Jump to content

Recommended Posts

Posted

10436018_312356162267223_296218952438136

 

 

 

10440629_312356165600556_578233405927253

 

 

10492452_312356192267220_862598960026451

 

 

 

 

భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కాంబోడియాలోని "అంగ్‌కోర్‌ వాట్ దేవాలయం". ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి, హిందూ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది.కాంబోడియ, అలనాటి కాంభోజ రాజ్యము, తర్వాత కంపూచియ, నేటి కంబోడియ.

ఉత్తర కాంబోడియాలో సియమ్‌రీప్‌ అను పట్టణం దగ్గర 200 చదరపు కిలో మీటర్ల పరిధిలో దేవతలకు నిలయమైన పవిత్రస్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సముదాయంగా ప్రసిద్ధి గాంచిన ప్రదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంగ్‌కోర్‌ వాట్‌, బయాన్‌ అను దేవాలయాలతోబాటు అనేక దేవాలయాలు విలసిల్లు చున్నవి. ఖెమర్‌ రాజులచే కట్టబడిన ఈ దేవాలయం మన హిందూ నాగరికతకు ఆనవాళ్ళు. మూడవ శతాబ్దం నుండి దాదాపు వేయి సంవత్సరాలకు పైగా హైందవ నాగరికత కంబోడియలో ఉచ్ఛస్థితిలో ఉంది
కాంబోడియలో దాదాపు 1016 దేవాలయాలున్నాయని ప్రసిద్ధి. అందులో అంగ్‌కోర్‌ ప్రావిన్స్‌ నందు 294 దేవాలయాలున్నాయి. వీటిలో అంగ్‌కోర్‌ ప్రాంతంలో 198దేవాలయాలున్నవి. బట్టంబాన్స్‌ ప్రావిన్స్‌ ధాయిలాండ్‌ సరిహద్దులో నున్నది. ఆ ప్రాంతమునందు 340 దేవాలయాలు వున్నవి. సియామ్‌రీప్‌ పట్టణానికి చుట్టుపక్కల హిందూ దేవాలయాలతో బాటు బౌద్ధ దేవాలయాలు కూడా వున్నాయి.
తొలుత హిందూ దేవాలయ ములతో మొదలైన వారి నాగరికత మధ్యలో 12వ శతాబ్ద మందు ఏడవ జయవర్మన్‌ అను రాజు కాలమందు బౌద్ధమత వ్యాప్తి జరిగింది. రాజు బౌద్ధమతం అవలంబించుటచే స్వతహాగా, రాజు అనేక బౌద్ధ దేవాలయాలు నిర్మించి నను, ఆ దేవాలయములందు హిందూ దేవతల ప్రతిమలు చెక్కబడివున్నవి. ఆ తర్వాత ఎనిమిదవ జయవర్మన్‌ రాజు 13వ శతాబ్దమందు అనేక బౌద్ధ దేవాలయములను హిందూ దేవాలయాలుగా మార్పు చేసారు.
కాంబోడియ దేశం ఏ విధంగా ఏర్పడిందో అన్నదాని గురించి అనేక కథనాలున్నాయి. ఒక బ్రాహ్మణుడో లేక చోళరాజవంశీయుడో హిందూదేశం నుండి సముద్ర మార్గాన ప్రయాణించి నాగను
వివాహమాడెనని ఒక కథనం. ఖేమర్‌ కథనం ప్రకారం వారి రాజులు కాము రాజవంశస్తులని, ఖెమర్‌
