలగించి భగవన్నామాన్ని పలకడం, గురువుయందు భక్తితో వుండడం, ప్రత్యక్ష పరమేశ్వరుడైన సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయడం, అటువంటి వాటితో సరిపుచ్చింది. అంతమాత్రం చేత అలా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఏదో ఉత్తమ గతులు పొందరు అని అనుకోకూడదు. ఎవరికి నిర్దేశించిన కర్మ వారు చేస్తే అందరూ పరమేశ్వరుడిని చేరతారు. అలా అందరికీ కర్మయందు సమానమైన అధికారము లేకపోయినప్పటికీ పరమేశ్వరుడు అందరూ సమానంగా పూజచేసి సమానమైన ఫలితాన్ని పొందడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాణి ఒక్కటే - అదే గోవు. సృష్టిలో గోపూజ చేయడానికి అర్హతానర్హతలు లేవు. ఉదాహరణ చెప్పాలంటే అగ్ని సంబంధమైన కార్యాన్ని సన్యాసి చెయ్యకూడదు, గృహస్థు చేస్తాడు. సంధ్యావందనాన్ని, గృహస్థు, బ్రహ్మచారి, వానప్రస్థు చేస్తారు. సన్యాసి నిర్వర్తించరు. అలాగే సన్యాసి ఎప్పుడూ తిరిగుతూ వుంటాడు. బ్రహ్మచారి గురువుగారు యేపని చెప్తే అది చేస్తాడు. గృహస్థు తన కుటుంబాన్ని నమ్ముకొని ఒకచోట వుంటాడు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అధికార భేదం. దానం పట్టవచ్చు గృహస్థు, పట్టకూడదు బ్రహ్మచారి. ఎవరి ఆశ్రమాన్ని బట్టి వాళ్ళకి అధికారం. కానీ అందరూ పూజించడానికి యోగ్యము కలిగినటువంటి ఏకైక ప్రాణి భూమండలంలో గోవు ఒక్కటే. అందరూ పూజ చేయడానికి ఒకే కల్పంతో ఒకే పూజా విధానంతో ఉన్నటువంటి ఏకైక ప్రాణి ఈ లోకంలో గోవు. సృష్టియందు అనేక ప్రాణులున్నప్పటికీ యే ప్రాణియొక్క పేరు ప్రక్కనా కూడా మాత అని వుండదు. అది మన ఇంటిని, ఐశ్వర్యాన్ని కాపాడే కుక్క అవచ్చు. అయినా శునకమాతా అని పిలవరు దానిని. ఒక్క గోవు దగ్గరికి వచ్చేసరికి మాత్రం గోమాత అని పిలుస్తారు. గోవుకి మాతృస్థానాన్నిచ్చి శాస్త్రం గౌరవించింది. ఎందుచేతనంటే రెండు కారణాలను చెప్పింది వేదం. ౧. ఈ జంతు ప్రపంచంలో సాధారణంగా యే జంతువు ఇచ్చే పాలైనా సరే రజోగుణ తమోగుణాలను వృద్ధి చేస్తాయి. సత్త్వగుణాన్ని వృద్ధి చేయడం వుండదు. కానీ ఆవుపాలు సత్త్వ గుణాన్ని వృద్ధి చేస్తాయి. ఆరోగ్యాన్ని విశేషంగా నిలబెడతాయి. సమీకృత ఆహారమై వుంటాయి. ఎముకలకి పరిపుష్టినివ్వగలిగిన కాల్షియం సమృద్ధిగా వుంటుంది. బుద్ధిని విశేషంగా ప్రచోదనం చేస్తాయి. అందుకే సృష్టిలో ఆవు ఒక్కటే దూడ కొరకు మాత్రమే పాలను స్రవించదు. తన దూడ త్రాగగా చాలా పాలు ఆవుదగ్గర మిగిలిపోతాయి. నిజానికి ఆ పాలన్నీ దూడ త్రాగితే దూడకి అనారోగ్యం వస్తుంది. అందుకే దూడ కడుపు నిండిపోయిన తర్వాత కూడా స్రవిస్తుంది ఆవు. దేనికోసం? అలా పాలను ఇచ్చినందు చేత తల్లిలేని బిడ్డలదగ్గరనుండి,తల్లిపాలు సమృద్ధిగా లేని బిడ్డల నుండి, అనారోగ్యంతో వున్నవాళ్ళని, నిరంతరం సత్త్వగుణంలో నిలబడవలసినటువంటి అవసరమున్న సన్యాసుల వరకు అందరికీ ఆవుపాలయొక్క సేవనము యోగ్యమైనదిగా చెప్పబడుతుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో నామాలు చెప్పేటప్పుడు ఒక పొందిక వుంటుంది. అందులో చూస్తే గుణనిధి గోమాతా