JANASENA Posted July 1, 2014 Report Posted July 1, 2014 కోట్లకు పడగలెత్తిన బార్బర్! రమేష్ పేద కుటుంబం. తండ్రి క్షురకుడు (బార్బర్).రోజుకు ఆదాయం రూ.వందకు మించదు.ఏడేళ్లప్పుడు తండ్రి చనిపోయాడు. ఆ వచ్చే వంద ఆదాయము నిలిచిపోయింది. పిల్లల కోసం తల్లి పొరుగిళ్లలో వంటపని చేసింది. షాపును రోజుకు రూ.5లకు అద్దెకు ఇచ్చింది. అయినా, కడుపునిండా తినేది రోజుకు ఒక్క పూటే. రమేష్ ఎలాగో కష్టపడి ఎలక్ట్రానిక్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఏదో ఒక ఉద్యోగం చేసే బదులు తండ్రి వృత్తినే కొనసాగించాలనుకున్నాడు. 1989లో రమేష్ ఆ వృత్తిలో ప్రవేశించాడు. అప్పట్నుంచి జీవితం కాస్త మెరుగయ్యింది. ఐదేళ్లలో అతను ఒక మారుతి ఓమ్ని కారు కొన్నాడు. అయితే, అది చాలాసేపు ఇంటివద్ద ఖాళీగా ఉండేది. దాంతో దాన్ని అద్దెకిచ్చాడు. అద్దెలో కారు ఖర్చులు పోను మిగతాది పొదుపు చేశాడు. దాంతో మళ్లీ కారు కొన్నాడు. క్రమంగా కార్ల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. రమేష్ సెలూన్ తోడుగా రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా పేరు సంపాదించుకుంది. 2004లో అతను ఖరీదైన కార్లను అద్దెకు ఇవ్వాలనుకుని బ్యాంకు లోనుతో బెంజ్ కారు కొన్నాడు. ఆ సమయంలో బెంగళూరులో కొత్త బెంజ్ అద్దెకు దొరికేది ఒక్క రమేష్ దగ్గరే. దీంతో అతడికి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు రమేష్ దగ్గర బీఎండబ్ల్యూ, రోల్స్‌రాయిస్ ఘోస్ట్, ఆడి వంటి ఖరీదైన కార్లు అద్దెకు దొరుకుతాయి. అతని దగ్గర ఇప్పుడు 90 కార్లు ఉన్నాయి. 60 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. రోజుకు ఆదాయం లక్షల్లో ఉంటుంది. అయినా, ఇప్పటికీ అతను బార్బర్ వృత్తిని వదల్లేదు. ‘నాకు అన్నం పెట్టిన ఈ వృత్తిని నాలో చేవ ఉన్నంత వరకు చేస్తా’నంటాడాయన. ఉదయం 8-10 వరకు సెలూన్లో స్వయంగా కస్టమర్లకు సేవలందిస్తారు. 10-4 వరకు ట్రావెల్స్ వ్యాపారం చూసుకుంటారు. మళ్లీ 4-7 గంటల వరకు క్షవరాలు చేస్తారు. ఆ తర్వాత రాత్రి 8.30 వరకు ట్రావెల్స్ ఆఫీసుకెళ్లి ఆ రోజు కార్యకలాపాలు ముగించుకుని ఇంటికెళ్తారు. వ్యాపార సూత్రం! ‘‘కష్టపడాలి. నిజాయితీ ఉండాలి. ఈ రెండూ ఉంటే వినియోగదారులు మళ్లీ మళ్లీ వస్తారు. అదే నా కార్ల డ్రైవర్లకు నేర్పాను. డ్రైవర్ల తప్పిదాల వల్ల కార్లకు ఫైన్ పడితే వారి జీతంలోనే కట్చేస్తాను. ఎందుకంటే వారికి బాధ్యత తెలియాలి. కస్టమర్లకు ఇబ్బంది కలగకూడదు. నా పని నేను చేసుకోవడానికి సెలవు అవసరం లేదు. మాకు ఆదివారం ఇంకా ఎక్కువ పని ఉంటుంది’’ అన్నారు. ఇప్పటికీ ఆయన వద్ద హెయిర్ కట్ 65 రూపాయలే. ఇది బెంగళూరులోనే అతి తక్కువ ధర.
alpachinao Posted July 1, 2014 Report Posted July 1, 2014 I read about him in eenadu Sunday magazine long time back... He give costly cars for rent
krisdevame Posted July 1, 2014 Report Posted July 1, 2014 That is the dignity of Bangalore city..... Just like him many people are there everywhere in India ... But sometimes the place there're living also makes difference.....
Recommended Posts