solman Posted June 23, 2014 Report Posted June 23, 2014 వీళ్లసలు డాక్టర్లేనా? మానవత్వం ఉన్నోళ్లేనా? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు.. అసెంబ్లీకి అందుబాటులో ఒక వైద్యుల బృందాన్ని కూడా ఉంచడం అనేది అవసరం. ఆనవాయితీ లేదా సాంప్రదాయం. అసెంబ్లీ సమావేశాల్లోని సభ్యులకు ఏదైనా హఠాత్తుగా వైద్య అవసరం ఏర్పడితే సేవలందించడానికి ఇలా అందుబాటులో ఉంచుతారు. సాధారణంగా ఈ వైద్యుల బృందాన్ని హైద్రాబాదులోని గాంధీ ఆస్పత్రినుంచి పంపుతారు. ప్రస్తుతం ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతుండగా.. ఇలాగే వైద్యుల బృందాన్ని పంపడం గురించి గాంధీ ఆస్పత్రికి పురమాయించారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణకు చెందిన తామెందుకు వెళ్లాలంటూ డాక్టర్లు అక్కడ మొండికేయడం చిత్రమైన విషయం. వారందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్యమంత్రి కూడా అయిన రాజయ్య జోక్యం చేసుకుని డాక్టర్లు వెళ్లాల్సిందేనంటూ చెప్పినా కూడా డాక్టర్ల వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ఈ డాక్టర్ల వైఖరి చూస్తోంటే.. అసహ్యం కలుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం ఎలా ఆదేశిస్తే అలా, ఎక్కడ ఆదేశిస్తే అక్కడ సేవలు అందించడం వారి విధి. తమ ఆస్పత్రి పరిధులకు మించి.. వైద్య అవసరం హఠాత్తుగా తటస్థించినట్లయితే.. తక్షణం స్పందించి తాము చేయగలిగింది చేయడం.. అవసరానికి అనుగుణంగా వ్యవహరించడం డాక్టర్లుగా వారిలో మానవత్వపు లక్షణంగా ఉండాలి. అయితే గాంధీ వైద్యులు ఈ రెండు లక్షణాల్ని కూడా విస్మరించినట్లున్నారు. ఏపీ అసెంబ్లీకి తామెందుకు వెళ్లాలంటూ వాళ్లు మొండికేయడమే ఘోరం. వీరి వైఖరి చూస్తోంటే అసలు వీరు డాక్టర్లేనా? వీరికి మానవత్వం ఉన్నదా? అనే అనుమానం ఎవ్వరికైనా కలుగుతుంది. ఇదే డాక్టర్లు తమ తమ ప్రెవేటు ప్రాక్టీసుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన రోగులు వస్తే.. వారినుంచి వేలు లక్షలు కాజేయడానికి కాకమ్మ కబుర్లు చెప్పి కల్లబొల్లి రోగాల్ని చూపి బెదరగొట్టి వైద్యం చేయకుండా ఉంటారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. కేవలం ప్రభుత్వ సర్వీసు చేయాల్సి వస్తే.. ఆంధ్ర శాసనసభకు పనిచేయకూడదని అనడం ఘోరంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు పాలకులు స్వయంగా చెబుతున్నా వీరు ధిక్కరించడం వారి దుర్మార్గానికి పరాకాష్ట. ప్రాణం పోసే దేవుడుగా ప్రజలు కొలుచుకునే పవిత్రమైన వైద్యవృత్తిలో ఉన్న వారు.. ఎవరికి వైద్యం చేయాలనే విషయంలో సరిహద్దుల గీతలు గీసుకుని వ్యవహరించడం నికృష్టమైన నిర్ణయం అని పలువురు దెప్పిపొడుస్తున్నారు. చివరికి ఉద్యోగుల్లో కూడా ఇలాంటి విద్వేషపు, విషభావాలు నిండడానికి ఉద్యమ రోజుల్లో కారకులైన నేతలే.. ఇప్పుడు వారిలో సుహృద్భావ సోదర భావాలు పెరగడానికి కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
timmy Posted June 23, 2014 Report Posted June 23, 2014 1 ,2 years aa telangana heat untundhi aa tharuvaatha evadu dabblu isthe vaadike seva.
iTeachSAP Posted June 23, 2014 Report Posted June 23, 2014 pichi ee naa vedhavalaki ? border lo doctor ante pakisthan oodi kuda vaidhyam chesthaaruu ..
harvey Posted June 23, 2014 Report Posted June 23, 2014 eee madhya kalam lo nenu vinna goppa dialogue " jeevitham ane cinema lo villanlu herolu undaru andharu avakasa vadhule"
Recommended Posts