Jump to content

Endi Edii.. Doctor Gaddi Emmi Poye Kalam


Recommended Posts

Posted

eenti matter inthakee... clear gaa postandi

 

Posted

A LINK LO TELUGU LO SPASHTAM GA RASARU CHADUVUKO MAN...

Posted

eenti matter inthakee... clear gaa postandi

మొబైల్‌లో చిత్రీకరించి నిందితులు బ్లాక్ మెయిల్
 
బెంగళూరు : స్వలింగ సంపర్కంతో పరిచయం పెంచుకుని వైద్యుడిని బ్లాక్‌మెయిల్ చేసిన ఏడుగురు యువకులను బెంగళూరు సీసీబీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ఓ వైద్యుడు, తన భార్యాపిల్లలతో కలిసి తిలక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. టాటా స్కై డిష్ యాంటెనాలు ఏర్పాటు చేసే ఆవులహళ్లి నివాసి సుహాన్(20) ఓ సారి ఆ డాక్టర్ ఇంటికి వెళ్లాడు.

సిగరెట్లు మానడానికి తగిన మందులు ఇస్తానని నమ్మించిన ఆ వైద్యుడు సుహాన్‌ను నగ్నంగా మార్చి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పరాదంటూ ఆ వైద్యుడు సుహాన్‌కు వేలాది రూపాయలు ఇచ్చి పంపాడు. అయితే విషయాన్ని తన స్నేహితులు మధు, వికాస్, దివాకర్‌కు సుహాన్ చెప్పాడు. రెండు నెలల క్రితం వీరంతా డాక్టర్ ఇంటికి వెళ్లి అతని కోర్కె తీర్చి డబ్బు తీసుకొచ్చారు. అలా నిరంతరం వారు డాక్టర్ ఇంటికి వారు వెళ్లేవారు.

ఒకసారి సుహాన్, వికాస్ ఆ వైద్యుడితో స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారు. దాన్ని వైద్యుడికి తెలీకుండా మొబైల్లో చిత్రీకరించారు. అనంతరం వైద్యుడ్ని కలిసి ఆ క్లిప్పింగులు చూపారు. తమకు రూ. ఐదు లక్షలు ఇవ్వాలని, లేకుంటే క్లిప్పింగులను విడుదల చేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ ఆ వైద్యుడు వారికి రూ. 5 లక్షలు ఇచ్చాడు.

నెల క్రితం తమ స్నేహితులైన నితీష్, మహేష్, విశ్వలను ఆ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వారంత సీసీబీ పోలీసులు, మీడియా ప్రతినిధులు అంటూ భయపెట్టి రూ. 11 లక్షలు వసూలు చేసుకున్నారు. ఎలాంటి సంపాదన లేని తన కుమారుడు విలాసవంతంగా తిరుగాడుతుండడంతో అనుమానం వచ్చిన ఓ నిందితుడి తండ్రి తనకు తెలిసిన సీసీబీ కానిస్టేబుల్‌కు విషయాన్ని చెప్పాడు.  

దీంతో పోలీసులు నిఘా  వేశారు.  అసలు విషయం బయటపడడంతో నిందితులను అరెస్ట్ చేశారు.  నిందితుల నుంచి రూ. ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు ఎంబీఎ, బికాం విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిపై తిలక్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యుడిపై చర్యలు తీసుకునే విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు నేర విభాగం డీసీపీ అభిషేక్ గోయల్ తెలిపారు.

×
×
  • Create New...