Jump to content

Navya Andhra Ki Chandrodayam Nede


Recommended Posts

Posted

baaga hopeful unnaru janam....eedu emanna theda chesthe ee sari address undadhu tdp ki

Posted

baaga hopeful unnaru janam....eedu emanna theda chesthe ee sari address undadhu tdp ki



ali+venu+madhav+gif+%25282%2529.gif
Posted

BJP top leaders LK Advani and Murali Manohar Joshi, Union ministers Rajnath Singh, M Venkaiah Naidu, Arun Jaitley, Prakash Javadekar, Nirmala Seetharaman, Sadananda Gowda, and Piyush Goyal, chief ministers Navin Patnaik (Odisha), Prakash Singh Badal (Punjab), Manohar Parrikar (Goa), Shivaraj Singh Chauhan (MP), Raman Singh (Chhattisgarh), Vasundhara Raje (Rajasthan) and Anandi Ben Patel (Gujarat) have already confirmed their participation.

Posted

theda chestadu pakka...as usual single community centric development vunatdhi...aa cunning naa k's murali mohan gadu dramoji gadu develop avadam thapoinchi emundadhu...

Posted

This is a wonderful opportunity for Seemandhra people, ippati daka SA vallaki migration valla identity ledu, SA has highly talented culture, now we are cornered, no one can stop us.

Posted

Congrats CBN


ali+venu+madhav+gif+%282%29.gif


mee sakshiit enti essay rasadu ali+venu+madhav+gif+%282%29.gif

నాగార్జున వర్సిటీ వద్ద ఆర్భాటంగా ఏర్పాట్లు
రాత్రి 7:27 గంటలకు ప్రమాణం.. ఖర్చు రూ. 30 కోట్లు
ఢిల్లీ, హైదరాబాద్‌ల నుంచి కార్యక్రమానికి వస్తున్న
వీఐపీలు, పాత్రికేయులు, బంధుమిత్రులకు ప్రత్యేక విమానాలు
గన్నవరం నుంచి సభాస్థలి వరకూ నాలుగు హెలికాప్టర్లు
సభా స్థలి వద్దే నాలుగు హెలిపాడ్లు, అంతర్గత తారు రోడ్లు
విజయవాడ, గుంటూరుల్లో పెద్ద సంఖ్యలో హోటల్ గదులు
వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు, భారీగా బస్సులు
సభా ప్రాంగణంలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాట్లు
సభలో సినీ తారలతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు
చంద్రబాబుతో పాటు 17 మంది వరకూ మంత్రుల ప్రమాణం
ప్రమాణ స్వీకారం వెంటనే 3 ఫైళ్లపై బాబు సంతకాలు!

సాక్షి, విజయవాడ/హైదరాబాద్: అవశేష ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం నాడు చేయబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమం దేశంలోనే అత్యంత ఆర్భాటంగా, ఆడంబరంగా జరిగే కార్యక్రమంగా రికార్డుకెక్కనుంది. ఇందుకోసం విజయవాడ - గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సభా ప్రాంగణం, వేదికల ఏర్పాట్లకు ప్రభుత్వ, ప్రైవేటు (టీడీపీ పార్టీ పరంగా) 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతున్నట్లు చెప్తున్నారు. చంద్రబాబు ఆదివారం రాత్రి 7:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 17 లేదా అంతకంటే తక్కువ మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఖరారు కాలేదు. మంత్రివర్గంలో బీజేపీ నుంచి ఒకరికి చోటు కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల రాక కోసం ఢిల్లీ, హైదరాబాద్‌ల నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయగా.. అక్కడ నుంచి వారిని ప్రమాణ స్వీకారం జరిగే వేదిక వరకు చేర్చడానికి నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీల బస కోసం పెద్ద ఎత్తున హోటళ్ల రిజర్వేషన్లు, సభా ప్రాంగణంలో సైతం అత్యాధునిక ఏసీలు, వీవీఐపీలకు గదులు, జనరేటర్లు, తారురోడ్లతో భారీ స్థాయిలో వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా గుంటూరు, కృష్ణా జిల్లాల అధికార యంత్రాగం దాదాపు పూర్తిగా.. రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు వారం రోజులుగా అన్ని పనులను పక్కన పెట్టి ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశేష ప్రచారం కల్పించే లక్ష్యంతో.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కొందరు జర్నలిస్టులను ఆహ్వానించారు. వీరితోపాటు అక్కడి నుంచి మరికొంత మంది అతిథులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా ఢిల్లీ - గన్నవరం విమానశ్రయం మధ్య రెండు ప్రత్యేక విమానాలను.. నారా, నందమూరి కటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు వచ్చే ప్రత్యేక విమానాలు వీటికి అదనం.

