Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్ : రాజమౌళి, ప్రభాస్ మధ్య అనుభంధం కేవలం దర్సకుడు, హీరో మధ్య ఉన్నది కాదు...మంచి స్నేహితుల్లా వ్యవరిస్తారని చెప్పుతూంటారు. అదే చనువుతో...ప్రభాస్ కి బ్రెయిన్ వాష్ చేసాడని, దాని ఫలితమే తనపై వచ్చిన రూమర్స్ పై పత్రికాముఖంగా ఖండన ఇవ్వటానికి ముందుకు వచ్చాడంటున్నారు. రూమర్స్ ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ఖండించే రాజమౌళి...ఈ విషయంలో ప్రభాస్ కి సలహా ఇచ్చారని, ఇలాంటి రూమర్స్ ని మొదట్లోనే కట్ చేయాలని చెప్పినట్లు చెప్పుకుంటున్నార . 

16-prabhas-and-rajamouli-on-sharmila-iss
ఇటీవల ఆయన గురించి అనేక పుకార్లు చెలరేగుతున్నాయి. దీంతో వీటన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి ఆయన వివరణ ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా పుకార్లపై సమాధానమిచ్చారు. ప్రభాస్ ఖండిస్తూ... ''నేను తీవ్ర అనారోగ్యం పాలయ్యానంటూ వచ్చిన వార్తలు నిజం కాదు. వై.ఎస్‌.షర్మిలతో నాకు సంబంధం ఉందంటూ వస్తున్న పుకార్లు సత్యదూరం. ఈ విషయాలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి'' అన్నారు ప్రభాస్‌. 

''నాకు, షర్మిలగారికి ఎటువంటి సంబంధం లేదు. ఆమెతో ఇప్పటివరకు నేను మాట్లాడలేదు కూడా. గతంలో నా ఆరోగ్యంపై పుకార్లు వచ్చినప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. వాటంతట అవే సమసిపోతాయని వదిలేశాను. పుకార్లను పట్టించుకోకుండా ఉంటేనే మంచిదనేది అప్పుడు నా అభిప్రాయం. అయితే ఇప్పుడు నా మీద మీద వస్తున్న పుకార్లు మరొకరి జీవితాన్ని ఇబ్బందిపెడుతున్న యి అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. వాటిని ఖండిస్తున్నాను. పెళ్త్లె, పిల్లలున్న ఓ మహిళ విషయంలో ఇలాంటి పుకార్లు రావడం బాధాకరం. అందుకే ప్రకటన ఇస్తున్నాను. అంతేగానీ నాకెటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవు ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి అసత్య విషయాలు ఆగడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. పోలీసులు, సంబంధిత అధికారులు ఈ విషయమై సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను'' అంటూ రాసుకొచ్చారు ప్రభాస్‌. 

Posted

ivi anni nizame antara...ela evado fan kinda laptop eskoni kursoni keyboard meeda type sesina sollu varthaapawan-kalyan-trivikram-laugh-gif.gif

×
×
  • Create New...