Jump to content

Recommended Posts

Posted

https://www.youtube.com/watch?v=EEpCPD1l_yY

 

https://www.youtube.com/watch?v=3_56IihKO90

 

https://www.youtube.com/watch?v=1bZUE4wV01s

Posted

అమెరికా
 మెక్సికన్ కోక్...
 నిడదవోలు
 పాలకోవా...
 కర్నాటక
 సాంబార్...

 
 కీరవాణి అంటేనే ఓ స్వరధీర. కానీ ఆయన్ను కేవలం సంగీతానికే పరిమితం చేయలేం. నిజంగా ఆయనో వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా. ఏ టాపిక్ గురించైనా అనర్గళంగా, సాధికారికంగా మాట్లాడగలరు.ఒక్క ముక్కలో చెప్పాలంటే కీరవాణితో మాట్లాడ్డమే ఓ ఎడ్యుకేషన్. నేడు కీరవాణి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ చేసిన విభిన్న ప్రయత్నమిది.కథలు, కలలు, సినిమాలు, ప్రదేశాలు... ఇలా పది టాపిక్స్‌పై ఆయన చెప్పిన కబుర్లు.
 
 మంచి మాట
 ‘‘ఎదురుగా ఒక్క మనిషి ఉన్నా వాళ్లతో ఇంటరాక్ట్ కండి. ఏదో విధంగా... మంచిగానో, చెడుగానో, తిట్టుకుంటూనో, పొగుడుకుంటూనో. ఇక్కడ మాట్లాడటం ముఖ్యం. అంతేకానీ మనిషిని ఎదురుగా పెట్టుకుని ఫేస్‌బుక్‌లతో, ట్విట్టర్‌లతో గడపొద్దు. అది సభ్యత కాదు. మానవ సంబంధాల మెరుగుదలకూ అది మంచిది కాదు’’.
 
 మంచి మిత్రులు
 1. ఇంటర్ క్లాస్‌మేట్ ఈవీ సత్యనారాయణ. ఆయన ఇప్పుడు మలకపల్లి (ప.గో. జిల్లా)లో ఉంటారు.
 2. సినిమా ఇండస్ట్రీలో మిత్రులు లేరు. ఉన్నది కాంచీ. అతను నా తమ్ముడే. కానీ మంచి స్నేహితుడనే పోర్ట్‌ఫోలియో కూడా ఇవ్వాలి.
 
 ఇప్పటికిప్పుడు సినిమా ఇండస్ట్రీ  అంతా మాయమైపోతే డబ్బు సంపాదించడానికి  నాకు చేతనైన విద్యలు
 1. వినేవాడున్న చోట ఘంటసాలగారి పాటలు గాత్రకచ్చేరీ పెట్టడం. (నాకు పాడటం వచ్చును కాబట్టి)
 2. ఇంగ్లీషు పుస్తకాలను తెలుగులోకి అనువదించడం.     (నాకు బాగా తెలిసినవి ఇంగ్లీషు, తెలుగు కాబట్టి)
 3. దారికి అడ్డంగా వచ్చేసే బైక్ వీరులు లేని నిర్జనారణ్యాన్ని పోలిన లేక ఎడారిని పోలిన ఊళ్లల్లో టాక్సీ డ్రైవర్‌గా పనిచేయడం.     (నాకు ఎంచక్కా డ్రైవింగ్ తెలుసు కాబట్టి)
 
  ఫేవరెట్ ఐటెమ్స్
 1. షార్ట్ వేవ్, మీడియమ్ వేవ్.
  బ్యాండ్స్‌తో ఉన్న పాకెట్ రేడియో
 2. టార్చ్‌లైట్.
 3. ఐ ఫోన్.
 4. పోర్టబుల్ స్పీకర్.
 
 వంటకాలు
 1. అమెరికాలో మాత్రమే దొరికే మెక్సికన్ కోక్
 2. నిడదవోలు రైల్వేస్టేషన్‌లో మాత్రమే దొరికే సిలండర్ టైప్ ప్యాకెట్స్‌లోని పాలకోవా బిళ్లలు.
 3. కర్నాటక రాష్ట్రంలో మాత్రమే దొరికే సాంబార్
 4. నా వైఫ్ మాత్రమే చేయగలిగే     పప్పూ పులుసు.
 5. మా అమ్మగారు మాత్రమే చేయగల సున్నుండలు.
 
 నెరవేరుతాయో లేదో తెలీని కోరికలు
 1. అర్కాది గైదార్ అనే రష్యన్ రచయిత రాసిన ‘తిమూర్-అతని దళము’ అనే పుస్తకం చిన్నప్పుడు నా దగ్గరుండేది. ఎలా మిస్సయిందో మిస్సయింది. అది దొరుకుతుందో దొరకదో?
 2. జహంగీర్ అనే స్వీట్ చాలా బావుంటుంది. ఇప్పుడా స్వీట్ దాని ఒరిజినాల్టీ కోల్పోయి రూపాంతరం చెందింది. నా చిన్నప్పుడు తిన్నట్టుగా ఆరెంజ్ కలర్‌లో సాఫ్ట్‌గా మళ్లీ జహంగీర్ దొరికితే ఎంత బావుంటుందో!
 3. తెలుగు నిర్బంధ బోధనా భాషగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ అమలు కావడం చూడగలుగుతామో లేదో?
 4. ఇక కరెక్ట్‌గా రెండు సంవత్సరాల్లో రిటైర్మెంట్. ఈ రెండేళ్లలోగా ఎస్‌ఎస్ కాంచీ దర్శకత్వంలో సంగీతం సమకూర్చే అవకాశం ఉందో లేదో?
 5. ఇది వరకు చాలాసార్లు తిరుపతి నడిచి వెళ్లేవాణ్ణి. మళ్లీ నడిచి ఎక్కగలనో లేదో? ఎందుకంటే డాక్టర్లు మెట్లు ఎక్కొద్దన్నారు.
 6. నీళ్లంటే నాకు ఇష్టం. భయం కూడా. ఈత ఎప్పటికైనా నేర్చుకోగలనో లేదో?
 
