timmy Posted July 3, 2014 Report Posted July 3, 2014 రెండు రూపాయలకే 20 లీటర్ల శుద్ధి చేసిన మంచినీరు అందించే ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకానికి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. టీడీపీ ఎన్నికల హామీలో భాగంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా... ఎన్నికల హామీల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Recommended Posts