విమాన మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకునే అతిథులను అక్కడ నుంచి ప్రమాణ స్వీకార సభాస్థలి వరకు చేర్చడానికి గాను నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లు రోజంతా నిరంతరం అందుబాటులో ఉంటాయి. వ్యవసాయ పొలాల మధ్య ఏర్పాటు చేసిన సభాస్థలిలో అతిథుల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా అంతర్గతంగా అప్పటికప్పుడు తారు రోడ్లను నిర్మించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీఐపీలు, రాష్ట్రానికి చెందిన అధికారులు, ముఖ్యులు బస చేయడానికి వీలుగా ప్రభుత్వ యంత్రాంగం విజయవాడ, గుంటూరు నగరాల్లోని అన్ని ప్రధాన హోటళ్లల్లో దాదాపు 650 గదులు, ప్రభుత్వ అతిథి గృహాలను ప్రత్యేకంగా సిద్ధంగా చేశారు. అతిథుల సౌకర్యాల కోసం దాదాపు కోటి రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోన్నట్టు ప్రాథమిక అంచనా. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల బసల ఏర్పాట్ల పర్యవేక్షణకే వంద మంది ప్రభుత్వ అధికారులను నియమించారు.

ముఖ్య అతిథులు విశ్రాంతి సమయంలో వినోదం కోసం హాయిలాండ్ పర్యాటక స్థల సందర్శనకు వీలుగా ఆర్‌టీసీకి చెందిన గరుడ, ఇంద్ర వంటి ఎసీ బస్సులను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచారు.
సభాప్రాంగణంలోనే 400 మంది ఆసీనులయ్యేలా ఒక గ్రీన్ రూం నిర్మాణం. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో దానికి ప్రత్యేకంగా ఏసీ సౌకర్యం కల్పించారు. సభా స్థలిలోనే వీవీఐపీ కోసం యుద్ధప్రాతిపదికన ప్రత్యేకంగా పది గదులను ఏర్పాటు చేశారు.

సభా ప్రాగంణమంతా వెలుగులు నింపడానికి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆరు 315 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు.. మూడు 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు.. శబ్ద కాలుష్యం లేని 125 కేవీఏ సామర్థ్యం కలిగిన 20 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. పెదకాకాని నుంచి జాతీయ రహదారిపై కరెంట్ స్తంభాలకు హైమాస్ దీపాలు ఏర్పాటు. వర్షం పడినా సభకు అంతరాయం కలగకుండా సభాస్థలిలో ఎక్కువ భాగం రెయిన్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు. సభా ప్రాగంణంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా ముందస్తు జాగ్రత్తగా కాల్వలు, తూములు, కల్వర్టులకు ప్రత్యేకంగా మరమ్మత్తులు చేశారు.
వీవీఐపీల కోసం ప్రమాణస్వీకార ప్రాగంణంలో హైదరాబాద్ నుంచి పది అత్యవసర మరుగుదొడ్లు తెప్పించి సిద్ధం చేశారు.

సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి పార్టీ అభిమానులు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా 12 ప్రత్యేక రైళ్ల సిద్ధం చేశారు. ఆర్‌టీసీ, ప్రయివేటు బస్సులు, వాహనాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు.

సభాస్థలిలో భారీ ఖర్చుతో సినీ తారలతో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ మంచినీరు, మజ్జిగ, పులిహోర అందజేసేందుకు ప్రభుత్వ పరంగానే ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఏర్పాట్లు పూర్తి.. భారీ బందోబస్తు...

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రాంగణంలో అంతర్గత రోడ్లు మొదలుకొని వేదికల నిర్మాణం, ఫ్లెక్సీల అలంకరణ వరకు అన్ని పనులు పూర్తయ్యాయి. చంద్రబాబుతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూడు వే దికలను ఏర్పాటు చేస్తున్నారు. 480 అడుగుల ప్రధాన వేదిక, 240 అడుగుల సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేశారు. సభా వేదికపై దివంగత ఎన్‌టీఆర్ విగ్రహంతో పాటు తెలుగుతల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, ప్రత్యేక అతిథుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. మొత్తం ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జాస్తి వెంకటరాముడులు పరిశీలించారు. కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి వీవీఐపీలు హాజరుకానున్న క్రమంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసి సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 8,568 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మూడు ఫైళ్లపై బాబు సంతకాలు!

