solman Posted June 26, 2014 Report Posted June 26, 2014 మహిళలకు మానం ప్రాణం కంటే ఎక్కవే. అలాంటి తన మానాన్ని...కన్యత్వాన్ని సమర్పించుకునేందుకు సిద్ధమైంది నజీరియాకు చెందిన ప్రముఖ మహిళా పాప్ సింగర్ అడోకియా. బోకోహరామ్ అనే ఉగ్రవాద సంస్థ 220మంది స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసింది. దీంతో వారిని విడిచిపెట్టాలని కోరుతూ ఈ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది అడోకియా. తమవద్ద బంధీలుగా ఉన్న స్కూల్ విద్యార్థినులను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేసింది. అలా చేస్తే, మిలిటెంట్లకు తన కన్యత్వాన్ని సమర్పించుకుంటానని ప్రకటించింది. వారంతా వయసులో చిన్నవారని, వారిని ఎత్తుకెళ్లడం సరికాదంది. వారిని విడిచిపెడితే, బదులుగా తన కన్యత్వాన్ని ఇస్తానని ఆమె ఆఫర్ చేసింది. ‘వారంతా 15 ఏళ్ల లోపు వారే. నేను పెద్దదాన్ని. ఓ రాత్రికి 10 నుంచి 12 మంది ఉగ్రవాదులు నన్ను అనుభవించినా ఓకే’ అంటూ పేర్కొంది. అయితే మిలిటెంట్లతో చర్చలు ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం.
Recommended Posts