Jump to content

Recommended Posts

Posted

10513429_311071302395709_706628408690632

 

 

 

విభూతి శివునికి యిష్టం.విభూతిని నుదట ధరిస్తే, చెమటను పీలుస్తుంది. శరీరంలోని ఉష్ణాన్ని అదుపుచేస్తుంది. విభూతిని మెడ, భుజాలు, చేతులకు రాసుకుంటారు. విభూతి శివునికి యిష్టం. దేహంలోని నరాలు ఉబ్బటం, బాధపెడుతుంటాయి. విభూతి సక్రమంగా రాస్తే, వీటిని అరికట్టవచ్చు. మన శరీరంలో 72,000 నరాలుంటాయి.

హోమంలో విభూతిని, ఆవునెయ్యి, ఔషధమొక్కలతో హోమంలో వేస్తుంటారు. ఈ విధంగా చేస్తే, వాతావరణ కాలుష్యం బారినుండి రక్షించుకోవచ్చు. సంస్కృతిలో విభూతిని భస్మం అంటారు. 'భాసతియత్‌ తత్‌ భస్మ' అని బ్రహ్మపురాణం చెబుతుంది. శైవపురాణం ' భస్మకల్మష భక్షనాత్‌' అని పేర్కొంది. అంటే భస్మం పాపాలను హరిస్తుంది. 'భక్షణత్‌ సర్వపాపానామ్‌ భస్మేతి పురికీర్తితమ్‌' పాపనాశిని కాబట్టే, దానిని భస్మమ్‌ అని కొనియాడారు.మారేడు దళం శివునికి ప్రీతికరమైనది. భస్మంతో అభిషేకం తర్వాత, మారేడు దళంతో శివుని పూజిస్తారు మూడు ఆకులు, మూడుగుణాలు సూచిస్తాయి. మారేడు కొమ్మలే వేదాలు. వేరులు రుద్రుడు. మారేడు దళం త్రినేత్రాలను సూచిస్తాయి. వీటిని పౌర్ణమి నాడు కోయరాదు. పశ్చిమ దేశాలలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మారేడు మొక్కలను పరిశోధనలకై పెంచు తున్నారు. కీళ్లవ్యాధులు, వాంతులు, క్షయ, విరేచనాలకు మారేడు అద్భుతంగా పనిచేస్తుంది. మారేడు దళాల రసాన్ని మంచినూనెలో కలిపి వేడిచేసిన తర్వాత చెవివ్యాధులకు ఉపయోగిస్తారు.
విభూతి భారతీయ సంస్కృతిలో విశిష్టస్థానముంది.

×
×
  • Create New...