 కలిసిన ప్రముఖులు
 1. ఎన్టీఆర్... ‘మేజర్ చంద్రకాంత్’ షూటింగ్‌లో
 2. జయలలిత... ‘అళగన్’ అనే తమిళ సినిమాకి స్టేట్ అవార్డ్ అందుకుంటున్న సందర్భంలో.
 3. పి.వి. నరసింహారావు... ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో.
 4. నరేంద్ర మోడీ... సినీ ప్రముఖులతో జరిగిన మీటింగ్‌లో.
 5. కన్నడ రాజ్‌కుమార్... ఆయనతో ఓ పాట పాడించిన సందర్భంలో.
 6. రాష్ట్రపతి వెంకట్రామన్... జాతీయ అవార్డు అందుకుంటున్నపుడు.
 7. మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్‌గారు చనిపోయినపుడు మహావీర్ ఆసుపత్రికి పరామర్శకు వెళ్లాను. అక్కడ ఓ గదిలో నాతో పాటు మరో ఇద్దరు కూర్చున్నారు. అరగంట ఉన్నా... ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మౌనంగానే ఉండిపోయాం. ఒకరేమో భవనం వెంకట్రామ్‌గారి భార్య జయప్రదగారు. ఇంకొకరు వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు.
 (వీరందర్నీ ఒకే ఒక్కసారి కలిశాను. అదికూడా రాజకీయేతర కారణాలతో మాత్రమే)
 
 ఇష్టమైన ప్రదేశాలు
 1. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని మా ఓల్డ్ టౌన్‌లోని     శివాలయం.
 2. పట్టిసీమ ద్వీపం మొత్తం ఇష్టమే.
 3. తూ.గో.జిల్లా వడ్లమూరులో మా అమ్మమ్మగారు నడిపిన రైస్ మిల్లు.
 4. హంపి విజయనగరంలోని శిథిలాలు.
 5. వైజాగ్ రామకృష్ణా బీచ్‌లో ఉన్న కాళీ టెంపుల్.
 6. మధురైలోని మీనాక్షి ఆలయం.
 7. చెన్నై-ఎమ్జీ చక్రపాణి స్ట్రీట్‌లోని 44వ నంబర్ ఇల్లు. ఒకప్పుడు మేం అందులోనే ఉండేవాళ్లం. మేమంతా మంచి భవిష్యత్తు కోసం కలలు కంటూ గడిపిన చిన్న ఇల్లు అది.
 8. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఆర్.నారాయణమూర్తి గారితో కూర్చుని మాట్లాడుకునే సిమెంటు గట్టు.
 
  నా సినిమాల్లో మెచ్చినవి
 1. సీతారామయ్య గారి మనవరాలు
  (1990), 2. క్షణక్షణం (1991),
 3. మిస్టర్ పెళ్లాం (1993)
 4. మాతృదేవోభవ (1993),
 5. పెళ్లి సందడి (1996), 6. అన్నమయ్య
 (1997), 7. వేదం (2010),
 8. మర్యాద రామన్న (2010),
 9. ఈగ (2012)
 
  నచ్చిన కథలు
 1. చలం రాసిన షార్ట్ స్టోరీ ‘అభినవ సారంగధరుడు’.
 2. కప్పగంతుల సత్యనారాయణ రాసిన ‘రమణి రాసిన ఉత్తరం’ అనే పుస్తకంలోని ‘సత్యాగ్రహం’ కథ.
 3. డి. వెంకట్రామయ్య రచించిన ‘డి. వెంకట్రామయ్య కథలు’ బుక్‌లో ‘పండగొచ్చింది’ కథ.
 4. మాజీ ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు రాసిన ‘పోలీసు చమత్కారాలు’ పుస్తకంలోని ‘మాబ్ సైకాలజీ రోదనోపాయం’ అనే కథ.
 5. లియో టాల్‌స్టాయ్ అనే రష్యన్ రచయిత రాసిన ‘సింహము-కుక్కపిల్ల’ కథ.
 6. సత్యం శంకరమంచి రాసిన ‘అమరావతి కథలు’లోని ‘తృప్తి’ అనే కథ
 7. వంశీ రాసిన ‘మా పసలపూడి కథలు’ పుస్తకంలోని ‘ప్రేమించింది ఎందుకంటే’ కథ.
 8. ముళ్లపూడి వెంకటరమణ ‘రాజకీయ బేతాళ పంచవించతి’లోని ‘అంతకింతయితే ఇంతకెంత?’ అనే కథ.
 9. నగ్నముని షార్ట్‌స్టోరీస్‌లోని ‘అమలిన శృంగారం’ అనే కథ.
 10. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’లోని ప్రతి పేజీ... ప్రతి అక్షరం...
 

Courtesy :- Sakshi Telugu Daily

×
×
  • Create New...