timmy Posted July 6, 2014 Report Posted July 6, 2014 ఇరాక్ నుంచి ఇప్పటిదాకా 300 మందికి పైగా భారతీయులను వెనక్కి తీసుకొచ్చామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో మరో 286 మందిని తీసుకొస్తామని వెల్లడించింది. ఇరాక్ లో చిక్కుకున్న మన దేశీయులను తీసుకొచ్చేందుకు ఆ దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మొబైల్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపింది. భారతీయుల తిరుగు ప్రయాణానికి ఈ టీంలు సహకరిస్తాయని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు.
Recommended Posts