ఐతికాసిన వారసులని చెప్పబడింది. కామరాజవంశీకుడైన ప్రేథాంగ్‌ రాజుచే బహిష్కరించబడి, వ్రపాస జీవితం గడపుటకు సముద్ర మార్గాన ప్రయాణించుండగా బహిష్కరించబడి, ప్రవాస జీవితం గడుపు టకు సముద్ర మార్‌న ప్రయాణించుచుండగా అద్భుతమైన నాగినిని చూసి వివాహమాడెను. ఆమె తండ్రి నాగరాజు సముద్ర మధ్యములో నేలపై నున్న నీటిని త్రాగి, ఆనేలపై ఒక రాజధానిని నిర్మించి నిర్మించి ఆ రాజ్యమును వారికి కానుకగా ఇచ్చెను. దానినే కాంభోజ అని పేరు పెట్టెనని ఖెమర్‌ కథనం. శిలా శాసనమునందు కాంబు స్వయంభువ అనుముని పరమశివునిచే ఒసంగబడిన మేర అను కన్య కను వివాహమాడుట వలన ఈ రాజువంశమేర్పడిందని వున్నది.
అంగోక్‌ శకం : క్రీ స్తు శకం 802 వ సంవత్సరం రెండవ జయవర్మన్‌ రాజు నామ్‌కులన్‌ను పర్వతం (మహేంద్ర పర్వతం) పై దేవరాజక్రతువు నాచరించి మహారాజుగా ప్రకటించుకొనుట ద్వారా అంగ్‌కోర్‌ శకానికి నాంది పలికెను. ఈ సంఘటన పాలి, సంస్కృతం, ఖెమర్‌ భాషలందు శిలా శాసనములలో తెలుపబడినది.
కంబోడియలో ఖెమర్‌లచే అతి పవిత్రమైన పర్వతముగా ప్రసిద్ధిగాంచినది. రెండవ జయవర్మన్‌ జావా నుంచి వచ్చి ఇచ్చటినుంచే స్వాతంత్య్రాన్ని ప్రకటించి కాంభోజరాజ్యాన్ని స్థాపించెను. దేవరాజునే కొత్త సాంప్రదాయాన్ని మొదలుపెట్టి దేవుని తర్వాత రాజుదే మొదటి స్థానమని ప్రజలలో నమ్మకాన్ని కలుగ చేసెను. శివుని లింగపూజతో పూజించు విధానాన్ని అమలు పెట్టెను. నామ్‌కులన్‌ పర్వతాలపై నుండి వచ్చు సియామ్‌రీప్‌ నది అడుగున వున్న రాతిపై వేయిశివలింగాలను చెక్కించెను. కొండపై నుండి వచ్చే నీరు వేయిలింగాలపై ప్రవహించి కొండ కింద ఉండే పంటపొలాలకు వాడుకొనుచుండిరి. ఈ పవిత్రమైన నీటివల్ల పంటలు సమృద్ధిగా పండెెవని ప్రతీతి.
అంగ్‌కోర్‌ వాట్‌ : మొదటి సూర్యవర్మన్‌ 21వ శతాబ్దంలో నిర్మించిన అనేక దేవాలయాలలో ఇది ముఖ్యమైంది. దీనినే తన ముఖ్యపట్టణంగాచేసుకొని రాజ్యమేలు చుండెను. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం 510 ఎకరాలలో 213 ఎత్తైన ఈ దేవాలయంలో శ్రీమహావిష్ణువు పూజింప బడెడివాడు. బౌద్ధమతం ఆచరణలోకి వచ్చిన తర్వాత బుద్ధుని విగ్రహం ప్రతిష్ఠింపబడింది. పడమటి వైపు ముఖద్వారమున్న కోటను పోలివున్న అంగ్‌కోర్‌ వాట్‌ చుట్టూ వున్న అగడ్త, కోట గోడ దాదాపు
ఐదున్నర కిలోమీటర్ల పొడవున్నది. అగడ్తను దాటుటకు వున్న వంతెన 255 మీటర్ల పొడవున్నది.ఖ్మేర్ పరిపాలనలో నీటిని నిల్వ ఉంచుకుని.. కరువు కాటకాలప్పుడు వాడుకునే టెక్నాలజీని అప్పట్లోనే అమలు చేశారు. కాబట్టే.. ఆ సామ్రాజ్యంలో కరువు ఛాయలు ఉండేవికావట. వీరు నీటిని నిల్వ ఉంచేందుకు వాటిన టెక్నాలజీలో.. నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించేదట.. ఇదే టెక్నాలజీని అంగ్‌కోర్ వాట్ ఆలయ నిర్మాణంలో వాడారు. ఈ టెక్నాలజీ ఎలా సాధ్యమయ్యిందనే విషయం నేటి ఆధునిక సాంకేతిన నిపుణులకు సైతం అంతుబట్టకుండా ఉంది.ఇరు ప్రక్కల నాగపడగ దాని శరీరమంతా అలంకరించబడింది. ముఖద్వారం మూడు గోపురాలతో కూడి వున్నది ద్వారంపై బ్రహ్మ, విష్ణువు, లక్ష్మీ, అప్సరసల విగ్రహాలతో అలంకరించబడింది. అంగ్‌కోర్‌ వాట్‌ నందు దాదాపు 16 రాతి అప్పరసల విగ్రహాలు చెక్కబడివున్నవి. ప్రతి ఒక్కదానికి, మరొక్క దానితో పోలిక లేకుండా చెక్కబడింది. ముఖద్వారం నుండి ప్రధాన ఆలయానికి పోవు దారితో ఇరువైపుల గ్రంథాలయ భవనాలున్నాయి. ప్రధాన ఆలయం మూడు వసారాలతో కూడుకున్నది.
