ZuniorVentiyar Posted July 2, 2014 Report Posted July 2, 2014 ఆంద్రప్రదేశ్ గనుల శాఖ డైరెక్టర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.టైటానియం ఖనిజ గనుల కేటాయింపులో డబ్బు చేతులు మారిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ మాజీ సలహాదారు కెవిపి రామచంద్రరావుపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఏకంగా అమెరికా ఎఫ్ బిఐ దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది.దానికి సంబందించి చంద్రబాబు ఆరా తీశారు. గనుల డైరెక్టర్ ను పిలిచి అడిగితే అదంతా సవ్యంగానే జరిగిందని చెప్పారట.తనకే ఆ అదికారి ఇలా చెబుతారా అని చంద్రబాబు మండిపడ్డారు.తక్షణం ఆ శాఖకు ఒక ఐ ఎ ఎస్ అదికారిని నియమించాలని ఆయన ఆదేశించారు.అవసరమైతే అలాంటి అదికారులను సస్పెండ్ చేసి ఒక ఐ ఎ ఎస్ అదికారిని నియమించి క్షాళన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. enti ee bureaucrats ila thayaru ayaru .....
Recommended Posts