గురుమూర్తి గుహజన్మభూః - ఇవన్నీ ఒక వరుస క్రమంలో వస్తాయి. సత్త్వగుణంతో మంచి గుణములన్నీ ఏర్పడాలి అంటే, భగవద్భక్తి, శాస్త్రమునందు విశ్వాసము ఏర్పడి మనుష్యుడు మనుష్యుడిగా బ్రతికే లక్షణం కలగాలి అంటే గుణములకు నిధి కావాలంటే గోవుయొక్క పాలను త్రాగాలి. ఎవడు సత్త్వగుణావలంబుడై శాస్త్రాలను పరిశీలనం చేసి శాస్త్రాంతర్గతమైన విషయాన్ని తన ఎరుకలోకి బాగా తెచ్చుకొని ఇతరులకు బోధ చేయగలిగినటువంటి వాగ్వైభవాన్ని కలిగి వుంటాడో ఆయన గురువు. అటువంటి గురువు గోవుయొక్క పాలని త్రాగడం చేతనే ఆ బుద్ధి ప్రచోదనాన్ని పొందుతాడు. సన్యాసి కూడా సేవించడానికి యోగ్యమైన పాలను స్రవించ గలిగినట్టి ఏకైక ప్రాణి గోవు. గోవుయొక్క విలువ కట్టడం, గౌరవం, మర్యాద, శక్తిని గణన చేయడం లోకంలో యెవరికీ సాధ్యం కాదు. ఎందుచేతనంటే గోవు చతుర్ముఖ బ్రహ్మ గారి చే సృష్టించబడ్డ ప్రాణి కాదు. పరదేవతయే గోమాతగా రూపాన్ని స్వీకరించింది. ఎందుచేత అంటే ఈ భూమండలం మీద నాలుగు మాతృ స్వరూపాలు తిరుగుతుంటాయి. ౧. జనక మాత ౨. భూమాత ౩. గోమాత ౪. లోకమాత. జనక మాత - జన్మనిచ్చిన తల్లికి ఎంత గౌరవం ఇస్తామో గోవుకి కూడా అంతే గౌరవం ఇస్తాం. అందుకే ప్రక్కన మాత అన్నాం. పసిపిల్లవాడు బ్రతకడానికి కారణం అమ్మే. ఆమె కడుపులోనే ఊపిరి పోసుకుంటాడు. బయటికి వచ్చిన తర్వాత రక్తాన్ని పాలగా మార్చి పడుతుంది. అవి త్రాగి బ్రతుకుతాడు. తల్లి మాంసం తినడం ఎంత హేయమైన కృత్యంగా చెప్పబడుతుందో గోవుయొక్క మాంసం తినడం కూడా అంత హేయమైన కృత్యంగానూ చెప్పబడుతుంది. మనిషి జన్మ సార్థక్యతకు ఉపయోగపడే ప్రాణి గోవు ఒక్కటే. భూమాత అమ్మ ఎలా అన్నం పెడుతుందో అలా తరువాతి కాలంలో కూడా మనం బ్రతకడానికి కావలసిన సమస్తమైన పదార్థములను తనలోంచే ఇస్తుంది భూమాత. చిట్టచివరికి ఆ భూమాత కడుపులోనే మనం కలిసిపోతాం. ఏ కొడుకైనా తను శరీరంతో వుండగా సాక్షాత్ పరదేవతా స్వరూపమైన తన కన్నతల్లి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి బాధపొందుతాడేమోనని అమ్మవారి లోకమాతగా యేదో దేవాలయంలో ఉండడం కాదు గోమాతగా నేను ఎక్కడ చూస్తే అక్కడ తిరుగుతూంటాను అని చెప్పింది. మనిషి జీవితంలో గండకాలం వుంటే అది తొలగడానికి నల్లనువ్వులు చేతిలో వేసుకొని ఆవుపాలు బెల్లంముక్క కలిపి ఒక ప్రత్యేకమైన మంత్రంలో పుచ్చుకుంటారు. అలా పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు వరకు యేవిధమైన గండమూ లేకుండా చూడగలుగుతాడు. అమ్మ చేత్తో తలమీద నూనెపెట్టి ఆశీర్వచనం చేసి ఇష్టమైన మధురపదార్థాలు చేసిపెట్టే అమ్మ కొంతకాలం తర్వాత కనుమరుగైపోయినా ఆ అమ్మ స్థానంలో వుండి ఎప్పుడూ బిడ్డయొక్క అభ్యున్నతిని కోరగలిగిన వేరొక తల్లి రూపంలో తిరిగే ఏకైక ప్రాణి గోవు. ఆ గోమాత కూడా కనపడలేదు అనుకుంటే భూమాతగా వుండి అన్నం పెడుతోంది. కాదు కాదు ఈ రూపాలన్నీ దేవాలయంలోని లోకమాత నుంచి వచ్చాయి. కాబట్టి నాలుగు మాతా స్వరూపములతో ఈ లోకంలో అమ్మవారు తిరుగుతూ వుంటుంది. అందులో ప్రధాన మైన స్వరూపం గోమాతా స్వరూపం

×
×
  • Create New...