Jump to content

Recommended Posts

Posted

10352345_311398589029647_209178593563601

లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవినిని తేవడానికి వెళ్ళినప్పుడు ఆ పర్వతం పై అదెక్కడుందో తెలియక ఆంజనేయుడు మొత్తం పర్వతాన్నేతీసుకుని వస్తాడు.ఇది మనందరికీ తెలిసిందే.అయితే,సంజీవిని గురించి తెలియకపోవడం వల్లే ఆయన మొత్తం ఆ పర్వతాన్ని తెచ్చాడని సామాన్యులు అనుకుంటారు.కానీ,ఈ జగతుకు వెలుగు నిచ్చే సూర్యభగవానుని వద్ద సకల శాస్త్రాలను అభ్యసించిన ఆంజనేయుని తెలియని శాస్త్రం,తెలియని విషయమేమీ లేదు. అలాంటప్పుడు ఆయన ఎందుకు అలా చేశాడన్న సందేహం ఈరోజుల్లోనే కాక,ఆరోజుల్లో చాలా మందికి కలిగింది. ముఖ్యంగా, వానరులకు కలిగింది.వానరుల్లో అతిబలవంతుడు, పరాక్రమవంతుడైన ఆంజనేయుని శక్తిని ప్రదర్శించేఅవకాశం కల్పించడం కోసమే శ్రీరామచంద్రుడుఅలా చేశాడన్న విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉంది.అసలు సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీరామచంద్రునికి పరుల సాయం తీసుకోవల్సిన అవసరం ఏముంది.మూర్ఛబోయిన తన తమ్ముని నుదురు మీద శ్రీరామచంద్రుడు చేయివేసినా, వన్ను మీద అనునయంగా చేత్తో రాసినా అతడు లేచిన కూర్చునే వాడు.ఆంజనేయునికి ఆ పనిని పురమాయించడంలో శ్రీరామచంద్రుని ముందు చూపు

కనిపిస్తుంది.

ఆంజనేయుడు సాధారణ సచివుడు కాదనీ, ఆయనను ఏపనికి ఉపయోగించుకోవాలో తనకు తెలుసునని శ్రీరామచంద్రుడు చెప్పకనే చెప్పినట్టు అయింది. ఏదైనా

ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు కార్యదక్షుడుచేయాల్సిన ముఖ్యమైన పని తన వద్ద ఉన్నవారందరికీ బాధ్యతలను పంచడం, అవి వారు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పర్యవేక్షించడం.

ఆ విధంగా చూసినప్పుడు శ్రీరామచంద్రుడు సక్రమంగానే చేశాడని నిర్ధారణకు రావచ్చు.అలాగే,కార్యోత్సాహంతో ఉన్నవారిని ఉత్తేజపర్చేందుకు వారికి ఏయే అంశాల్లో ఆసక్తిఉంటుందో ఆయా రంగాలకు చెందిన పనులు అప్పగించడం కూడా కార్యదక్షుని పని.రావణాసురుని చెర నుంచితన భార్యను ఎవరి సహాయ,సహకారాలు అవసరం లేకుండా విడిపించుకోగలిగిన శక్తి సామర్ధ్యాలున్నవాడు శ్రీరాముడు. మహిమలున్నా, ఏనాడూ ప్రదర్శించనివాడూ, తన బాధ్యతలను

గుర్తెరిగినవాడు, వాటి పట్ల అకుంఠితమైన శ్రద్ధాసక్తులుఉన్నవాడు అయిన శ్రీరామచంద్రుడు పరుల సాయం కోరడంలో ప్రధానోద్దేశ్యం సీతాన్వేషణ అనే బృహత్‌ కార్యంలో అందరినీ భాగస్వాములుగా చేయడమే. అలాగే,తన భృత్యులు,సచివుల్లో ఎవరైనా తమ బలం మీద అతిగా అంచనా వేసుకుని గర్వానికి పోతే వారి కళ్ళు తెరిపించినవాడు కూడా శ్రీరామచంద్రుడే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలైనా భరించడం,లక్ష్య సాధనకు సులభోపాయాలు లేవని రుజువు

చేయడం శ్రీరామచంద్రుని ప్రధానోద్దేశ్యం.ఆంజనేయునికి సంజీవిని తెచ్చేబాధ్యతను శ్రీరామచంద్రుడుఅప్పగించడం వల్లే,ఆయన శక్తి సామర్ధ్యాలేమిటో తోటి వానరులకే కాక, అందరికీ తెలిసొచ్చింది. అలాగే,ఈ బాధ్యత నిర్వహణ వల్ల ఆంజనేయునిలో చిత్తస్థయిర్యం పెరిగింది.మనిషిలో ఉన్న సామర్ధ్యాన్నీ, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేవారే నిజమైన శ్రేయోభిలాషులు. ఆంజనేయునికి శ్రీరామచంద్రుడుఅసలైన శ్రేయోభిలాషి కనుకనే కష్టమైనా ఆ బాధ్యతను అప్పగించారు. ఆ విషయం ఆంజనేయునికి కూడా తెలుసు. కనుకనే, తన బలాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఆయన సద్వినియోగపర్చుకున్నాడు.

Posted

Jai Aanjaneyam !

asalu sanjeevani parvataanni enduku teesukuni vachadu naku inka artham kaale ?,,,,,,,,,,,,,,,, em antunnadu author ? sree ramudu temmani cheppadani antunnaada ?

Bruce dude...do posts such good ones once a day..

Sure
×
×
  • Create New...