అంగ్‌కోర్‌ వాట్‌ ప్రధాన ఆలయం చుట్టూవున్న మూడవ వసారాలో గోడలపై చెక్కివున్న శిల్ప కళ అత్యద్భుతం ఈ నాల్గువైపుల దాదాపు ఒక కిలోమీటరు వున్న వసారాలో 13 అడుగుల ఎత్తైనగోడలపై హిందూపురాణాలన్నియు చెక్కబడివున్నవి. పడమట వసార దక్షిణం వైపు కురుక్షేత్ర యుద్ధం చిత్రీకరించబడినది. భీష్ముడు అంపశయ్యపై శయనించిన దృశ్యం మొదలు యుద్ధంలో పాండవులు కౌరవులు యద్ధంచేయు దృశ్యములు చక్కగా చెక్కబడినవి. నైరుతి మూలవున్న గదిలో హిందూ ఇతిహాసముల గూర్చి చిత్రీకరించివున్నవి. గరుడునిపై వున్న విష్ణువు, రావణుడుకైలాస పర్వతాన్ని ఎత్తుట, శివుడు అడవిలో ధ్యానించుట, సూర్య చంద్రులు, రాముడు వాలిని సంహ రించుట మొదలగు దృశ్యములున్నవి.
దక్షిణవసారా పడమటివైపు రెండవ సూర్యవర్మన్‌ రాజు పరివారంతో పోవు ఊరేగింపు దృశ్యమున్నది. దక్షిణపువసారా తూర్పువైపు మానవులు మరణించిన తర్వాత స్వర్గం, నరకాలకు పోవుట, అచ్చట వారు ఏ విధంగా వారి యొక్క పుణ్య, పాపఫలాలను అనుభవించు దృశ్యాలు చెక్కివు న్నారు. మూడు వరుసలలో వున్న ఈ దృశ్యంలో పై రెండు వరసలలో పుణ్యం చేసినవారు స్వర్గానికి పోవుట, క్రింది వరుసలోని వారు పాపఫలాలను అనుభవించుటకు నరకమునకు పోవుట వున్నవి. యమధర్మరాజు వృషభముపైన వున్నదృశ్యం, చిత్రగుప్తుడు, మరియు రౌరవాది నరకములలో పాపులను దండిచుట చక్కగా చెక్కారు.
ఇలాంటి దేవాలయాలు ప్రపంచంలో ఎన్నో ఉండి ఉంటాయి. అవి కాలగర్భంలో కలసిపోయాయి .ఈ భూమి పుట్టక ముందునుంచి హింధు మతం ఉంది అది ఎప్పటికి ఉంటుంది...........

Posted

Now it is a buddhist temple.
Valla country flag meda vuntadi ee temple.. Thats how much value they give to it :)

Posted

Now it is a buddhist temple.
Valla country flag meda vuntadi ee temple.. Thats how much value they give to it :)

 

 

flag-cambodia-XL.jpg

Posted

I hv one frnd from comb.. vala pictures chusa. chaala similar ga untayi.. mana villages la

 

and temples kuda..mana kattadalu la unnayi.. 

Posted

I hv one frnd from comb.. vala pictures chusa. chaala similar ga untayi.. mana villages la

 

and temples kuda..mana kattadalu la unnayi.. 

 

ok

×
×
  • Create New...