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభంకానుంది. రాత్రి 7:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక 8 గంటలకల్లా కార్యక్రమం ముగుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మూడు ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. తొలి సంతకం రైతుల రుణమాఫీ విధివిధానాలు ఖరారు చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తూ ఒక ఫైలుపై ఉంటుంది. రెండో ఫైలు మద్యం బెల్టు షాపుల రద్దుపై ఉంటుంది. మూడో సంతకం ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకంపై సంతకం చేస్తారు.

నేడు విజయవాడకు బాబు, గవర్నర్...

ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే చంద్రబాబు తొలుత నెక్లెస్‌రోడ్‌లోని ఘాట్‌లో ఎన్‌టీఆర్‌కు నివాళులర్పిస్తారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రమాణస్వీకార స్థలికి ప్రదర్శనగా చేరుకుంటారు. చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం రోడ్డు మార్గంలో ప్రమాణ స్వీకార స్థలానికి చేరుకుని ఆ కార్యక్రమం పూర్తై వెంటనే రైలులో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.

ప్రత్యేక విమానాల్లో సీఎంలు, కేంద్రమంత్రులు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవనున్నారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు మంత్రులు రవిశంకర్‌ప్రసాద్, స్మృతి ఇరానీ, డాక్టర్ హర్షవర్ధన్, నజ్మాహెప్తుల్లా, పీయూష్‌గోయల్, నిర్మలాసీతారామన్, ప్రకాశ్‌జవదేకర్, మనోజ్‌సింగ్, అనంతగీతే, కల్‌రాజ్‌మిశ్రాలు బాబు ప్రమాణానికి అతిథులుగా వస్తున్నారు. వీరితోపాటు ముఖ్యమంత్రులు వసుంధ రరాజే (రాజస్థాన్), నెప్యూయూరియో (నాగాలాండ్)లు కూడా ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నట్టు సమచారం. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లగా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ముంబై నుంచి నేరుగా కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సైతం మరో ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశాలున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.

వీరితోపాటు ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌చౌహాన్ (మధ్యప్రదేశ్), ఆనందీబెన్‌పటేల్ (గుజరాత్), రమణ్‌సింగ్ (ఛత్తీస్‌గఢ్), ప్రకాశ్‌సింగ్‌బాదల్ (పంజాబ్), మనోహర్‌పారిక్ (గోవా) హాజరవుతున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరు కాలేకపోతున్నారని పీఎంఓ కార్యాలయవర్గాలు ఇప్పటికే తెలిపాయి. ఢిల్లీ నుంచి మీడియా ప్రతినిధులు సైతం కేంద్రమంత్రులు వెళుతున్న ప్రత్యేక విమానంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. కార్యక్రమం అనంతరం వీరంతా రాత్రి 9:30 గంటలకు అదే విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. మరోవైపు.. తమ పార్టీ అధినేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కొత్తగా ఎన్నికైన లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌ను టీడీపీ ఎంపీలు అశోక్‌గజపతిరాజు, సి.ఎం.రమేశ్, తోట నరసింహంలు శనివారం ఆహ్వానించారు. అయితే వివిధ కారణల వల్ల తాను హాజరుకాలేకపోతున్నానని, తన తరఫున ప్రతనిధిని పంపుతానని ఆమె చెప్పినట్టు భేటీ అనంతరం అశోక్‌గజపతిరాజు తెలిపారు.

పవన్‌తో పాటు నందమూరి ఫ్యామిలీ...

జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో పాటు నందమూరి కుటుంబ సభ్యులందరూ సభకు హాజరుకానున్నారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు, టీడీపీ రాష్ట్రనేత మన్నవ సుబ్బారావులు తెలిపారు. నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్‌టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇతర కుటుంబ సభ్యులంతా సభలో పాల్గొంటారని వివరించారు.
Posted

This is a wonderful opportunity for Seemandhra people, ippati daka SA vallaki migration valla identity ledu, SA has highly talented culture, now we are cornered, no one can stop us.


agreed initial 2-3 yrs might be difficult but future looks promising
×
×
  • Create New...